జనాలు ఇన్‌స్టాగ్రామ్‌లో నిమగ్నమైపోయారని, ఇప్పుడు సినిమాలు తీసిన తర్వాత ప్రజల దగ్గరకు వెళ్లి “బాబూ మేము సినిమాలు తీశాం” అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిర్మాత బన్నీ వాసు అన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో సినిమా ప్రమోషన్లు పూర్తిగా మారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయడంలో సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, ఈ మార్పులకు అనుగుణంగా ప్రచార వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘అర్జున్ రెడ్డి’కి 8 ఏళ్లు.. డైరెక్టర్ ఆసక్తికర పోస్ట్!
విజయ్ దేవరకొండ-సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలై నేటికి 8ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘ఎనిమిదేళ్ల క్రితం ‘అర్జున్ రెడ్డి’ నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్, ప్రతి డైలాగ్, ప్రతి ఎమోషన్‌కు ఒక అర్థం వచ్చిందంటే, దాన్ని మీరు నిజాయతీగా స్వీకరించడమే కారణం’’ అని రాసుకొచ్చారు.(వీడియో)
-
ఈ వారం థియేటర్-ఓటీటీ చిత్రాలివే!
ఈ వారం థియేటర్, ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు అలరించనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
- ‘సుందరకాండ’ (ఆగస్టు 27 విడుదల)
- ‘త్రిబాణధారి బార్బరిక్’ (29 ఆగస్టు)
- ‘పరమ్ సుందరి’ (ఆగస్టు 29)
- ‘కన్యాకుమారి’ (ఆగస్టు 27)
- నెట్‌ఫ్లిక్స్: ‘అబిగైల్’ (ఆగస్టు 26)
- అమెజాన్ ప్రైమ్:‘అప్‌లోడ్ 4’ (ఆగస్టు 25)
- జియో:‘రాంబో ఇన్ లవ్’ (ఆగస్టు 29)
-
కమర్షియల్ చిత్రాల్లో 1000 తప్పులు ఉన్నా పట్టించుకోరు కానీ..: అనుపమ
‘పరదా’ మూవీ సక్సెస్ మీట్‌లో నటి అనుపమ పరమేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను నటించిన వాటిలో ‘పరదా’ నాకు చాలా ఇష్టం. ‘పరదా’ని ఓ ప్రయోగాత్మక చిత్రంగా పేర్కొంటూనే కొందరు అందులో తప్పులు వెతుకుతున్నారు. కమర్షియల్ చిత్రంలో 1000 తప్పులు ఉన్నా పట్టించుకోరు. కానీ, హీరోయిన్ ప్రాధాన్యత చిత్రాల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది’’ అని అన్నారు.
-
కార్మికుల సమ్మె.. అల్లు అర్జున్ సినిమాపై ప్రభావం: బన్నీవాసు
అల్లు అర్జున్ సినిమాపై సినీ కార్మికుల సమ్మె ప్రభావం చూపుతోందని నిర్మాత బన్నీ వాసు అన్నారు. ప్రస్తుతం ముంబైలో అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ జరుగుతోందని, అయితే కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్‌లో జాప్యం జరిగిందని తెలిపారు. ఈ సమ్మె వల్ల ఇండస్ట్రీకి తీవ్ర నష్టం కలుగుతుందని, సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయన కోరారు.
-
గుడ్‌న్యూస్ చెప్పిన పరిణీతి, రాఘవ్ చద్దా
ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా దంపతులు తమ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే తమ ఇంట్లోకి పండంటి బిడ్డ రాబోతోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇరువురూ చేతులు పట్టుకొని నడుస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘మా చిన్ని ప్రపంచం.. త్వరలో మా జీవితాల్లోకి రాబోతోంది’అంటూ రాసుకొచ్చారు. ఇటీవల వీరు పాల్గొన్న కపిల్ షోలో మాట్లాడుతూ.. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతామని క్లూ ఇచ్చారు.
-
యువతకు చిరంజీవి స్ఫూర్తిదాయక సందేశం
మెగాస్టార్ చిరంజీవి యువతను ఉద్దేశించి చేసిన స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. “పెరుగు తోడుకునే సమయంలో ఉప్పు, నిమ్మరసం వేస్తే అది విరిగిపోతుంది. కానీ, పెరుగు గట్టిపడిన తర్వాత వేస్తే రుచి పెరుగుతుంది. అలాగే, లక్ష్యాన్ని సాధించే ప్రక్రియలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలనూ దగ్గరికి రానివ్వకూడదు” అని ఆయన అన్నారు.
-
KGF నటుడు కన్నుమూత
‘కేజీఎఫ్’ సినిమాలో బాంబే డాన్ ‘శెట్టి’ పాత్రలో నటించిన దినేశ్ మంగళూరు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. కాగా, దినేష్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
-
ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ
సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను పట్టుకున్న పోలీసు అధికారి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘ఇన్‌స్పెక్టర్ జెండె’. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో సెప్టెంబరు 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.
-
వారసత్వంతోనో, పెళ్లితోనో కాదు..: ఉపాసన ‘స్పెషల్’ పోస్టు
తాను ఎంచుకున్న రంగంలో ఎన్నో ఒత్తిళ్లు అధిగమించి ఓ స్థాయికి చేరుకోవడం వల్లే గుర్తింపు దక్కిందని, వారసత్వంతోనో, పెళ్లితోనో కాదని, నటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన పేర్కొన్నారు. తన పనిపై తనకే కొన్నిసార్లు సందేహం కలిగేదని, అప్పుడప్పుడు నిరుత్సాహపడ్డానని, మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో మొదలుపెట్టే దానినని తెలిపారు. ఓ వ్యక్తిని ఏది ప్రత్యేకంగా నిలుపుతుందన్న అంశంపై సోషల్‌మీడియాలో పోస్టు పెట్టారు. ‘ఖాస్ ఆద్మీ’ పేరిట తన అభిప్రాయాలు పంచుకున్నారు.