మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుంది. ఆమె ట్రెండి డ్రెస్ ధరించి నయా లుక్‌లో కనిపించింది. ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
గుర్రంపై రోషన్.. హిట్ పక్కా అంటున్న నెటిజన్లు!
సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న మూవీ ‘మోగ్లీ’. ఈ సినిమా కోసం రోషన్ ఎంతో కష్టపడుతున్నాడు. ఇందులో భాగంగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో గుర్రంపై ఉన్న రోషన్ లుక్‌కు ఫిదా అవుతున్నారు నెటిజన్లు. దీంతో ఈసారి హిట్ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
-
ఓర చూపులతో ఫరియా వయ్యారాలు!
టాలీవుడ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది. ఇందులో బ్లాక్ కలర్ స్కర్ట్‌లో ఓరచూపులతో ఫోటోలకు పోజులిచ్చింది. ఈ పిక్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
-
దీపికాతో రెండేళ్ల డేటింగ్.. నటుడు ఆసక్తికర కామెంట్స్!
బాలీవుడ్ నటుడు ముజమ్మిల్ ఇబ్రహీం తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపికా పదుకొణెతో రిలేషన్ గురించి మాట్లాడాడు. ‘‘ముంబైకి వచ్చిన కొత్తలో దీపిక మోడల్‌గా పని చేసింది. అప్పుడు మా పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లపాటు ప్రేమించుకున్నాం. మా దగ్గర డబ్బు లేక రిక్షాలోనే తిరిగేవాళ్లం. తర్వాత కొన్ని కారణాలతో బ్రేకప్ చెప్పుకున్నాం. అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లం. ఆమెకు పెళ్లయ్యాక మాట్లాడుకోవడమే మానేశాం’’ అని తెలిపాడు.
-
పరీక్షల్లో పాస్ అవడానికి సుమంత్ చెప్పిన WBC కథ!
సుమంత్, కాజల్ చౌదరి, మాస్టర్ విహర్ష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం ‘అనగనగా’. ఈ సినిమాకు సన్నీ సంజయ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈటీవీ విన్ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకొంది. తాజాగా పరీక్షల్లో పాస్ అవడానికి సుమంత్ చెప్పిన WBC కథను మూవీ యూనిట్ పంచుకుంది.
-
వందలకొద్ది మెసేజ్‌లు.. శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్!
హీరోయిన్ శృతిహాసన్.. తన తండ్రి కమల్‌హాసన్ నటించిన ‘థగ్‌లైఫ్’ చిత్రంలో పాడిన ‘విన్వేలి నాయగా..’ అనే సాంగ్ బాగా పాపులర్ అయింది. దీనిపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నాన్న నటించిన ‘థగ్‌లైఫ్’లో పాట పాడటం ఓ జీవితకాల అనుభవం. పాటను అద్భుతంగా ఆలపించానని రోజూ వందలకొద్ది మెసేజ్‌లు వస్తున్నాయి. నా కెరీర్‌లో మెమొరబుల్ సాంగ్ ఇది’’ అని శృతిహాసన్ చెప్పుకొచ్చింది.
-
ఎన్టీఆర్-నీల్ మూవీపై క్రేజీ అప్‌డేట్!
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ (#NTRNeel) చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుపుకుంటుండగా.. స్మశానంలో 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లతో ఒక భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. తారక్ కెరీర్‌లో మునుపెన్నడూ చూడని విధంగా ఈ ఎపిసోడ్ ఉండబోతుందని సమాచారం.
-
ఓటీటీలోకి భారీ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హాలీవుడ్ భారీ యాక్షన్ మూవీ ‘ది అకౌంటెంట్ 2’ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని దర్శకుడు గావిన్ ఓకానర్ తెరకెక్కించారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద రూ.850 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈమూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది.
-
స్టార్ హీరోయిన్ పేరుతో ఒక గ్రామం.. ఎక్కడో తెలుసా?
హీరోయిన్ త్రిషకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఈ బ్యూటీ పేరుతో ఒక ఊరే ఉండడం విశేషం. అది ఎక్కడో తెలుసా లడక్‌లో.. ఆ ఊరు పేరుతో ఉన్న బోర్డును ఒక అభిమాని ఫొటో తీసి SMలో పోస్ట్ చేశాడు. ‘‘త్రిష.. మీ పేరుతో లడక్‌లో ఒక ఊరు ఉంది. మీకు తెలిస్తే వెంటనే ఆ ఊరుకు వస్తారు’’ అని అతను వెల్లడించాడు.
-
‘థగ్ లైఫ్’ ఓటీటీ, శాటిలైట్ రైట్స్ డీటెయిల్స్ ఇవే!
కమల్‌హాసన్-మణిరత్నం కాంబోలో వచ్చిన చిత్రం ‘థగ్ లైఫ్’. నేడు విడుదలైన ఈమూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌కు సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తున్నాయి. పాన్‌ఇండియా ఓటీటీ డీల్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. ‘థగ్ లైఫ్’ థియేట్రికల్ రన్ తర్వాత వీటిలో సందడి చేయనుంది.