వరుణ్ ధావన్-జాన్వీకపూర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అక్టోబర్ 2న ‘సన్నీ సంస్కారికి తులసి కుమారి’ థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ సినిమా టీజర్ ఆగస్టు 28న రాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించాడు. వరుణ్-జాన్వీకి సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేశారు.