ఐదేళ్ల తరువాత నటి మంచు లక్ష్మి ‘దక్ష’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వంశీకృష్ణ దర్శకుడు. ఇందులో మంచు లక్ష్మి డైనమిక్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. మంచు మోహన్‌బాబు, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌లో పదేళ్ల తరువాత ‘దక్ష’ సినిమా రిలీజ్ కానుంది. వినాయక చవితి సందర్భంగా బుధవారం ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.