Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • పరీక్షల్లో పాస్‌ అవడానికి సుమంత్‌ చెప్పిన WBC కథ!

    సుమంత్‌, కాజల్‌ చౌదరి, మాస్టర్‌ విహర్ష్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం ‘అనగనగా’. ఈ సినిమాకు సన్నీ సంజయ్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈటీవీ విన్‌ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకొంది. తాజాగా పరీక్షల్లో పాస్‌ అవడానికి సుమంత్‌ చెప్పిన WBC కథను మూవీ యూనిట్ పంచుకుంది.

     

  • వందలకొద్ది మెసేజ్‌లు.. శృతి‌హాసన్ ఆసక్తికర కామెంట్స్!

    హీరోయిన్ శృతిహాసన్‌.. తన తండ్రి కమల్‌హాసన్ నటించిన ‘థగ్‌లైఫ్‌’ చిత్రంలో పాడిన ‘విన్వేలి నాయగా..’ అనే సాంగ్ బాగా పాపులర్‌ అయింది. దీనిపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నాన్న నటించిన ‘థగ్‌లైఫ్‌’లో పాట పాడటం ఓ జీవితకాల అనుభవం. పాటను అద్భుతంగా ఆలపించానని రోజూ వందలకొద్ది మెసేజ్‌లు వస్తున్నాయి. నా కెరీర్‌లో మెమొరబుల్‌ సాంగ్‌ ఇది’’ అని శృతిహాసన్‌ చెప్పుకొచ్చింది.

  • ఎన్టీఆర్-నీల్ మూవీపై క్రేజీ అప్‌డేట్!

    ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ (#NTRNeel) చిత్రం రాబోతున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన కీల‌క అప్‌డేట్ ఒక‌టి బ‌య‌టకు వ‌చ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జ‌రుపుకుంటుండ‌గా.. స్మశానంలో 2000 మంది జూనియ‌ర్ ఆర్టిస్ట్‌ల‌తో ఒక భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. తార‌క్ కెరీర్‌లో మునుపెన్నడూ చూడని విధంగా ఈ ఎపిసోడ్ ఉండ‌బోతుంద‌ని స‌మాచారం.

  • ఓటీటీలోకి భారీ యాక్షన్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

    హాలీవుడ్‌ భారీ యాక్షన్‌ మూవీ ‘ది అకౌంటెంట్ 2’ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని దర్శకుడు గావిన్ ఓకానర్ తెరకెక్కించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. బాక్సాఫీస్‌ వద్ద రూ.850 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఇప్పుడు ఈమూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది.

  • స్టార్‌ హీరోయిన్‌ పేరుతో ఒక గ్రామం.. ఎక్కడో తెలుసా?

    హీరోయిన్ త్రిషకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఈ బ్యూటీ పేరుతో ఒక ఊరే ఉండడం విశేషం. అది ఎక్కడో తెలుసా లడక్‌లో.. ఆ ఊరు పేరుతో ఉన్న బోర్డును ఒక అభిమాని ఫొటో తీసి SMలో పోస్ట్‌ చేశాడు. ‘‘త్రిష.. మీ పేరుతో లడక్‌లో ఒక ఊరు ఉంది. మీకు తెలిస్తే వెంటనే ఆ ఊరుకు వస్తారు’’ అని అతను వెల్లడించాడు.

  • ‘థగ్ లైఫ్’ ఓటీటీ, శాటిలైట్ రైట్స్ డీటెయిల్స్ ఇవే!

    కమల్‌హాసన్-మణిరత్నం కాంబోలో వచ్చిన చిత్రం ‘థగ్ లైఫ్’. నేడు విడుదలైన ఈమూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌కు సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తున్నాయి. పాన్‌ఇండియా ఓటీటీ డీల్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. ‘థగ్ లైఫ్’ థియేట్రికల్ రన్ తర్వాత వీటిలో సందడి చేయనుంది.

  • మెగా ఇంట్లో విషాదం.. లావణ్య త్రిపాఠి ఎమోషనల్ పోస్ట్!

    మెగా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వరుణ్‌తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన పెట్ డాగ్ మృతి చెందింది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘నేను ఇప్పటివరకు కలిసిన అత్యంత ముద్దుల కూతురు నువ్వు. నువ్వు నిజంగా ప్రత్యేకమైనదానివి. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో’’ అని రాసుకొచ్చింది. తన పెట్ డాగ్‌ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది.

  • సింపుల్ లుక్‌లో హీరోయిన్ శోభిత ధూళిపాళ!

    టాలీవుడ్ బ్యూటీ శోభిత ధూళిపాళ తన ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. ఇందులో క్రీమ్ కలర్ డ్రెస్ ధరించిన ఆమె అందంగా కనిపించేలా పోజులిచ్చింది.

  • మ‌రో బ‌యోపిక్‌లో బాలీవుడ్ హీరో.. ఎవరంటే?

    బాలీవుడ్ హీరో విక్కీకౌశ‌ల్ మ‌రో బ‌యోపిక్‌లో న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. యాక్ట‌ర్‌గా, ప్రొడ్యూస‌ర్‌గా ప‌లు క్లాసిక్ సినిమాల‌ను తెర‌కెక్కించిన లెజండ‌రీ డైరెక్టర్ గురుద‌త్ బ‌యోపిక్‌లో విక్కీకౌశ‌ల్ న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ బ‌యోపిక్‌పై బాలీవుడ్‌లో చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా.. అందులో విక్కీ న‌టిస్తే బావుంటుంద‌ని అత‌ణ్ణి సంప్ర‌దించార‌ని తెలుస్తోంది. దీనిపై పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే అనౌన్స్ చేయాల‌ని మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

  • బాలయ్య ‘లక్ష్మీ నరసింహా’ రీ-రిలీజ్.. కొత్త సాంగ్

    2004లో బాలకృష్ణ-జయంత్‌ సి.పరాన్జీ కాంబోలో వచ్చిన చిత్రం ‘లక్ష్మీనరసింహా’. సుమారు 21 ఏళ్ల తర్వాత ఈమూవీ థియేటర్లలో రీ-రిలీజ్‌ కానుంది. ఈనెల 8న 4కె వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఒక ఆసక్తికర అప్‌డేట్‌ బయటికొచ్చింది. ఇందులో కొత్త పాటను యాడ్‌ చేసినట్లు మేకర్స్ తెలిపారు. ‘మంచినీళ్లు తాగినోడు మామూలోడు’ అంటూ సాగే పాటకు భీమ్స్‌ స్వరాలు సమకూర్చారు. చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించారు.