Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • పవన్ సూపర్ హిట్ మూవీ రీ-రిలీజ్.. ఎప్పుడంటే?

    పవన్ కల్యాణ్-కీర్తి రెడ్డి జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘తొలిప్రేమ’ మరోసారి విడుదలకు సిద్ధమైంది. జూన్ 14న ఈచిత్రాన్ని 4Kవర్షన్‌లో రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

  • కుంభకోణం కేసు.. ప్రముఖ నటుడుకి ఈడీ నోటీసులు!

    ముంబయిలోని మిథి నది కుంభకోణంలో బాలీవుడ్ నటుడు డినో మోరియాకు ఈడీ సమన్లు జారీ చేసింది. అలాగే నటుడి సోదరుడితో పాటు ఎనిమిది మందిని వచ్చేవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఇటీవల నటుడికి చెందిన కార్యాలయాలు, నివాసంపై ఈడీ దాడి చేసిన విషయం తెలిసిందే. మిథి నది పూడికతీత కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్‌ కింద కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తున్నది.

  • ఓటీటీలో ట్రెండింగ్ అవుతున్న ‘జాట్’

    సన్నీదేవోల్‌ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘జాట్‌’. ఈ సినిమా థియేటర్లలో రూ.100 కోట్లకుపైగా రాబట్టింది. ఇప్పుడీ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో హిందీ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రస్తుతం ఇండియా వైడ్‌గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈవిషయాన్ని తెలుపుతూ మేకర్స్ తాజాగా సరికొత్త పోస్టర్ పంచుకున్నారు. దీనికి పార్ట్-2 కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

  • స్విమ్మింగ్ పూల్‌లో సమంత.. ఫ్యాన్స్ ఫిదా!

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల దుబాయ్‌ టూర్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడి అందాలను ఆస్వాదిస్తూ SMలో ఫోటోలను పంచుకుంది. తాజాగా సామ్ స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ చేస్తూ ఓ బోల్డ్ ఫోటోను షేర్ చేసింది. అందులో బ్లాక్ డ్రెస్‌లో కనిపించింది. ఈ ఫోటోను స్వయంగా సమంత పంచుకోవడంతో వైరల్‌గా మారింది. ఈ పిక్స్ చూసిన ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

  • సినీఇండస్ట్రీలో 8 గంటల పని.. రానా ఏమన్నాడంటే?

    నటుడు రానా దగ్గుబాటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మూవీ ఇండస్ట్రీలో 8 గంటలు పనిపై స్పందించాడు. ప్రాజెక్ట్‌ బట్టి ఆ సమయాల్లో మార్పు ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. పని గంటలపై ఎవరూ ఎవరినీ ఒత్తిడి చేయలేరు. కేవలం నాలుగు గంటలు మాత్రమే పనిచేసే నటులు కూడా ఇండస్ట్రీలో ఉన్నారని రానా వెల్లడించాడు.

  • తాండవం షురూ.. ‘అఖండ-2’ మాస్ అప్‌డేట్!

    బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ-2’. ఈ మూవీ నుంచి రేపు ఉ.10:54గంటలకు మాస్ అప్‌డేట్ రానుందంటూ మేకర్స్ తాజాగా పోస్టర్ ద్వారా ప్రకటించారు.

  • రాజ్‌ ఠాక్రేతో అనుబంధం.. నటి అసహనం

    మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్‌ సేన అధినేత రాజ్‌‌ఠాక్రేతో తనకు అనుబంధం ఉందంటూ జరిగిన ప్రచారంపై నటి సోనాలి బింద్రే స్పందించారు. ‘‘ఇలాంటి ప్రచారం జరిగినట్లు నా దృష్టికి రాలేదు. నిజంగా ఇది బాధాకరం. రాజ్‌ సతీమణి, ఆమె తల్లికి మా పిన్ని మంచి స్నేహితురాలు. ఆ విధంగా ఇరుకుటుంబాల మధ్య మా చిన్నతనం నుంచే మంచి స్నేహం ఏర్పడింది’’ అని సోనాలి బింద్రే చెప్పారు.

  • ‘నాకు బాధ కలిగించే ప్రదేశంలో’.. మెగాడాటర్ ఆసక్తికర పోస్ట్!

    మెగాడాటర్ నిహారిక కొణిదెల పెట్టి తాజా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ అమ్మడు జిమ్‌లో వర్క్ అవుట్ చేస్తున్న ఫొటోస్‌ను షేర్ చేస్తూ.. ‘‘నా.. నేను కోరుకునే బాధను కలిగించే ప్రదేశంలోని చిత్రం ఇది’’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సూపర్ ఫిట్‌గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

  • Video: స్టేజీపైనే ప్రేయ‌సికి ప్ర‌పోజ్ చేసిన ద‌ర్శ‌కుడు

    త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. అభిషన్ జీవింత్ ద‌ర్శ‌కుడు. ఇటీవల ఈ సినిమా ఈవెంట్‌లో అభిషన్ త‌న ప్రేయసి అఖిల‌కు స్టేజీపై నుంచే ప్ర‌పోజ్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ‘‘అక్టోబ‌ర్ 31న నువ్వు న‌న్ను పెళ్లి చేసుకుంటావా. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను’’ అంటూ అభిష‌న్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

  • గోల్డెన్ బ్యూటీగా అనసూయ

    నటి అనసూయ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మీ గోల్డెన్ గర్ల్’ అనే క్యాప్షన్‌తో హాట్ ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె బంగారు రంగు దుస్తుల్లో మెరిసిపోతోంది.