హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన తల్లి శోభన గురించి ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. తన తల్లి శోభన 60 ఏళ్ళ వయసులో హైదరాబాద్ నుంచి చెన్నైలోని తన తల్లితండ్రుల ఇంటి వరకు సైక్లింగ్ చేస్తూనే వెళ్లారని తెలిపారు. మోకాలికి ఆపరేషన్ అయినా తాను ఛాలెంజింగ్ గా తీసుకొని అంత దూరం సైక్లింగ్ చేసిందని ఉపాసన పేర్కొన్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
బెంగళూరు తొక్కిసలాట ఘటన హృదయ విదారకం: కమల్‌హాసన్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుందనే వార్త తనని కలచివేసిందని సినీ నటుడు కమల్ హాసన్ అన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, RCB తొలిసారి ఐపీఎల్ కప్ గెలిచిన సందర్బంగా చిన్నస్వామి స్టేడియం వద్ద నిర్వహించిన సంబరాలలో తొక్కిసలాట జరగ్గా.. 11 మంది మరణించిన విషయం తెలిసిందే.
-
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ పబ్లిక్ టాక్
కమల్‌హాసన్ – మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘థగ్‌లైఫ్’ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండాఫ్ అనుకున్నంతగా లేదని మూవీ చూసిన వారు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో కమల్, శింబు నటన, సినిమాటోగ్రఫీ బాగుందని పేర్కొంటున్నారు.
-
నితిన్ ‘తమ్ముడు’ వచ్చేది అప్పుడేనా?
టాలీవుడ్లో కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న హీరోల్లో నితిన్ ఒకరు. ఇప్పుడాయన ‘తమ్ముడు’ సినిమాలో నటించారు. దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నట్లు ఆయన ఓ ప్రెస్మీట్లో చెప్పారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని జూలై 25ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
-
నేటి నుంచి ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ
దుల్కర్ సల్మాన్ హీరోగా బి.సి. నౌఫల్ తెరకెక్కించిన మలయాళ మూవీ ‘ఒరు యమండన్ ప్రేమకథ’. ఈ సినిమా తెలుగు ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ‘ఒక యముడి ప్రేమకథ’ పేరుతో ఈ నెల 5 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్. కొంతకాలం క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
-
ఆకట్టుకునే అందం.. ప్రియాంక సొంతం!
హీరోయిన్ ప్రియాంక మోహన్ తన లేటెస్ట్ పిక్స్ ఇన్‌స్టాలో షేర్‌చేసింది. ఇందులో ఆమె బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో క్యూట్‌గా ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
-
‘JVAS’ కోటులో జాన్వీకపూర్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ తన ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పిక్స్ షేర్‌చేసింది. ఇందులో ఆమె ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ కోటు ధరించి మురిసిపోతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
-
‘SSMB29’.. కొత్త షెడ్యూల్ అప్‌డేట్?
సూపర్‌స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘SSMB29’ మూవీ గురించి ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సమ్మర్ వెకేషన్ అనంతరం ఈ సినిమా షూటింగ్ మరో కీలక షెడ్యూల్‌తో ప్రారంభం కానుందట. జూన్ 10 నుంచి వారాణసిలోని సెట్స్‌లో ఈ షెడ్యూల్ మొదలవనుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు రాజమౌళి బృందం సన్నాహాలు చేస్తోందని సినీవర్గాల సమాచారం.
-
గుర్రంపై హీరోయన్ రొమాన్స్.. పోస్టర్ వైరల్!
షానయా కపూర్-విక్రాంత్ మస్సే జంటగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘ఆంఖోంకి గుస్తాఖియాన్’. సంతోష్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూలై 11న థియేటర్స్‌లోకి రాబోతుంది. తాజాగా మేకర్స్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్‌ను షానయా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇందులో టీజర్ రేపు విడుదల కాబోతున్నట్లు వెల్లడించింది.
-
థియేటర్‌లో ‘అందాల రాక్షసి’ మళ్లీ సందడి
నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందాల రాక్షసి’. 2012 వచ్చిన ఈమూవీ ఈనెల 13న థియేటర్స్‌లో రీ-రిలీజ్ కాబోతుంది.