బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ 2 నెలల్లో 8 కేజీలు తగ్గారు. ‘చక్రవర్తి సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్’ సీరియల్‌లో ఆయన సోమేశ్వర్ మహారాజ్ పాత్ర పోషిస్తున్నారు. దీంతో “కింగ్’లా కనిపించేందుకు చాలా కష్టపడ్డట్లు ఆయన చెప్పారు. కఠిన వ్యాయామాలు, ఉదయం, సాయంత్రం కార్డియో వర్కౌట్స్ చేసినట్లు నటుడు తెలిపారు. అంతేకాక 2 నెలల్లో 8 కేజీలు తగ్గినట్లు చెప్పారు. మార్షల్ ఆర్ట్స్, కర్రసాము సైతం నేర్చుకున్నట్లు వెల్లడించారు.