హీరో అజిత్‌కుమార్ స్పోర్ట్స్ బ్రాండ్ మెక్‌లారెన్ సెన్నా హైపర్ కారును కొన్నాడు. లెజండరీ ఎఫ్1 డ్రైవర్ ఆర్టన్ సెన్నా పేరు మీదు ఈ కొత్త వేరియంట్ రిలీజ్‌చేశారు. ట్రాక్‌పై దూసుకెళ్లేందుకు రెఢీగా ఉన్న ఆ సూపర్ కారును చూసి అజిత్ స్టన్ అయ్యాడు. బటర్‌ఫ్లై డోర్స్‌తో కారు ఫుల్ అట్రాక్ట్‌చేస్తున్నది. ఈ కారు డెలివరీకి చెందిన వీడియోను అజిత్ సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
స్టైలిస్ లుక్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్!
బాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సోషల్‌మీడియా వేదికగా తన లేటెస్ట్ ఫోటోస్ పంచుకుంది. ఇందులో ఆమె స్టైలిస్ లుక్‌లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
-
థియేటర్‌లో మరోసారి మంచు విష్టు సంద‘ఢీ’
మంచు విష్ణు-జెనీలియా జంటగా నటించిన ‘ఢీ’ ఈ నెల 6న మరోమారు ప్రేక్షకుల ముందుకొస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2007లో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్ కీలక పాత్రలు పోషించారు. కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమా విష్ణు కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది.
-
‘అందాల రాక్షసి’ మళ్లీ వస్తోంది
టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. 13 ఏళ్ల క్రితం విడుదలైన “అందాల రాక్షసి” మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 13న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి హను రాఘవపూడి డైరెక్టర్.
-
57 ఏళ్ల వయస్సులో తండ్రి కానున్న సల్మాన్ సోదరుడు
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ 57 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. ఇతను 2023లో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. కొన్ని నెలలుగా ఆమె గర్భంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజగా వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫొటోలతో క్లారిటీ వచ్చింది. అర్బాజ్ టాలీవుడ్‌లో జై చిరంజీవ, శివం భజే సినిమాల్లో విలన్ పాత్రలో నటించాడు.
-
సినిమా ఫ్లాప్ అయితే నటీనటులపై నిందలు: రీతూవర్మ
సినిమా అనేది అందరూ కలిసి చేసే పని అని నటి రీతూ వర్మ అన్నారు. అయితే, సినిమా ఫ్లాప్ అయితే మాత్రం నటీనటులనే నిందిస్తారని తెలిపారు.
-
ఇట్స్ అఫీషియల్..: లోకేశ్ కనగరాజ్‌తో బాలీవుడ్ స్టార్ సినిమా
దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో సినిమా చేస్తున్నట్లు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తెలిపారు. వచ్చే ఏడాదిలో ఈ మూవీ పట్టాలెక్కుతుదని వెల్లడించారు.
-
‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా?
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. పవన్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈనెల 12న విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్‌పోన్ చేశారని వార్తలొస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం వీఎఫ్‌ఎక్స్‌తో పాటు ఆర్థికపరమైన సమస్యలేనని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే పలుసార్లు వాయిదా పడడంతో డిస్ట్రిబ్యూటర్స్ వెనకడుగు వేస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
-
ప్రియుడిని పెళ్లాడిన ప్రముఖ నటి
ప్రముఖ హిందీ టీవీ నటి హీనా ఖాన్ పెళ్లిపీటలు ఎక్కారు. చిరకాల ప్రియుడు రాకీ జైస్వాల్‌ను వివాహం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం జరిగిన తన వివాహ వేడుక అనేక ఫోటోలను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ‘‘రెండు వేర్వేరు ప్రపంచాల నుంచి ప్రేమను నిర్మించాం. తేడాలు పోయాయి. హృదయాలు కలిశాయి. జీవితాంతం బంధాన్ని పెనవేశాయి. అన్ని అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతాం’’ అని సంతోషం వ్యక్తం చేశారు.
-
సంక్రాంతికి పెరుగుతోన్న పోటీ
సంక్రాంతి పండుగకు ఇప్పటినుంచే స్టార్, యువ హీరోలు సన్నద్ధమవుతున్నారు. సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే రిలీజ్ సమయాన్ని ప్రకటించేసి పండక్కి పోటీ పెంచేశారు. నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మూవీ జనవరి 14న విడుదల కానుంది. అలాగే, చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కనున్న మూవీ, రవితేజ 76వ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానున్నాయి.