మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన అధినేత రాజ్‌ఠాక్రేతో తనకు అనుబంధం ఉందంటూ జరిగిన ప్రచారంపై నటి సోనాలి బింద్రే స్పందించారు. ‘‘ఇలాంటి ప్రచారం జరిగినట్లు నా దృష్టికి రాలేదు. నిజంగా ఇది బాధాకరం. రాజ్ సతీమణి, ఆమె తల్లికి మా పిన్ని మంచి స్నేహితురాలు. ఆ విధంగా ఇరుకుటుంబాల మధ్య మా చిన్నతనం నుంచే మంచి స్నేహం ఏర్పడింది’’ అని సోనాలి బింద్రే చెప్పారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘నాకు బాధ కలిగించే ప్రదేశంలో’.. మెగాడాటర్ ఆసక్తికర పోస్ట్!
మెగాడాటర్ నిహారిక కొణిదెల పెట్టి తాజా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ అమ్మడు జిమ్‌లో వర్క్ అవుట్ చేస్తున్న ఫొటోస్‌ను షేర్ చేస్తూ.. ‘‘నా.. నేను కోరుకునే బాధను కలిగించే ప్రదేశంలోని చిత్రం ఇది’’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సూపర్ ఫిట్‌గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
-
Video: స్టేజీపైనే ప్రేయసికి ప్రపోజ్ చేసిన దర్శకుడు
తమిళంలో బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. అభిషన్ జీవింత్ దర్శకుడు. ఇటీవల ఈ సినిమా ఈవెంట్‌లో అభిషన్ తన ప్రేయసి అఖిలకు స్టేజీపై నుంచే ప్రపోజ్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ‘‘అక్టోబర్ 31న నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను’’ అంటూ అభిషన్ ఎమోషనల్ అయ్యాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
-
గోల్డెన్ బ్యూటీగా అనసూయ
నటి అనసూయ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మీ గోల్డెన్ గర్ల్’ అనే క్యాప్షన్‌తో హాట్ ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె బంగారు రంగు దుస్తుల్లో మెరిసిపోతోంది.
-
‘అందాల రాక్షసి’ రీ-రిలీజ్.. స్పెషల్ వీడియో!
నవీన్‌చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అందాల రాక్షసి’. హను రాఘవపూడి దర్శకుడు. 2012లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ సినిమాను 4K వెర్షన్‌లో మేకర్స్ రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ జూన్ 13న మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
-
మనసుకు హత్తుకునేలా.. ‘8 వసంతాలు’ టీజర్ 2
హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ ప్రధానపాత్రలో ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ‘8 వసంతాలు’. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా 2వ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఇది మనసుకు హత్తుకునే డైలాగ్స్‌తో ఫీల్ గుడ్ మూవీగా అనిపిస్తోంది.
-
గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్
హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టా వేదికగా లేటెస్ట్ ఫొటోలు పంచుకుంది. అందులో గ్రీన్ కలర్ డ్రెస్‌లో హాట్‌గా కనిపిస్తోంది. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
-
ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలివే!
ఈ వారం పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యాయి. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి. అమెజాన్ ప్రైమ్‌లో ‘#సింగిల్’, నెట్‌ఫ్లిక్స్‌లో ‘జాట్’, ఈటీవీ విన్‌లో ‘పెళ్లికాని ప్రసాద్’, జియో హాట్‌స్టార్‌లో ‘దేవిక అండ్ డానీ’, ఆహాలో ‘ఒరు యమండన్ ప్రేమకథ’ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
-
ప్రముఖ సింగర్ కారు ధ్వంసం.. ఖరీదైన వస్తువులు చోరీ!
లండన్‌లో ప్రముఖ పంజాబ్ సింగర్ సునందా శర్మకు షాకింగ్ అనుభవం ఎదురైంది. పార్కింగ్‌లో ఆమె కారుపై దుండగులు దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేసి అందులోని విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఈ విషయాన్ని ఆ గాయని స్వయంగా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘అవి నాకు ఎంతో ఇష్టమైనవి.. అన్నీ పోయాయి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
-
‘గుండమ్మ కథ’కు 62 ఏళ్లు.. స్పెషల్ వీడియో రిలీజ్
ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, సూర్యకాంతం లాంటి మేటి నటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెండితెర తెలుగు క్లాసిక్ ‘గుండమ్మ కథ’. 1962 జూన్ 7న విడుదలైన ఈ సినిమా తాజాగా 62 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆనాటి చిత్ర విశేషాలను గుర్తు చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఓ స్పెషల్ వీడియోను పంచుకుంది. మీరూ చూడండి.