ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘మై డియర్ శేఖర్, మీలాంటి ఒక అభిమాని ఉండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తినిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25ఏళ్ల జర్నీలో నేనూ భాగమైనందుకు గర్వంగా ఉంది. సున్నితమైన వినోదంతోపాటు, ఒక సోషల్‌కామెంట్‌ని జతచేసి ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతోఇష్టం’’ అని పేర్కొన్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ఈ వారం థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలివే!
- ‘థగ్ లైఫ్’ (కమల్ హాసన్)- జూన్ 5
- ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ (నార్నే నితిన్)- జూన్ 6
- ‘హౌస్‌ఫుల్5’ (అక్షయ్ కుమార్)- జూన్ 6
- ‘గ్యాంబ్లర్స్’ (సంగీత్ శోభన్)- జూన్ 6
- ‘బద్మాషులు’ (మహేశ్ చింతల)- జూన్ 6
-
మీరేమైనా చరిత్రకారుడా?.. కమల్‌కు కర్ణాటక హైకోర్టు ప్రశ్న
తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ ఇటీవల వ్యాఖ్యానించి వివాదాల్లో చిక్కుకున్నారు సినీనటుడు కమల్ హాసన్. అయితే, ఆయన వ్యాఖ్యలపై పలువురు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. మీరేమైనా చరిత్రకారుడా?.. ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారని కమల్ హాసన్‌ను ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో ఒక్క క్షమాపణ చెబితే సమస్య మొత్తం పరిష్కారం అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.
-
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన నాగార్జున
ఏపీ సీఎం చంద్రబాబును హీరో నాగార్జున కలిశారు. తన కొడుకు అఖిల్ వివాహానికి చంద్రబాబును నాగార్జున ఆహ్వానించారు.
-
‘రానా నాయుడు: సీజన్2’ ట్రైలర్ వచ్చేసింది
వెంకటేశ్, రానా కీలక పాత్రల్లో నటిస్తున్న ‘రానా నాయుడు: సీజన్2’ ట్రైలర్ మంగళవార విడుదలైంది. ఈ క్రేజీ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 13వ తేదీ నుంచి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
-
నాన్న మాకోసం ఎన్నో త్యాగాలు చేశారు: మంచు విష్ణు
మంచు విష్ణు న్యూ మూవీ ‘కన్నప్ప’జూన్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విష్ణు ‘మై కన్నప్ప స్టోరీ’అంటూ వీడియో విడుదల చేశారు. ఇందులో మోహన్ బాబు గురించి చెప్పారు.ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలు చేసి వారిని పెంచారని వివరించారు.నెటిజన్‌లను కూడా వారి జీవితంలో కన్నప్ప ఎవరో వివరిస్తూ #My Kannappa Story అనే హ్యాష్ ట్యాగ్ జోడిస్తూ వీడియో పంపాల్సిందిగా కోరారు.
-
వర్కింగ్ అవర్స్.. అలా అడగడంలో తప్పులేదు: మణిరత్నం
8 గంటలు మాత్రమే పనిచేయాలనే డిమాండ్‌కు దర్శకుడు మణిరత్నం మద్దతిచ్చారు. నటీనటులు అలా డిమాండ్ చేయడంలో తప్పులేదని వెల్లడించారు.
-
‘ది రాజా సాబ్’ ఆగమనం.. అదిరిపోయే అప్‌డేట్ పంచుకున్న టీమ్
ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ది రాజా సాబ్’. భారీ అంచనాల మధ్య రానున్న ఈ మూవీ అప్‌డేట్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ జూన్ 16న రానున్నట్లు మేకర్స్ తెలిపారు. అలాగే డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్టర్‌ను పంచుకుంది.
-
రోషన్‌తో శైలేశ్ కొలను సినిమా!
నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో దర్శకుడు శైలేశ్ కొలను సినిమా చేయనున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
-
రిస్క్ తీసుకున్నా.. సక్సెస్ అయ్యా: ఆమిర్ ఖాన్
రిస్క్ తీసుకొని ఎన్నో సినిమాలు చేశానని బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ చెప్పారు. అవే మంచి పేరు తీసుకొచ్చాయని వెల్లడించారు.