Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • రెడ్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ అందాలు!

    బాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సోషల్‌మీడియా వేదికగా తన లేటెస్ట్ ఫోటోస్ పంచుకుంది. ఇందులో ఆమె రెడ్ ధరించి స్టైలిస్ లుక్‌లో కనిపిస్తోంది. ఈ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

  • కమల్‌ ‘థగ్ లైఫ్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?

    కమల్‌హాసన్-మణిరత్నం కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. ఈమూవీ నిన్న తెలుగు, తమిళంలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ఈ సినిమాకు తొలిరోజు ఓ మాదిరి కలెక్షన్స్ వచ్చాయి. దేశవ్యాప్తంగా రూ.17 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.కోటి షేర్ కూడా రాలేదని అంటున్నారు. కమల్-మణిరత్నం కాంబోకి ఇది చాలా తక్కువ మొత్తం అని చెప్పొచ్చు.

  • అభిమాని కొడుక్కి అన్నం తినిపించిన బాలయ్య.. వీడియో వైరల్

    బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్‌’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద హిట్ అందుకుంది. అయితే ఆ సినిమా షూటింగ్‌ సమయంలో సజ్జద్ అనే అభిమాని ఆయనను చూసేందుకు తన ఫ్యామిలీతో వెళ్లాడు.  అప్పుడు బాలయ్య వారిని కలిసి కాసేపు మాట్లాడారు. అలాగే ఆ అభిమాని కొడుక్కి అన్నం కూడా తిపించాడు. దీనికి సంబంధించిన వీడియోను సజ్జద్ సోషల్‌మీడియాలో పంచుకోగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

  • పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ హీరోయిన్

    బాలీవుడ్ హీరోయిన్‌ షాజన్ పదమ్సీ పెళ్లి చేసుకుంది. మూవీ మాక్స్ సినిమా సీఈఓ ఆశిష్ కనకియా.. షాజన్‌కి కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసి.. ఇప్పుడు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ముంబైలో పెళ్లి చేసుకున్నారు. జూన్ 5న అంటే గురువారం రాత్రి వీరి వివాహ వేడుక జరిగింది. జూన్ 7న రిసెప్షన్ జరగనుంది. ఇక షాజన్ టాలీవుడ్‌లో ‘ఆరెంజ్’,‘మసాలా’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.

  • బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన కియారా

    హీరోయిన్ కియారా అద్వానీ లేటెస్ట్ పిక్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో కియారా పెద్ద బేబీ బంప్‌తో దర్శనమిచ్చింది. వైట్ కలర్ డ్రెస్‌లో ఎంతో అందంగా కనిపిస్తోంది.

  • ప్రియ‌ద‌ర్శి ‘మిత్ర‌మండ‌లి’.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

    ప్రియ‌ద‌ర్శి-నిహారిక జంట‌గా న‌టించ‌బోతున్న చిత్రం ‘మిత్ర‌మండ‌లి’. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ సినిమాతో ఎస్ విజయేంద్ర దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను మేకర్స్ విడుద‌ల చేశారు. ఈ సినిమా బ్యాండ్ ట్రూప్‌ నేప‌థ్యంలో రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. బన్నీ వాసు సమర్పిస్తుండగా.. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

  • Video: పవన్, ప్రభాస్ సినిమాలపై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

    మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా ‘కన్నప్ప’. ఈనెల 27న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో విష్ణు ఓ ఇంటర్వ్యూలో చిత్ర బడ్జెట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘‘కన్నప్ప బడ్జెట్ ట్రిపుల్ ఫిగర్స్‌లో ఉంది. ‘రాజాసాబ్’, ‘ఓజీ’ సినిమాల కంటే మా మూవీ బడ్జెట్ చాలా ఎక్కువ’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

  • ఆ నిర్మాత కోసం రూ.50 కోట్లు తగ్గించుకున్న ప్రభాస్!

    ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈమూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ రూ.150 కోట్లు కాకుండా రూ.100 కోట్లే తీసుకుంటున్నాడట. ఎందుకంటే.. గతంలో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రంతో ఈ నిర్మాత నష్టాలను చవిచూశారు. అందుకే ఆయన కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ తగ్గించినట్లు తెలుస్తోంది.

     

  • ‘హరి హర వీరమల్లు’ మూవీ రిలీజ్ వాయిదా

    పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’.  జూన్‌ 12న ఇది విడుదలవుతుందని భావించిన అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా పడినట్లు టీమ్‌ తాజాగా అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా త్వరలోనే ట్రైలర్‌ రిలీజ్‌ కానుందని.. కొత్త విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని టీమ్‌ వెల్లడించింది.

  • రవి–కెనీషా ఫొటోలు వైరల్-పెళ్లి చేసుకున్నారా?

    కోలీవుడ్ హీరో రవి ,కెనీషా  కలిసి మురుగన్ దేవాలయంలో దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా వైరల్‌గా మారాయి. వీరి మెడలో పూల దండలు కనిపించడంతో, “పెళ్లి చేసుకున్నారా?” అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్​ చేస్తున్నారు.  గతేడాది  రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్తితో విడాకుల వెనుక కెనీషాతో ఉన్న సంబంధమే కారణమని వార్తలు వచ్చాయి.