Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’కి మరో హీరో ఫిదా

    వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చి విజయాన్ని అందుకుంది ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’. అభిషాన్‌ జీవింత్‌ దర్శకత్వంలో శశికుమార్, సిమ్రన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని తెలుపుతూ దర్శకుడు అభిషాన్‌ ఎక్స్‌ వేదికగా ఆనందం వ్యక్తంచేశారు. ‘‘సూర్య నన్ను కలిశారు. సినిమా ఆయనకు ఎంత నచ్చిందో వివరించారు’’అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

  • సామ్-రాజ్ డేటింగ్.. రాజ్ భార్య పోస్ట్ వైరల్!

    గత కొద్ది రోజులుగా సమంత, రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజ్ భార్య శ్యామల పోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘మంచి కర్మను సృష్టించు. ప్రజలకు సహాయం చేయి. ప్రజలతో న్యాయంగా ఉండు’’ అని ఆమె రాసుకొచ్చింది. దీంతో ఆమె రాజ్-సామ్‌ను గురించే ఈ పోస్ట్ పెట్టిందని నెట్టింట చర్చించుకుంటున్నారు.

  • ‘శాంతిని కోరుకోవడమంటే.. హానిని అంగీకరించడం కాదు’

    శాంతిని కోరుకోవడమంటే.. హానిని అంగీకరించడం కాదని నటి రష్మిక అన్నారు. భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో ఆమె పోస్ట్‌ వైరల్‌గా మారింది. అన్యాయానికి బదులు తీర్చుకునే దేశాన్ని ప్రశ్నించవద్దంటూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. రష్మిక ఇన్‌స్టా స్టోరీపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

  • ఉద్రిక్తల వేళ.. ‘థగ్‌ లైఫ్‌’ ఆడియో విడుదల వాయిదా

     

    కమల్‌ హాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం మే 16న జరగాల్సిన ఉంది. అయితే, దేశ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల రీత్యా ఆడియో విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కాగా, ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో శింబు కీలక పాత్రలో నటించారు.

  • పాక్ నటుడికి బాలీవుడ్ నటి కౌంటర్

    ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పాక్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్‌ నటి రూపాలీ గంగూలీ ఖండించారు. సోషల్‌ మీడియా వేదికగా ఫవాద్‌ను విమర్శిస్తూ పోస్ట్‌ పెట్టారు. ‘‘మీలాంటి వాళ్లు భారతీయ సినిమాల్లో పనిచేయడం మాకు సిగ్గుచేటు’’ అని అతడి ఫొటోను షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌కు ఆపరేషన్‌ సిందూర్‌, ఇండియన్‌ ఆర్మీ, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ హ్యాష్‌ ట్యాగ్‌లను ఆమె జోడించారు.

  • ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ బుకింగ్స్ ఓపెన్

    వీరుడు అతిలోక సుందరి’ సినిమా రీ-రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయినట్లు చిత్ర బృందం తెలిపింది.