బాలీవుడ్ హీరో విక్కీకౌశల్ మరో బయోపిక్‌లో నటించనున్నట్టు తెలుస్తోంది. యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించిన లెజండరీ డైరెక్టర్ గురుదత్ బయోపిక్‌లో విక్కీకౌశల్ నటించనున్నట్టు సమాచారం. ఈ బయోపిక్‌పై బాలీవుడ్‌లో చర్చలు జరుగుతుండగా.. అందులో విక్కీ నటిస్తే బావుంటుందని అతణ్ణి సంప్రదించారని తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
బాలయ్య ‘లక్ష్మీ నరసింహా’ రీ-రిలీజ్.. కొత్త సాంగ్
2004లో బాలకృష్ణ-జయంత్ సి.పరాన్జీ కాంబోలో వచ్చిన చిత్రం ‘లక్ష్మీనరసింహా’. సుమారు 21 ఏళ్ల తర్వాత ఈమూవీ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఈనెల 8న 4కె వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఒక ఆసక్తికర అప్‌డేట్ బయటికొచ్చింది. ఇందులో కొత్త పాటను యాడ్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. ‘మంచినీళ్లు తాగినోడు మామూలోడు’ అంటూ సాగే పాటకు భీమ్స్ స్వరాలు సమకూర్చారు. చంద్రబోస్ లిరిక్స్ అందించారు.
-
ప్రపంచపర్యావరణ దినోత్సవం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్!
హీరోయిన్ నభా నటేష్.. నేడు ప్రపంచపర్యావరణ దినోత్సవం సందర్భంగా చెట్టును కౌగిలించుకొని ఎమోషనల్ పోస్ట్ చేసింది. సోషల్‌మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ‘‘ఈ రోజు ఒక చెట్టును కౌగిలించుకున్నాను…ఆ చెట్టు కూడా నన్ను తిరిగి కౌగిలించుకుందనే భావన కలిగింది. ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని అనుభూతి చెందడం మాత్రమే మనకున్న హక్కు. ఈ సంతోషాలు ఇచ్చిన నేచర్‌కు రుణపడి ఉంటాను’’ అని పేర్కొంది.
-
‘మై కన్నప్ప స్టోరీ’.. మోహన్‌బాబు స్పెషల్ వీడియో
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకుడు. మోహన్‌బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో భాగంగా మోహన్‌బాబు తాజాగా ఒక ప్రత్యేక వీడియో షేర్ చేశారు. ‘మై కన్నప్ప స్టోరీ’ అని పేర్కొంటూ తన తల్లి గురించి మాట్లాడారు. తన తల్లే తనకు కన్నప్ప అని చెప్పారు.
-
తండ్రిలాంటి వాడితో స్టార్ హీరోయిన్ రొమాన్స్!
అదితి రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రాబోతున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన విడుదలైంది. ‘పరివారిక్ మనురంజన్’ పేరుతో రాబోతున్న ఈ చిత్రానికి వరుణ్ వి శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే నేడు ఈ మూవీకి సంబందించిన షూటింగ్ లక్నోలో ప్రారంభమైంది. అదితితో షూటింగ్ చేస్తున్న ఫొటోలను పంకజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడంతో అవి చూసిన నెటిజన్లు తండ్రిలా ఉన్నాడని అంటున్నారు.
-
హీరో విశాల్‌కు హైకోర్టు ఆదేశాలు.. ఎందుకంటే?
హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు బిగ్ షాకిచ్చినట్లు సమాచారం. నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు 30శాతం వడ్డీతో రూ.21కోట్లు చెల్లించాలని ఆదేశించింది. విశాల్-లైకా మధ్య కొన్నాళ్లక్రితం ఓ సినిమా విషయంలో విభేదాలు వచ్చాయి. సినిమా తీస్తానని తమవద్ద విశాల్ రూ.21.29కోట్లు అప్పుగా తీసుకున్నారంటూ.. ఆ డబ్బు తిరికి చెల్లించలేదని లైకా వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు డబ్బు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
-
సమంత ఆసక్తికర పోస్ట్.. సూపర్ అంటున్న నెటిజన్లు!
హీరోయిన్ సమంత తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సామ్ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో కొన్ని డిఫరెంట్ ఫొటోస్, వీడియోస్ పంచుకుంది. ఇక వాటికి ‘‘ఇక్కడ శబ్దం లేదు, హడావిడి లేదు… ఉండటానికి స్థలం మాత్రమే’’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో కోసం ClickHere.
-
జపాన్‌లో రిలీజైన ‘విక్రమ్’.. కలెక్షన్స్ ఎంతంటే?
కమల్‌హాసన్ హీరోగా నటించిన భారీ బ్లాక్ బస్టర్ చిత్రం ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ థియేటర్స్‌లో భారీ వసూళ్లు కొల్లగొట్టింది. అయితే ఈ సినిమా మే 30న జపాన్‌లో సైలెంట్‌గా విడుదలైంది. కొన్ని థియేటర్లలో మాత్రమే రిలీజైన ఈ చిత్రం.. అక్కడ 8.4 మిలియన్ జపాన్ యెన్స్‌ను వసూలు చేసిందట. అంటే సుమారు 50 లక్షలకి పైగా వసూళ్లు రాబట్టిందని సమాచారం.
-
మెక్‌లారెన్ సెన్నా హైపర్ కారు కొన్న హీరో అజిత్
హీరో అజిత్‌కుమార్ స్పోర్ట్స్ బ్రాండ్ మెక్‌లారెన్ సెన్నా హైపర్ కారును కొన్నాడు. లెజండరీ ఎఫ్1 డ్రైవర్ ఆర్టన్ సెన్నా పేరు మీదు ఈ కొత్త వేరియంట్ రిలీజ్‌చేశారు. ట్రాక్‌పై దూసుకెళ్లేందుకు రెఢీగా ఉన్న ఆ సూపర్ కారును చూసి అజిత్ స్టన్ అయ్యాడు. బటర్‌ఫ్లై డోర్స్‌తో కారు ఫుల్ అట్రాక్ట్‌చేస్తున్నది. ఈ కారు డెలివరీకి చెందిన వీడియోను అజిత్ సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు.
-
స్టైలిస్ లుక్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్!
బాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సోషల్‌మీడియా వేదికగా తన లేటెస్ట్ ఫోటోస్ పంచుకుంది. ఇందులో ఆమె స్టైలిస్ లుక్‌లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.