‘లస్ట్ స్టోరీస్’.. బాలీవుడ్‌లో బోల్డ్ వెబ్‌సిరీస్‌గా తెరకెక్కి సూపర్‌హిట్ అందుకుంది. అయితే ఇందులో కియారాఅద్వానీ పాత్రకు మొదట కృతిసనన్‌ను అనుకున్నారట. కానీ ఆమె రిజెక్ట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృతి ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘‘లస్ట్ స్టోరీస్‌లో కియారా పాత్రను నేను తిరస్కరించాను. ఎందుకంటే అలాంటి పాత్రలో నటించడం నా తల్లిదండ్రులకు నచ్చలేదు. అందుకే ఆ అవకాశాన్ని వదులుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
రవితేజ ‘RT76’ మూవీకి డేట్ ఫిక్స్.. పోస్టర్ రిలీజ్!
రవితేజ తన నెక్స్ట్ మూవీని దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో చేయబోతున్నాడు. ఈ సినిమాను రేపు ఉ.9.02గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
-
హృదయాన్ని హత్తుకునేలా.. ‘డియర్ డాడీ’ ట్రైలర్
ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’ కథాసుధ పేరుతో ప్రతి ఆదివారం ఒక కొత్త కథను పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఆదివారం (జూన్ 8) ‘డియర్ డాడీ’ రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ అయింది. తండ్రీకూతుళ్ల అనుబంధం ఇతివృత్తంగా సాగే ఈ షార్ట్‌మూవీ ట్రైలర్ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఈ చిత్రాన్ని దేవరకొండ శ్రీకాంత్ రూపొందించాడు.
-
రాఘవ లారెన్స్ ‘బెంజ్’.. ప్రోమో రిలీజ్
రాఘవ లారెన్స్, నివిన్ పౌలి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా ‘బెంజ్’. తాజాగా ఈ చిత్రంలో నివిన్ పౌలి క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉంటుందో తెలియజేసే వీడియోను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. కాగా ఈ మూవీ విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది.
-
కమల్‌హాసన్ ‘థగ్‌లైఫ్’ మేకింగ్ వీడియో రిలీజ్
కమల్‌హాసన్-మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’. శింబు, త్రిష కీలక పాత్రలు పోషించారు. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా సినిమా గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకింగ్ వీడియోను చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసింది. మరి ఈ మూవీ షూటింగ్ ఎలా జరిగిందో మీరూ చూసేయండి.
-
నటుడు రానా ఆగ్రహం.. వీడియో వైరల్
ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కొంతమంది ఫొటోగ్రాఫర్లు అత్యుత్సాహం ప్రదర్శించడంపై నటుడు రానా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయన్ని ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లు ప్రయత్నించగా.. తనకు ఆసక్తి లేదని సున్నితంగా చెప్పాడు. అయినా వారు వెంటబడ్డారు.. కారు ఎక్కే క్రమంలో ఎదురుగా వస్తోన్న మహిళ ఢీకొనడంతో రానా ఫోన్ కిందపడింది. దీంతో ఆగ్రహానికి గురైయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
-
‘మెట్రో ఇన్ డినో’.. ఆకట్టుకునేలా ట్రైలర్
అనురాగ్ బసు దర్శకత్వంలో ఆదిత్య రాయ్ కపూర్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘మెట్రో ఇన్ డినో’. ఇందులో సారా అలీఖాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈమూవీ జులై 4న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
-
‘OG’ కొత్త షెడ్యూల్.. సెట్‌లో అడుగుపెట్టనున్న పవన్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘OG’ మూవీ షూటింగ్‌కు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా షూటింగ్ అప్‌డేట్ వచ్చింది. రేపటి నుంచి ‘OG’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాబోతుందని తెలుస్తోంది. తాడేపల్లిలో 10 రోజుల పాటు జరగనున్న ఈ షూటింగ్ సెట్‌లో పవన్ అడుగు పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
-
ఆల్టమన్‌పై ‘ఆర్టిఫిషియల్’ మూవీ..
ఒపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్టమన్ బయోగ్రఫీకి సంబంధించి కొన్ని అంశాలపై ‘ఆర్టిఫిషియల్’ పేరిట సినిమా రూపొందనుంది. ఫిల్మ్ మేకర్ లూకా గ్వాడాగ్నినో ఈ మేరకు సన్నహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హేడే ఫిల్మ్స్ పతాకంపై డేవిడ్ హేమన్, జెఫ్రీ క్లిఫోర్డ్ నిర్మించాలని చూస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో, ఇటలీని కీలక షూటింగ్ ప్రాంతాలుగా గుర్తించారు. ఆల్టమన్ పాత్రను ఆండ్రూ గార్ఫీల్డ్ పోషించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
-
ఓటీటీలోకి ‘జాట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సన్నీదేవోల్ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘జాట్’. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యాక్షన్ ప్రియులను మెప్పించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జూన్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగు భాషల్లోనూ ఈ మూవీని స్ట్రీమింగ్‌కు తీసుకురావడం గమనార్హం. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.