Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • స్వశక్తితోనే ఎదిగాను.. వారసత్వంతో కాదు: ఉపాసన

    తనకు వచ్చిన గుర్తింపు వారసత్వం వల్లనో, వివాహ బంధం వల్లనో వచ్చింది కాదని, ఎన్నో ఒత్తిళ్లను అధిగమించి స్వశక్తితోనే ఈ స్థాయికి చేరానని ఉపాసన కొణిదెల స్పష్టం చేశారు. ‘ఖాస్ ఆద్మీ పార్టీ’ అనే ఆలోచనను పంచుకుంటూ, అసలైన బలం డబ్బు, హోదాలో కాక ఆత్మగౌరవంలోనే ఉంటుందని ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. అహంకారం గుర్తింపును కోరితే, ఆత్మగౌరవం నిశ్శబ్దంగా దాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు.

  • కార్మికులపై మానవత్వం చూపాలి: సీఎం రేవంత్

    TG: సినీ నిర్మాతలు, దర్శకులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. సినిమా పరిశ్రమలో మంచి పని వాతావరణం ఉండాలని, కార్మికుల విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తెలంగాణ సినిమా పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో నిలపడమే తన ధ్యేయమని చెప్పారు. పరిశ్రమలో వివాదాలు లేకుండా ఉండాలని సూచించారు.

  • వరల్డ్ రికార్డ్‌లో బాలయ్య.. అభినందించిన సీఎం, లోకేశ్

    నటుడు నందమూరి బాలకృష్ణ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ (గోల్డ్‌ ఎడిషన్‌)లో స్థానం సంపాదించడం పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి దక్కిన ఈ గుర్తింపు చరిత్రాత్మకమని సీఎం కొనియాడారు. ఈ ఘనత తమ కుటుంబానికి, తెలుగు సినిమా అభిమానులందరికీ గర్వకారణమని లోకేశ్ అన్నారు. పలువురు మంత్రులు కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

  • సీఎం రిలీఫ్ ఫండ్‌కి చిరంజీవి రూ.కోటి విరాళం

    AP:సీఎం చంద్రబాబు నాయుడిని ప్రముఖ నటుడు చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. కోటి విరాళానికి సంబంధించిన చెక్కును ఆయనకు అందజేశారు.

  • యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘మదరాసి’ ట్రైలర్

    శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా మూవీ ‘మదరాసి’. రుక్మిణీ వసంత్‌ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 5న తమిళ, తెలుగు భాషల్లో విడుదలకానుంది. ఈ క్రమంలో తాజాగా చిత్రట్రైలర్‌ విడుదలైంది. కార్తికేయన్‌ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. విద్యుత్‌ జమ్వాల్, బిజుమేనన్, షబీర్, విక్రాంత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

  • అందుకే ‘పెద్ది’ ఆఫర్‌ను వదులుకున్నా: నటి శ్వాసిక

    తల్లి పాత్రలకు పరిమితం కావడంపై నటి శ్వాసిక తన అభిప్రాయాలను పంచుకున్నారు. తమిళ చిత్రం ‘లబ్బర్‌ పందు’లో తల్లిగా నటించిన తర్వాత అలాంటి ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. అందువల్ల పెద్ది’లో రామ్‌చరణ్‌కు తల్లిగా నటించే ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పారు. ప్రస్తుతానికి అలాంటి రోల్స్‌ చేయాలని లేదని, భవిష్యత్తులో వాటి గురించి ఆలోచిస్తానని వివరించారు. ఆమె ఇటీవల నితిన్ ‘తమ్ముడు’ చిత్రంతో అలరించారు.

  • సరైన సమయంలోకి రాజకీయాల్లోకి వస్తా: రోహిత్

    నారా రోహిత్ నటించిన ‘సుందరకాండ’ సినిమా ఆగస్టు 27న విడుదలకానుంది. ఈ రొమాంటిక్ చిత్రానికి వెంకటేష్ దర్శకత్వం వహించారు. సినిమాలో రీ-ఎంట్రీ ఇచ్చిన నటి శ్రీదేవి నటన అందరినీ ఆకట్టుకుంటుందని రోహిత్ అన్నారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిందని పేర్కొన్నారు. తాను రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని, సరైన సమయంలో రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు.

  • ‘OG’ నుంచి రెండో సింగిల్ అప్డేట్

    పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న ‘OG’ సినిమా నుంచి రెండో పాట విడుదల తేదీపై మేకర్స్ అప్డేట్‌ను పంచుకున్నారు.  ఆగస్టు 27 న ఉదయం 10:08 గంటలకు పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

  • బాలకృష్ణకు అరుదైన గౌరవం.. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

    ప్రముఖ నటుడు బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ (గోల్డ్‌ ఎడిషన్‌)లో ఆయన పేరు చేరింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా నిలిచారు. హీరోగా 50 ఏళ్లకుపైగా నటిస్తున్నందుకుగానూ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ నెల 30న బాలకృష్ణను సత్కరించనున్నారు.

     

  • సుందరి పాత్రపై ట్రోల్స్‌.. స్పందించిన జాన్వీ కపూర్‌

    జాన్వీ కపూర్‌  నటించిన లేటెస్ట్‌ రొమాంటిక్‌ కామెడీ మూవీ ‘పరమ్‌ సుందరి’. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల అనంతరం జాన్వీపై నెట్టింట ట్రోల్స్‌ వచ్చాయి. ఉత్తరాదికి చెందిన ఆమెను మలయాళ యువతిగా చూపించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేయడంపై జాన్వీ స్పందించారు. తాను మలయాళీ కానప్పటికీ, కేరళ సంస్కృతి పట్ల, ముఖ్యంగా మలయాళ సినిమాల పట్ల తనకు ఆసక్తి ఉందని చెప్పారు.  పరమ్‌ సుందరి’ మూవీలో నటించడం ఆనందంగా ఉందన్నారు.