ప్రముఖ బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెలపై రాజస్థాన్‌లో కేసు నమోదైంది. తాను కొనుగోలు చేసిన హ్యుందాయ్ అల్కాజర్ కారులో తయారీ లోపం ఉందని, కంపెనీ మోసం చేసిందంటూ కీర్తి సింగ్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న షారుఖ్, దీపిక తప్పుదోవ పట్టించే ప్రచారం చేశారని ఆరోపిస్తూ, వారిపై కూడా మోసం, నేరపూరిత కుట్ర కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.