కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా నటిస్తున్న సూపర్ యోధుడి మూవీ ‘మిరాయ్’. మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. మనోజ్ మాట్లాడుతూ.. ‘‘అవకాశం ఇచ్చినందుకు టీమ్‌కు థాంక్స్. ఇందులో అవకాశం దేవుడిచ్చిన వరంగా భావిస్తా. ఎందుకంటే ఇలాంటి పాత్ర ఇప్పటివరకూ చేయలేదు. నాకు సినిమా గురించి కొంచెం తెలుసు అనుకున్నా. కార్తిక్‌ను కలిశాక ఏమీ తెలియదని అర్థమైంది’’ అని చెప్పుకొచ్చారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘మిరాయ్’ ట్రైలర్ వచ్చేసింది
యువ నటుడు తేజ సజ్జా న్యూ మూవీ ‘మిరాయ్’. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మంచు మనోజ్ విలన్‌గా కనిపించనున్నారు. కతాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్‌లు ఏ స్థాయిలో ఉండనున్నాయో ట్రైలర్‌లో చూపారు. డ్రాగన్‌తో హీరో పోరాటం, ‘దునియాలో ఏదీ నీది కాదు..’ అంటూ వచ్చే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా విడుదల కానుంది.
-
సింగర్‌తో దుబాయ్ యువరాణి రెండో పెళ్లి
దుబాయ్ యువరాణి షేక్ మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్(31) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా ఏడాది క్రితం మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె ఇప్పుడు అమెరికన్ రాపర్ ‘ఫ్రెంచ్ మోంటానా’(41)తో నిశ్చితార్థం చేసుకుని వార్తల్లో నిలిచారు. ఈ సంవత్సరం జూన్‌లో పారిస్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ఎంగేజ్‌మెంట్ జరిగిందని క్లారిటీ ఇచ్చారు.
-
మరో ఓటీటీలోకి నితిన్ రిసెంట్ మూవీ
యువనటుడు నితిన్ నటించిన ‘రాబిన్ హుడ్’. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ సినిమా, ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో హిందీ వెర్షన్‌లో విడుదలైంది. నితిన్ డబ్బింగ్ సినిమాలకు ఉన్న ఆదరణ కారణంగా, ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో ఇండియా వైడ్‌గా టాప్ 4లో ట్రెండ్ అవుతోంది. ఈ ఏడాది నితిన్ నటించిన ‘తమ్ముడు’ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
-
దాడి కేసులో హీరోయిన్‌కు ముందస్తు బెయిల్
మలయాళ నటి లక్ష్మీ మేనన్‌కు కోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్ట్‌ను తాత్కాలికంగా ఆపేయాలంటూ కేరళ కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరుచేసింది. SMలో లక్ష్మీ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. కొచ్చిలోని ఐటీ ఉద్యోగిని తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేయడమే కాకుండా అతడిపై దాడిచేశారని ఆరోపణలు వచ్చాయి. దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా నటి పరారీలో ఉన్నారని వార్తలు వచ్చాయి.
-
చిరంజీవి హిట్ సాంగ్ వెనుక కథ ఇదీ
తెలుగు సినీ సాహిత్యాన్ని కొత్త పంథాలో నడిపించిన వారిలో వేటూరి సుందర రామ్మూర్తి ఒకరు. ‘చ్చా’ శబ్దం వచ్చేలా ఓ పాటను రాయాలని దర్శకుడు కోదండరామిరెడ్డి కోరగా.. ‘రాక్షసుడు’ సినిమాలోని ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాశారు. ఈ పాటలో దాదాపు 50 ‘చ’కారాలు ఉండటం గమనార్హం. ఇక ఈ పాటలో చిరంజీవి- రాధ జోడీ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
-
బాలకృష్ణ ‘అఖండ 2’ వాయిదా!
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ‘అఖండ 2’. ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల కావాల్సింది. తాజాగా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. వినాయక చవితికి సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ ఆలస్యానికి నందమూరి కుటుంబంలో చోటుచేసుకున్న విషాదం కూడా ఒక కారణమని తెలుస్తోంది. ‘అఖండ 2’ డిసెంబర్ 4 లేదా ఆ తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది.
-
భారీ వర్షాలు.. జమ్మూకశ్మీర్‌లో చిక్కుకుపోయిన మాధవన్
తమిళ నటుడు మాధవన్ జమ్మూకశ్మీర్‌లో చిక్కుకుపోయారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లేహ్‌లోనే ఉండిపోయారు. షూటింగ్ కోసం అక్కడికి వెళ్లిన ఆయన, విమానాలు రద్దు కావడంతో తిరిగి రాలేకపోయారు. ఈ పరిస్థితి ఆయనకు 17 ఏళ్ల క్రితం ‘3 ఇడియట్స్’ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాన్ని గుర్తుచేసినట్లు తెలిపారు. ఈ కష్ట సమయంలో తాను క్షేమంగా ఉన్నానని మాధవన్ సోషల్ మీడియాలో తెలిపారు.
-
మెగాస్టార్ చిరు లుక్స్ అదిరిపోయాయిగా..!
చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. గతంలో చెప్పినట్లుగానే అనిల్.. మెగా ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌తో చిరంజీవి అభిమానుల ప్రశంసలు అందుకున్న ఈ డైరెక్టర్ తాజాగా పోస్టర్‌లతోనూ ఆకట్టుకుంటున్నారు. చిరు పుట్టినరోజు రిలీజ్ చేసిన స్టైలిష్ లుక్, నిన్న పంచె కట్టులోని పోస్టర్ అదిరిపోయాయని మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వింటేజ్ చిరును గుర్తు చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.
-
చిక్కుల్లో షారుఖ్, దీపిక.. ఆ కంపెనీ అంబాసిడర్లుగా..
నటులు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె చిక్కుల్లో పడ్డారు. హ్యుందాయ్ అల్కాజర్ ఎస్‌యూవీలో లోపాలు ఉన్నాయంటూ కీర్తిసింగ్ అనే న్యాయవాది కంపెనీతోపాటు బ్రాండ్ అంబాసిడర్లైన నటులపైనా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. యాక్సిలరేటర్ నొక్కినా కారు వేగంపెరగకపోవడం, ఇంజిన్‌లో లోపాలు ఉండటాన్ని తయారీలోపమని డీలర్ చెప్పారని సింగ్ ఆరోపిస్తున్నారు. తప్పుదోవ పట్టించే ప్రచారం చేసినందుకు మోసం, నమ్మక ద్రోహం కింద నటుల పేర్లను కేసులో చేర్చారు.