‘సుందరకాండ’ చూస్తున్నంతసేపు ప్రేక్షకుల ముఖంలో చిరునవ్వు ఉంటుందని, అందరికీ కనెక్ట్ అవుతుందని హీరో నారా రోహిత్ తెలిపాడు. ఆయన నటిస్తున్న ఈ మూవీ ఈనెల 27న విడుదలకానుంది. ఈ సందర్భంగా రోహిత్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘‘సుందరకాండ చాలా క్లీన్ ఫిల్మ్. ‘భైరవం’ డీసెంట్ హిట్. ఈ సినిమా కూడా కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
బ్యాడ్ న్యూస్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ!
బాలీవుడ్ భామ శిల్పాశెట్టి అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వినాయక చవితి వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. ‘‘స్నేహితులారా బాధతో ఈ విషయాన్ని పంచుకుంటున్నా. మా కుటుంబంలో ఒకరి వియోగం కారణంగా ఈ సంవత్సరం మేము గణపతి వేడుకలను నిర్వహించుకోవడం లేదు. మా సంప్రదాయం ప్రకారం 13రోజుల పాటు సంతాపదినాలను పాటించాలి. అందుకే పండుగకు దూరంగా ఉంటాం’’ అంటూ పోస్ట్ చేసింది.
-
రాత్రి నిద్రపోవాలంటే వణికిపోతా: శ్రీలీల
హీరోయిన్ శ్రీలీల రీసెంట్‌గా ఓ టాక్ షోలో తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. ‘‘నా జీవితంలోని ప్రతి నిర్ణయం అమ్మ దగ్గరే ఉంటుంది. 6నెలల క్రితం వరకు మా అమ్మ లేకుండా రాత్రి నిద్రపోయే దాన్ని కాదు. రాత్రి అమ్మ పక్కన లేకపోతే మేల్కొన్ని వణికిపోతాను. అమ్మ నన్ను పట్టుకొని నార్మల్ చేస్తుంది. షూట్స్‌కు వెళ్ళినా అమ్మ ఉండాల్సిందే’’ అని చెప్పుకొచ్చింది.
-
దుల్కర్ సల్మాన్ ‘కాంత’ వాయిదా?
దుల్కర్ సల్మాన్-భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న మూవీ ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ధంగా ఉందని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇక కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఈ వార్తలు నెట్టింట వైరల్ అవుతోంది.
-
50 ఏళ్ల వయసులోనూ.. తగ్గేదే లే అంటున్న కాజోల్!
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అంతే కాకుండా 51 ఏళ్ల వయసులోనూ చెరగని అందాలను మెయింటేన్ చేస్తోంది. బోల్డ్ సినిమాల్లోనూ నటిస్తూ అందరికీ షాక్ ఇస్తోంది. తాజాగా ఆమె బ్లాక్ స్కర్ట్‌లో బ్యూటీఫుల్ లుక్‌లో కనిపించింది. ఈ ఏజ్‌లో కూడా ఇంత హాట్‌నెస్ ఏంటని కుర్రాళ్లు షాక్ అవుతున్నారు. ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.
-
‘కపుల్ ఫ్రెండ్లీ’.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
సంతోశ్ శోభన్-మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘నాలో నేను’ అంటూ సాగే ఈ మెలోడీ రొమాంటింగ్ లిరికల్ పాటకు ఆదిత్య రవింద్రన్ సంగీతం అందించగా.. సంజీత్ హెగ్డే పాడారు.
-
కుమార్తె ఫోటో లీక్‌పై దీపిక ఆగ్రహం!
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో తన కుమార్తె దువాతో కనిపించారు. అయితే ఈ సందర్బంగా ఒక అభిమాని ప్రైవసీని ఉల్లంఘిస్తూ దువా ఫోటోలు తీశాడు. దీన్ని గమనించిన దీపిక, వెంటనే అతడిని మందలించి, ఫోటోలు-వీడియోలు డిలీట్ చేయాలని కోరారు. అయినప్పటికీ ఆ వ్యక్తి వినకుండా వాటిని నెట్టింట షేర్ చేయడంతో దీపిక తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
-
పవన్ చేతిపై జపనీస్ టాటూ.. అర్ధం ఏంటో తెలుసా?
పవన్‌కల్యాణ్-ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘OG’. సుజీత్ దర్శకుడు. ఈ మూవీలోని సెకండ్ సాంగ్ పోస్టర్ నిన్న విడుదలైంది. ఈ పోస్టర్‌లో పవన్ చేతిపై కనిపించిన జపనీస్ టాటూ ఆసక్తికరంగా మారింది. దీనికి అర్థం ఏంటా అని నెటిజన్లు గూగుల్‌లో వెతుకుతున్నారు. అయితే ఆ జపనీస్ అక్షరాలు వీటిని సూచిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. మొదటి అక్షరం-Promise, రెండో అక్షరం-Strength, మూడో అక్షరం-Fire అని అర్థమట.
-
‘ఏం జరుగుతోంది’.. బాయ్‌ఫ్రెండ్‌తో రష్మిక రొమాన్స్!
రష్మిక-దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమా నుంచి ‘ఏం జరుగుతోంది’ అనే సెకండ్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేయనున్నారు. చిన్మయి శ్రీ పాద ఆలపించిన ఈ మెలోడిని రేపు విడుదల చేయనున్ననట్లు ప్రకటించారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.
-
నాని ఎంత మందికి ఐ లవ్యూ చెప్పాడంటే?
నటుడు జగపతి బాబు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్ షోలో తెగ అలరిస్తున్నారు. ఈ షోలో తాజాగా హీరో నాని పాల్గొన్నారు. ‘‘నాని క్రష్ ఎవరు?.. ఎంతమందికి ఐ లవ్యూ చెప్పావ్?” అని జగపతిబాబు ప్రశ్నించారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ఎపిసోడ్‌ను ఆగస్టు 29 రాత్రి 9గంటలకు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అలాగే ఆగస్టు 31న అదే టైంలో జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారంకానుంది.