Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • మాలీవుడ్‌ ‘నాగమ్మ’గా మోనాలిసా

    ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా బ్యూటీ మోనాలిసా మాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘నాగమ్మ’ చిత్రం పూజా కార్యక్రమం ఇటీవల కొచ్చిలో జరిగింది. ఈ మూవీని పి. బిను వర్గీస్ దర్శకత్వం వహిస్తుండగా.. జీలి జార్జ్ నిర్మిస్తున్నారు. మోనాలిసా గులాబీ రంగు లెహంగాలో కనిపించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

  • ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ

    తమిళ హిట్ చిత్రం ‘మామన్’ ఇప్పుడు తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కమెడియన్ సూరి హీరోగా నటించిన ఈ చిత్రం మేనమామల గొప్పదనం, కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కింది. మే నెలలో థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన ఈ చిత్రం, ఆగస్టు తొలి వారంలో తమిళ వెర్షన్‌లో మాత్రమే ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమా తెలుగులోకి డబ్ అయింది.

  • ‘పరమ్‌ సుందరి’ VS ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’.. జాన్వీ కపూర్‌ ఏమన్నారంటే!

    జాన్వీ కపూర్ నటించిన ‘పరమ్ సుందరి’ చిత్రం సెప్టెంబర్ 29న విడుదల కానుంది. అయితే, ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ట్రైలర్, పోస్టర్‌లు ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాను పోలి ఉన్నాయని నెటిజన్లు విమర్శించారు. ఈ విమర్శలపై జాన్వీ స్పందించారు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’తో పోల్చడం తనకెంతో ఆనందంగా ఉందని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

  • ‘ఓజీ’ నుంచి సువ్వి.. సువ్వి సాంగ్‌ రిలీజ్‌

    పవన్‌ కల్యాణ్‌ హీరోగా దర్శకుడు సుజీత్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఓజీ’. ఈ సినిమాలో పవన్‌ సరసన ప్రియాంకా మోహన్‌ నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా సెప్టెంబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వినాయక చవితి సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి ‘సువ్వి.. సువ్వి’ పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘ఉండిపో ఇలాగా.. తోడుగా.. నా మూడు ముళ్లలాగా’అంటూ సాగే లిరిక్స్‌ కల్యాణ్ చక్రవర్తి రాయగా.. శ్రుతి రంజనీ ఆలపించారు.

  • ఘాటీ ప్రమోషన్స్‌కు అనుష్క దూరం!

    క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క నటించిన చిత్రం ‘ఘాటి’. సెప్టెంబర్ 5న విడుదలకానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌కు అనుష్క దూరంగా ఉండనుంది. ప్రాజెక్ట్‌ ప్రారంభించినప్పుడే అనుష్క ప్రమోషన్స్‌కు అందుబాటులో ఉండరని చెప్పినట్లు నిర్మాత రాజీవ్‌రెడ్డి తెలిపారు. ‘‘ప్రీరిలీజ్‌ వేడుకకు హాజరుకాకపోవచ్చు. అది ఆమె వ్యక్తిగత విషయం. అనుష్కలాంటి నటి మాత్రమే ఇంత గొప్ప పాత్ర పోషించగలరు. షీలా పాత్రలో జీవించింది’’ అని చెప్పుకొచ్చారు.

  • నటుడు విజయ్‌పై కేసు

    తమిళ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. మధురైలో విజయ్ నిర్వహించిన ఈవెంట్‌లో విజయ్ బౌన్సర్స్ తనను కొట్టారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విజయ్, బౌన్సర్లు కేసు ఫైల్ చేశారు.

  • ఓటీటీలోకి వచ్చేసిన ‘కింగ్డమ్’

    గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన మూవీ ‘కింగ్డమ్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. థియేటర్ రన్‌లో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాను నాగవంశీ నిర్మించారు.

  • ‘సినిమా టికెట్లపై జీఎస్టీని తగ్గించండి’

    ప్రస్తుత జీఎస్‌టీ విధానంలో సినిమా టికెట్లపై రూ.100 లోపు అయితే 12%, ఆపైన అయితే 18% పన్ను విధిస్తున్నారు. రూ.300లోపు ఉన్న టికెట్లను 5% శ్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం కోరింది. ఇది ప్రజలకు సినిమా వినోదాన్ని తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చి, చలనచిత్ర పరిశ్రమకు సహాయపడుతుందని పేర్కొంది. రూ.300పైన ఉన్న టికెట్లపై మాత్రం 18% పన్ను విధించాలని సూచించింది.

  • ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ప్రముఖ సింగర్

    ప్రముఖ అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఎంగేజ్‌మెంట్ నిన్న తన ప్రియుడు, NFL ప్లేయర్ ట్రావిస్ కెల్సేతో జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా టేలర్ పోస్ట్ చేశారు. ‘మీ ఇంగ్లిష్ టీచర్, జిమ్ టీచర్ వివాహం చేసుకోబోతున్నారు’ అని రాసుకొచ్చారు. తనను తాను ఇంగ్లిష్ టీచర్‌గా టేలర్ పేర్కొనడంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వీరి పెళ్లి ఎప్పుడనే విషయాన్ని వెల్లడించలేదు.

  • ‘నటన కన్నా అందులోనే ఎక్కువ ఆనందం’

    కోలీవుడ్‌ నటుడు రవి మోహన్‌ నిర్మాణ సంస్థ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో శివ కార్తికేయన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నాకు నటన కన్నా సినిమాలు నిర్మించడంలోనే ఎక్కువ ఆనందం. రవి మోహన్‌.. నిర్మాతగా నేను మీకు సీనియర్‌ని. ఎక్కువ చిత్రాలు నిర్మించండి’’ అని శివ కార్తికేయన్‌ విజ్ఞప్తి చేశారు. వీరిద్దరు కలిసి ‘పరాశక్తి’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.