Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • జైనాబ్ కుటుంబానికి స్వాగతం: నాగ చైతన్య

    అక్కినేని అఖిల్- జైనాబ్ల వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు నాగ చైతన్య సోషల్ మీడియాలో ‘ప్రియమైన జైనాబ్ కుటుంబానికి అక్కినేని కుటుంబంలోకి స్వాగతం’ అని తెలిపారు. ఈ క్రమంలో నూతన వధూవరులు అఖిల్- జైనాబ్లకు అభినందనలు అని అక్కినేని నాగ చైతన్య అక్కినేని కుటుంబానికి సంబంధించిన ఓ ఫోటోను పంచుకున్నారు.

  • ‘క‌న్న‌ప్ప’ రన్ టైమ్ లాక్.. నిడివి ఎంతంటే?

    మంచు విష్ణు నటిస్తున్న ‘క‌న్న‌ప్ప’ మూవీ జూన్ 27న విడుదలకానుంది. ప్ర‌భాస్, మోహ‌న్ లాల్, అక్ష‌య్ కుమార్ , మోహ‌న్ బాబు లాంటి న‌టుల‌తో భారీ స్థాయిలో తెర‌కెక్కింది. తాజాగా ఈ సినిమా ర‌న్ టైమ్ లాక్ అయిందని తెలుస్తోంది. ఈ చిత్రం 3 గంటల 10 నిమిషాల భారీ రన్‌టైమ్‌ను మేకర్స్ లాక్ చేశారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

  • ఆది ‘శంబాల’ టీజర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

    ఆది సాయికుమార్‌ హీరోగా యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘శంబాల’. ఈ సినిమా టీజర్‌ను రేపు ఉ. 11:32గంటలకు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేకర్స్ ప్రకటించారు.

  • అక్కినేని అఖిల్‌ మ్యారేజ్.. నాగార్జున ఎమోషనల్ పోస్ట్!

    అఖిల్‌ అక్కినేని-జైనబ్‌తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. తన కుమారుడి పెళ్లిపై ఆనందం వ్యక్తం చేస్తూ హీరో నాగార్జున సోషల్‌‌మీడియా వేదికగా పోస్ట్ పంచుకున్నారు. తాను, తన భార్య అమల ఈ క్షణం కోసం ఎంతో ఎదురుచూశామని.. అఖిల్-జైనబ్‌ మూడుముళ్ల బంధంతో ఒక్కటి కావడం తమకు అమితమైన సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కొత్త జంటను అందరూ ఆశీర్వదించండని ఆయన కోరారు.

  • ప్రభాస్ ఫ్యాన్స్ సర్‌ప్రైజ్.. ఒక్క మూవీగా ‘బాహుబ‌లి’ రీ-రిలీజ్!

    ప్రభాస్ నటించిన ‘బాహుబ‌లి’ సినిమాను మళ్లీ విడుదల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈమూవీని అక్టోబర్‌లో థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నరట. అయితే ఫ్యాన్స్ కోసం మేకర్స్ కొత్త ట్రీట్ ఇవ్వనున్నారు. ‘బాహుబ‌లి’ రెండు పార్టులను ట్రిమ్ చేసి ఒకే భాగంగా రిలీజ్ చేయాల‌ని చూస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఎడిటింగ్ వ‌ర్క్స్‌ను కూడా మొద‌లుపెట్టార‌ని అంటున్నారు. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

  • AA22 x A6పై బిగ్ అప్డేట్.. ఎప్పుడంటే!

    పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ .. అట్లీ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత కళా నిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ రానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు అదేంటో చెబుతామని పేర్కొంది.

  • ఓటీటీలోకి స్పోర్ట్స్‌ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

    మలయాళ స్పోర్ట్స్‌ డ్రామా మూవీ ‘అలప్పుజ జింఖానా’ ఓటీటీ విడుదల తేదీపై తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. ‘సోనీలివ్‌’లో ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మలయాళం, తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ ఆడియోతో అందుబాటులో ఉండనుంది. ‘ప్రేమలు’ ఫేమ్‌ నస్లేన్‌, లక్మన్‌ అవరన్‌, సందీప్‌ ప్రదీప్‌, అనఘ రవి తదితరులు ప్రధాన పాత్రల్లో ఖలీద్‌ రెహమాన్‌ తెరకెక్కించిన స్పోర్ట్స్‌ డ్రామా చిత్రమిది.

  • ‘చాలా రోజుల తర్వాత’.. శ్రీలీల పోస్ట్ వైరల్!

    టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో కుర్రాళ్లకు మత్తెక్కించే ఫొటోలు పంచుకుని.. ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది. ‘‘చాలా రోజుల తర్వాత’’ అని క్యాప్షన్ జోడించింది. శ్రీలీల పంచుకున్న హాట్ ఫొటోల్లో తన గాజులు మరింత హైలెట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ హీరోయిన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • ‘8 వసంతాలు’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌!

    అనంతిక స‌నిల్ కుమార్ ప్రధానపాత్రలో న‌టిస్తున్న చిత్రం ‘8 వసంతాలు’. ఈ సినిమా నుంచి రేపు మ. 3:33 గంటలకు 2వ టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేకర్స్ ప్రకటించారు.

     

  • హాలీవుడ్ మూవీలో స‌ల్మాన్-సంజ‌య్.. టీజర్ రిలీజ్

    స‌ల్మాన్‌ఖాన్, సంజ‌య్‌ద‌త్‌లు ‘7డాగ్స్’ హాలీవుడ్ సినిమాలో క‌నిపించ‌బోతున్నారు. ఈ మూవీలో ఈజిప్టియన్ స్టార్స్ కరీమ్ అబ్దుల్ అజీజ్, అహ్మద్ ఎజ్ ప్రధానపాత్రల్లో నటిస్తుండ‌గా.. ఆదిల్ ఎల్ అర్బీ-బిలాల్ ఫల్లాహ్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సౌదీ అరేబియన్ యాక్షన్-కామెడీగా రూపొందుతోంది. తాజాగా టీజ‌ర్‌ని మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో స‌ల్మాన్ వైట్ బ్లేజ‌ర్‌లో ఆక‌ట్టుకోగా.. సంజయ్‌దత్ గ‌న్‌ పట్టుకొని కనిపించాడు.