అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రకటించింది. ఈ చిత్రానికి రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఐకాన్, సూపర్‌హీరో వంటి వాటిని ఎంపికచేశారని తెలుస్తోంది.