అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘డు యు వనా పార్ట్‌నర్’ వెబ్ సిరీస్ సెప్టెంబరు 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో తమన్నా నటించింది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
మహాకుంభమేళాతో వైరల్.. కట్ చేస్తే బిగ్ బాస్‌లోకి
మహా కుంభమేళాతో ఫేమస్ అయిన ఇన్ఫ్లుయెన్సర్ తాన్యా మిట్టల్ హిందీ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కుంభమేళా తొక్కిసలాటలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారంటూ ఆమె ఏడుస్తూ మీడియాతో మాట్లాడిన వీడియో అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది. అయితే తాన్యా ఫేమస్ అయ్యేందుకే అలా మాట్లాడరని విమర్శలూ వచ్చాయి. కాగా, ఇన్‌స్టాలో తాన్యాకు 2.5 మిలియన్ల ఫాలోవర్లున్నారు.
-
వరద బాధితులకు సెల్‌ఫోన్లు డొనేట్ చేసిన ఫరాన్ అక్తర్
బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫరాన్ అక్తర్ గొప్ప మనసు చాటుకున్నారు. ఉత్తరాఖండ్‌లో ఇటీవల సంభవించిన వరదల్లో తీవ్రంగా ప్రభావితమైన బాధితులకు ఆయన సెల్‌ఫోన్లను వితరణ చేశారు. మొబైల్ ఫోన్లు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న 50 మంది బాధితులకు ఆయన ఈ ఫోన్లను అందజేశారు. ఈ వితరణతో బాధితులు ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి వీలు పడింది. ఫరాన్ అక్తర్ చేసిన ఈ పనికి నెటిజన్ల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి.
-
హీరో బాలకృష్ణపై డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర ట్వీట్
AP: హీరో బాలకృష్ణ అరుదైన ఘనతపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ట్వీట్ చేశారు.”బాలనటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలోకి స్వర్గీయ NTR నటవారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథాచిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నటజీవితంలో 50సంవత్సరాల ప్రయాణం పూర్తిచేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించిన బాలకృష్ణకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.” అని పవన్ రాసుకొచ్చారు.
-
హిందీ బిగ్ బాస్ సీజన్-19 షురూ
హిందీ బిగ్ బాస్ సీజన్-19 ఘనంగా ప్రారంభమైంది. 16 మంది కంటెస్టెంట్లను హోస్ట్ సల్మాన్ ఖాన్ పరిచయం చేశారు. వీరిలో 8 మంది మహిళలున్నారు. టీవీ నటి అష్నూర్ కౌర్, ఇన్ఫ్లుయెన్సర్లు తాన్యా మిట్టల్, నగ్మా మిరాజ్కర్, మోడల్ నేహల్ చుడాస్మా, నటి నటాలియా, సోషల్ యాక్టివిస్ట్ ఫర్హానా, భోజ్‌ఫురి నటి నీలమ్, మాజీ నటి, అడ్వకేట్ కునికా సదానంద్ హౌజ్‌లోకి వెళ్లారు.
-
‘సు ఫ్రమ్ సో’ దర్శకుడితో అజయ్?
ఇటీవలే ‘సు ఫ్రమ్ సో’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నారు కన్నడ దర్శకుడు జె.పి తుమినాడ్. ఇప్పుడీయనతో ఓ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవగణ్‌తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే కేవీఎన్ నిర్మాణంలో వచ్చే ఏడాది పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండే అవకాశముంది.
-
‘మహావతార్ నరసింహ’ బ్లాక్ బస్టర్ ట్రైలర్ విడుదల
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో జులై 25న విడుదలైన ‘మహావతార్ నరసింహ’ సినిమా 8 రోజుల్లో రూ.60 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ యానిమేషన్ మూవీగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటి వరకు ఈ సినిమా మొత్తం రూ.278 కోట్లు వసూలు చేసింది. ఈ విజయోత్సాహంలో భాగంగా మూవీ టీం బ్లాక్ బస్టర్ ట్రైలర్‌ని విడుదల చేశారు.
-
సినీ పరిశ్రమకు ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుంది: సీఎం రేవంత్‌రెడ్డి
TG: ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు కలిశారు. కార్మికుల సమ్మె పరిష్కారానికి సహకరించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలి. త్వరలో సినీ కార్మికులను కూడా పిలిచి మాట్లాడతానని తెలిపారు.
-
‘లోకా చాప్టర్ 1: చంద్ర’ ట్రైలర్ విడుదల
కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘లోకా చాప్టర్ 1: చంద్ర’. ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ తన వేఫరార్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. డామ్నిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 28న విడుదల కాబోతోంది. తాజాగా ఈచిత్రం నుంచి మూవీ టీం ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.
-
స్వశక్తితోనే ఎదిగాను.. వారసత్వంతో కాదు: ఉపాసన
తనకు వచ్చిన గుర్తింపు వారసత్వం వల్లనో, వివాహ బంధం వల్లనో వచ్చింది కాదని, ఎన్నో ఒత్తిళ్లను అధిగమించి స్వశక్తితోనే ఈ స్థాయికి చేరానని ఉపాసన కొణిదెల స్పష్టం చేశారు. ‘ఖాస్ ఆద్మీ పార్టీ’ అనే ఆలోచనను పంచుకుంటూ, అసలైన బలం డబ్బు, హోదాలో కాక ఆత్మగౌరవంలోనే ఉంటుందని ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. అహంకారం గుర్తింపును కోరితే, ఆత్మగౌరవం నిశ్శబ్దంగా దాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు.