రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తోన్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 27న విడుదల కావాల్సి ఉండగా, పరిశ్రమలో సమ్మెలు, ఇతర కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమైంది. దీంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.