Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • స్టేజీపైనే నటిని అసభ్యంగా తాకిన హీరో

    భోజ్‌పురి సినిమా సూపర్‌ స్టార్‌గా పేరొందిన పవన్‌ సింగ్‌ వివాదంలో చిక్కుకున్నాడు. యూపీ లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో స్టేజీపైనే నటితో అసభ్యంగా ప్రవర్తించాడు. నటి అంజలి మైక్‌లో మాట్లాడుతుండగా ఆమె నడుమును తాకి ఏదో చెప్పారు. అంజలి అసౌకర్యంగా ఫీలైనా పవన్‌ వదల్లేదు. మరోసారి నడుమును తాకి ఇబ్బంది పెట్టారు. దీంతో అతడు క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

  • ప్రగ్యా హాట్‌నెస్‌కు కుర్రకారు ఫిదా!

    హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన తన హాట్ లుక్‌ యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో అమ్మడి బ్యూటీఫుల్ స్మైల్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు.

  • ప్రదీప్‌ ‘డ్యూడ్‌’ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్

    కోలీవుడ్ స్టార్ ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డ్యూడ్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్‌. కీర్తిస్వరన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. సానపాటి భరద్వాజ్‌ పాత్రుడు సాహిత్యం అందించిన ఈ పాటను స్వీయ సంగీత దర్శకత్వంలో సాయి అభ్యంకర్‌ పాడారు.

  • హీరోయిన్ నివేదా పెళ్లి.. వరుడు ఎవరంటే?

    హీరోయిన్ నివేద పేతురాజ్‌ త్వరలో వ్యాపారవేత్త రాజ్‌హిత్‌ ఇబ్రాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించింది. మరి ఈ ఇబ్రాన్‌ ఎవరంటే.. అతడు దుబయ్‌కు చెందిన మోడలింగ్‌ రంగ వ్యాపారి. నివేదా కుటుంబం కూడా గత కొంతకాలంగా దుబయ్‌లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని సమాచారం.

  • గ్లామర్ డాల్‌గా బాలీవుడ్ బ్యూటీ!

    బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ తాజాగా సోషల్ మీడియాలో గ్లామర్ పిక్ పోస్ట్ చేసింది. ఇందులో ఆమె ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో కుర్రకారును ఆకట్టుకుంటోంది.

  • చై మిథికల్‌ వరల్డ్‌లోకి ‘లాపతా లేడీస్‌’ స్టార్

    ‘లాపతా లేడీస్‌’ ఫేం స్పర్శ్‌ శ్రీవాత్సవ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అక్కినేని నాగచైతన్య-కార్తీక్ వర్మ దండు కాంబోలో ‘NC24’ మూవీ రాబోతుంది. ఈ చిత్రం మైథలాజికల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతోంది. అయితే స్పర్శ్‌ శ్రీవాత్సవ ‘NC24’ మిథికల్‌ వరల్డ్‌లో జాయిన్‌ అయ్యాడంటూ తన లుక్‌ను మేకర్స్‌ షేర్ చేశారు. మరి ఈ టాలెంటెడ్‌ యాక్టర్‌ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

  • బిగ్‌బాస్-9 లాంచ్ డేట్ వచ్చేసింది!

    తెలుగు బిగ్‌బాస్ ఇపుడు 9వ సీజన్‌లోకి అడుగు పెట్టింది. ఇక ఈసారి సీజన్‌ను మరింత టఫ్‌గా ప్లాన్ చేయగా కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నారు.తాజాగా ఈ షో బుల్లితెరపై ఎపుడు మొదలు అవుతుంది అనేది ప్రకటించారు. బిగ్‌బాస్ ఈ సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీంతో బిగ్‌బాస్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి ఫైనల్‌గా ఇదో బిగ్ అండ్ గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు.

  • ‘బ్రో కోడ్’ తెలుగు ప్రోమో విడుదల

    ప్రముఖ తమిళ నటుడు జయం రవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో కోడ్’. ఈ సినిమా తెలుగు ప్రోమోను గురువారం చిత్ర బృందం విడుదల చేసింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. వివేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • అందుకే టాలీవుడ్‌లో నటించట్లేదు: హీరోయిన్

    ‘ఆనంద్‌’ చిత్రంతో పరిచయమై, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటి కమలినీ ముఖర్జీ. ఈ బ్యూటీ టాలీవుడ్‌కు దూరమై దశాబ్దం దాటింది. దానికి గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ సినిమాలో పోషించిన పాత్ర తాను ఊహించినంత స్థాయిలో తెరకెక్కలేదని.. ఆ క్యారెక్టర్‌పై అసంతృప్తి కలిగిందని తెలిపింది. ఆ విషయంలో ఫీలయ్యానని, అందుకే తెలుగు సినిమాల్లో నటించలేదని వెల్లడించింది.

  • ‘ఘాటి’ సెన్సార్ పూర్తి.. ర‌న్ టైమ్‌ ఎంతంటే?

    అనుష్క శెట్టి-విక్రమ్‌ ప్రభు ప్రధానపాత్రల్లో నటిస్తుత్న సినిమా ‘ఘాటి’. క్రిష్‌ తెరకెక్కిస్తున్న ఈమూవీ సెప్టెంబరు 5న రిలీజ్‌‌కానుంది. తాజాగా ఈచిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. దీనికి సెన్సార్‌బోర్డు U/A స‌ర్టిఫికెట్ జారీ చేయగా.. ర‌న్ టైమ్‌ను 2గంట‌ల 35 నిమిషాలకు మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా క్రిష్‌, అనుష్క‌లకు బెస్ట్ క‌మ్ బ్యాక్ అవుతుంద‌ని సినీ వ‌ర్గాల టాక్‌.