పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘OG’ మూవీ షూటింగ్‌కు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా షూటింగ్ అప్‌డేట్ వచ్చింది. రేపటి నుంచి ‘OG’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాబోతుందని తెలుస్తోంది. తాడేపల్లిలో 10 రోజుల పాటు జరగనున్న ఈ షూటింగ్ సెట్‌లో పవన్ అడుగు పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ఆల్టమన్‌పై ‘ఆర్టిఫిషియల్’ మూవీ..
ఒపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్టమన్ బయోగ్రఫీకి సంబంధించి కొన్ని అంశాలపై ‘ఆర్టిఫిషియల్’ పేరిట సినిమా రూపొందనుంది. ఫిల్మ్ మేకర్ లూకా గ్వాడాగ్నినో ఈ మేరకు సన్నహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హేడే ఫిల్మ్స్ పతాకంపై డేవిడ్ హేమన్, జెఫ్రీ క్లిఫోర్డ్ నిర్మించాలని చూస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో, ఇటలీని కీలక షూటింగ్ ప్రాంతాలుగా గుర్తించారు. ఆల్టమన్ పాత్రను ఆండ్రూ గార్ఫీల్డ్ పోషించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
-
ఓటీటీలోకి ‘జాట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సన్నీదేవోల్ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘జాట్’. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యాక్షన్ ప్రియులను మెప్పించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జూన్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగు భాషల్లోనూ ఈ మూవీని స్ట్రీమింగ్‌కు తీసుకురావడం గమనార్హం. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
-
‘వేదం’.. నేటితో 15ఏళ్లు పూర్తి
అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క కీలకపాత్రల్లో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘వేదం’. 2010 జూన్ 4న విడుదలైన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుని.. నేటితో 15ఏళ్లు పూర్తి చేసుకుంది. కేబుల్ రాజుగా అల్లు అర్జున్, రాక్‌స్టార్ వివేక్ చక్రవర్తిగా మంచు మనోజ్, సరోజ పాత్రలో అనుష్క తమ నటనతో మెప్పించారు. ఇక కీరవాణి సంగీతం సినిమాను మరోస్థాయిలో నిలబెట్టింది.
-
‘థాంక్యూ తమిళనాడు’.. కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు
కన్నడ భాషపై కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘థగ్ లైఫ్’ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇలాంటి క్లిష్టసమయంలో తనకు సపోర్ట్‌గా నిలిచిన తమిళనాడు ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ‘‘‘నా ప్రాణం, నా కుటుంబం, తమిళమే’ అన్న వ్యాఖ్యలను నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. ఆ వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటా’’ అని కమల్ అన్నారు.
-
కన్నడ వివాదం.. కమల్ రాజ్యసభ సీటుకు ఎఫెక్ట్!
నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. ఈ ఎఫెక్ట్ ఆయన రాజ్యసభ సీటు నామినేషన్‌పై పడింది. ఈక్రమంలో ఆయన రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. త్వరలో కమల్ ‘థగ్ లైఫ్’ సినిమా రిలీజ్‌కానుంది. ఆ రిలీజ్ వ్యవహారం పూర్తయిన తర్వాతే నామినేషన్ వేయాలని భావిస్తున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి.
-
అవార్డుల వేడుకలో ఆడిపాడిన రష్మిక.. వీడియో!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘జీ సినీ అవార్డ్స్ 2025’ గురించి పోస్ట్ చేసింది. ‘‘‘జీ సినీ అవార్డ్స్ 2025’లో నా ప్రదర్శన మీ కోసం. జూన్ 7న సా.7:30 గంటలకు జీ సినిమా, జీ టీవీ అండ్ జీ5లో మారుతి సుజుకి అందించే 23వ ‘జీ సినీ అవార్డ్స్ 2025’లో నన్ను ప్రత్యక్షంగా చూడండి’’ అంటూ తను డ్యాన్స్ చేస్తోన్న వీడియో ప్రోమో పంచుకుంది.
-
‘లక్ష్మీ నరసింహ’ రీ-రిలీజ్ ట్రైలర్ చూశారా?
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ-ఆసిన్ జంటగా నటించిన ‘లక్ష్మీ నరసింహ’ మూవీ మరోసారి థియేటర్‌లోకి రానుంది. జూన్ 8న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2000లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రీ-రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
-
‘వీరమల్లు’ విడుదల.. పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’.. జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్మాత ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకే సినిమాకు తీసుకున్న అడ్వాన్స్ రెమ్యునరేషన్ రూ. 11 కోట్లను పవన్ కల్యాణ్ తిరిగి ఇచ్చారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో పవన్ కళ్యాణ్ ముందు ఉంటాడని మరోసారి నిరూపించారని ఫ్యాన్స్ చెబుతున్నారు.
-
ప్రశాంత్ నీల్‌కు స్టార్ హీరోల విషెస్
సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్టీఆర్, ప్రభాస్‌లు విషెస్ చెప్పారు. ‘మీ మాటల కంటే.. మీ విజన్ ఎక్కువగా మాట్లాడుతుంది. తెరపై మీ మ్యాజిక్ చూసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హ్యాపీ బర్త్‌డే మై సలార్. సలార్ పార్ట్-2లో మరింత విధ్వంసం చేయడానికి ఎదురుచూస్తున్నా. లవ్యూ’’ అని ఇన్‌స్టాలో ప్రభాస్ పోస్ట్ పెట్టారు.