Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • కోహ్లీ లైక్‌.. ఎట్టకేలకు స్పందించిన అవ్‌నీత్‌కౌర్‌

    ఇటీవల భారత క్రికెటర్కో హ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుకోకుండా బాలీవుడ్ నటి అవ్‌నీత్‌కౌర్ పోస్ట్‌ను లైక్ చేసి వార్తల్లో నిలిచాడు. తాజాగా దీనిపై అవ్‌నీత్‌కౌర్ స్పందించారు. ఇది ఒక పొరపాటున జరిగిన సంఘటన అయినప్పటికీ, నెటిజన్ల నుంచి తనకు లభిస్తున్న ప్రేమ, ఆదరణ ఎప్పటికీ కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సంఘటన తర్వాత విరాట్ కోహ్లీ నుంచి ఆమెకు ఎలాంటి మెసేజ్ రాలేదని కూడా ఆమె వెల్లడించారు.

  • ‘కూలీ’.. రూ.500 కోట్లు దాటేసింది

    తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. విడుదలైన 12 రోజుల్లోనే ఈ ఘనత సాధించినట్లు పేర్కొన్నాయి. మరోవైపు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్-2’ ప్రపంచవ్యాప్తంగా రూ.327 కోట్లకుపైగా వసూలు చేసినట్లు వెల్లడించాయి. తెలుగులో ఈ మూవీ రూ.62.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేశాయన్నాయి.

  • నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌..?

    తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో డైరెక్టర్ నాగ్‌అశ్విన్ సినిమా చేయబోతున్నట్లు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో మాత్రం దీని గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ప్రభాస్‌ చేయాల్సిన సినిమాలు చాలా ఉండటంతో ‘కల్కి’ సీక్వెల్‌ను పక్కనపెట్టి.. మరో కథని బయటికి తీశారని ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే నాగ్‌ అశ్విన్‌ వరుసగా కమల్‌హాసన్, రజనీకాంత్‌లతో సినిమాలు చేసినట్టు అవుతుంది.

  • అప్పుడు డే అండ్ నైట్ వర్క్ చేస్తా: శ్రీలీల

    హీరోయిన్ శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల్లో ఒకేసారి నటించే అవకాశం వస్తే డే అండ్ నైట్ షిఫ్టులు చేస్తానని చెప్పారు. తనతో కలిసి నటించిన వారిలో హీరో రవితేజ అల్లరి ఎక్కువ చేస్తారని తెలిపారు. సమంత తన ఫేవరెట్ నటి అని, తాను కాకుండా ప్రస్తుతం టాలీవుడ్‌లో డాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి అని పేర్కొన్నారు.

  • ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ మెంబర్‌షిప్‌.. యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీ

    ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తన కొత్త సబ్‌స్క్రిప్షన్‌ సర్వీసు ‘ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌’ను ప్రారంభించింది. ప్రత్యేక రాయితీలు, సేల్ ఈవెంట్లకు ముందస్తుగా యాక్సెస్, ప్రియారిటీ కస్టమర్‌ సపోర్ట్‌ వంటివి ఈ ప్యాక్‌తో లభించనున్నాయి. దీనిలో భాగంగా ఏడాది పాటు యూట్యూట్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ వార్షిక ఫీజు రూ.1,499గా కంపెనీ నిర్ణయించగా.. పరిమితకాల ఆఫర్‌లో రూ.990కే అందుబాటులో ఉంది.

  • బిగ్ బాస్ 19.. సల్మాన్ రెమ్యునరేషన్ రూ.10 కోట్లు?

    హిందీ బిగ్ బాస్ 19ని హోస్టింగ్‌ చేస్తున్నందుకు నటుడు సల్మాన్ ఖాన్ వారాంతంలో రూ.8-రూ.10 కోట్ల వరకు వసూలు చేయనున్నట్లు నివేదికలు తెలిపాయి. ఈ కొత్త రెమ్యునరేషన్ బిగ్ బాస్-18 సీజన్‌లో ఆయన సంపాదించిన రూ.250 కోట్ల కంటే రూ.100 కోట్లు తక్కువ. 15 వారాల తర్వాత సల్మాన్ హోస్టింగ్ బాధ్యతలను ఇతర ప్రముఖులకు అప్పగించనున్న నేపథ్యంలో జీతం తగ్గించినట్లు నివేదికలు తెలిపాయి.

  • కుమార్తె ఎంట్రీపై స్టార్ హీరోయిన్ క్లారిటీ!

    బాలీవుడ్ స్టార్ నటి కాజోల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కుమార్తె నైసా దేవగన్ ఇండస్ట్రీ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నైసా నటనలోకి రావడం లేదు. ఆమెకు ప్రస్తుతం 22 ఏళ్లు.. అలాగే పరిశ్రమలోకి రావలానే ఉద్దేశం తనకు లేదు’’ అని స్పష్టం చేసింది. దీంతో కాజోల్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంగా కామెంట్స్ చేస్తున్నారు.

  • ‘సుందరకాండ’ లైవ్లీ ఫన్‌ మూవీ: నారా రోహిత్‌

    ‘సుందరకాండ’ చూస్తున్నంతసేపు ప్రేక్షకుల ముఖంలో చిరునవ్వు ఉంటుందని, అందరికీ కనెక్ట్ అవుతుందని హీరో నారా రోహిత్ తెలిపాడు. ఆయన నటిస్తున్న ఈ మూవీ ఈనెల 27న విడుదలకానుంది. ఈ సందర్భంగా రోహిత్ ఓ ఇంటర్వ్యూలో‌ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘‘సుందరకాండ చాలా క్లీన్ ఫిల్మ్‌. ‘భైరవం’ డీసెంట్ హిట్. ఈ సినిమా కూడా కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.

  • బ్యాడ్ న్యూస్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ!

    బాలీవుడ్ భామ శిల్పాశెట్టి అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వినాయక చవితి వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. ‘‘స్నేహితులారా బాధతో ఈ విషయాన్ని పంచుకుంటున్నా. మా కుటుంబంలో ఒకరి వియోగం కారణంగా ఈ సంవత్సరం మేము గణపతి వేడుకలను నిర్వహించుకోవడం లేదు. మా సంప్రదాయం ప్రకారం 13రోజుల పాటు సంతాపదినాలను పాటించాలి. అందుకే పండుగకు దూరంగా ఉంటాం’’ అంటూ పోస్ట్ చేసింది.

  • రాత్రి నిద్రపోవాలంటే వణికిపోతా: శ్రీలీల

    హీరోయిన్ శ్రీలీల రీసెంట్‌గా ఓ టాక్ షోలో తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. ‘‘నా జీవితంలోని ప్రతి నిర్ణయం అమ్మ దగ్గరే ఉంటుంది. 6నెలల క్రితం వరకు మా అమ్మ లేకుండా రాత్రి నిద్రపోయే దాన్ని కాదు. రాత్రి అమ్మ పక్కన లేకపోతే మేల్కొన్ని వణికిపోతాను. అమ్మ నన్ను పట్టుకొని నార్మల్ చేస్తుంది. షూట్స్‌కు వెళ్ళినా అమ్మ ఉండాల్సిందే’’ అని చెప్పుకొచ్చింది.