Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • తమిళనాడులో దళపతి విజయ్ రాజకీయ సునామీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు లైక్స్

    తమిళనాడు స్టార్ హీరో విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీ రాజకీయాల్లో తన ముద్ర వేస్తోంది. ఇటీవల మధురైలో నిర్వహించిన రెండవ రాష్ట్ర స్థాయి సమావేశానికి రికార్డు స్థాయిలో జనం తరలివచ్చారు. టీవీకే వర్గాల సమాచారం ప్రకారం, ఈ బహిరంగ సభకు కోటి 40 లక్షల (14 మిలియన్లు) మంది ప్రజలు హాజరయ్యారు. తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక అరుదైన, గమనించదగ్గ పరిణామం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

  • 45 ఏళ్ల ప్రస్థానం.. సింగర్‌ చిత్రను వారు గుర్తుపట్టలేదట!

    ప్రముఖ గాయని కె.ఎస్‌. చిత్ర  సినీ ప్రస్థానానికి 45 ఏళ్లు. ఈ సందర్భంగా బెంగళూరులో ఇటీవల ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఆ ఈవెంట్‌కు హాజరయ్యే ముందు ఆమె ఓ హోటల్‌కు వెళ్లగా.. అక్కడి సిబ్బంది గుర్తుపట్టలేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. “పియా బసంతీ రే” పాట పాడింది తానేనని చెప్పాక వారు ఆశ్చర్యపోయారని ఆమె చెప్పారు.

  • ‘సౌత్ ఇండ‌స్ట్రీలో హీరోయిన్లను అలా చూపిస్తారు’

    బాలీవుడ్ నటి డైసీ షా దక్షిణాది సినిమా పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల నడుము, బొడ్డు అందాలను చూపించే ‘పిచ్చి’ ఎక్కువగా ఉందని ఆమె పేర్కొంది. క‌న్న‌డ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన టైంని గుర్తు చేసుకుంటూ ఓ ఇంటర్వ్యూలో పై వ్యాఖ్యలు చేసింది.

     

  • ప్రభాస్ ‘రాజాసాబ్’ షూటింగ్‌కు బ్రేక్?

    సినిమా కార్మికుల సమ్మె ముగియడంతో షూటింగ్‌లు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా షూటింగ్‌ రేపటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, కొత్త షెడ్యూల్‌కు తాము రాబోమని సినిమా వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులు హెచ్చరించినట్లు సమాచారం. సమ్మె సమయంలో ఈ సినిమా నిర్మాత విశ్వప్రసాద్ ఫెడరేషన్‌కు లీగల్ నోటీసు పంపించారు. ప్రస్తుతం ఆ నోటీసును వెనక్కి తీసుకుంటామని చెప్పినప్పటికీ, యూనియన్ నాయకులు వెనక్కి తగ్గలేదని చర్చనడుస్తోంది.

  • వర.. వర.. వరదల్లే.. ‘మదరాసి’ వీడియో సాంగ్‌

    శివకార్తికేయన్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన సినిమా ‘మదరాసి’. రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌. ప్రమోషన్స్‌లో భాగంగా ‘వర.. వర.. వరదల్లే’ సాంగ్‌ వీడియోను ఆదివారం విడుదల చేశారు. తెలుగులో రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని ఆదిత్య ఆర్‌.కె. ఆలపించారు. అనిరుధ్‌ సంగీత దర్శకుడు. ఈ సినిమా సెప్టెంబరు 5న విడుదల కానుంది.

     

  • ‘హైవాన్‌’ చిత్రంలో అతిథి పాత్రలో మోహన్‌లాల్‌!

    బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌కుమార్‌, సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్న ‘హైవాన్‌’ చిత్రంలో మలయాళ నటుడు మోహన్‌లాల్‌ అతిథి పాత్రలో మెరవనున్నారు. దర్శకుడు ప్రియదర్శన్‌ ఈ విషయాన్ని తెలిపారు. తొమ్మిదేళ్ల క్రితం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మలయాళ మూవీ ‘ఒప్పం’ రీమేక్‌గా ‘హైవాన్‌’ రూపొందుతోంది.

  • ‘OG’ నుంచి బిగ్ అప్‌డేట్

    పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న ‘OG’ సినిమా నుంచి రెండో పాట విడుదల తేదీని ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు ప్రకటించనున్నారు. “తుఫాన్‌ ఆగిపోయింది… ఇప్పుడు గాలి వీస్తోంది” అనే క్యాప్షన్‌తో ఈ అప్‌డేట్‌పై అంచనాలు పెంచారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.

     

  • మంచి పనులు నిషేధం.. అశ్లీలం ఓకేనా? – రేణూ దేశాయ్ ఫైర్

    సినీ నటి, సామాజిక కార్యకర్తగా పాపులారిటీ ద‌క్కించుకున్న‌ రేణూ దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. వీధి కుక్కల సంరక్షణపై ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలకి సంబంధించిన‌ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ తొలగించడంపై తీవ్రంగా స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ మంచి పనులకు సంబంధించిన కంటెంట్‌ను బ్యాన్ చేసి, అశ్లీల వీడియోలను అనుమతిస్తుందని ఆమె పోస్టులో పేర్కొన్నారు. .

     

  • సెప్టెంబర్‌లో థియేటర్లలోకి వచ్చే సినిమాలివే!

    సెప్టెంబర్‌లో కొన్ని క్రేజీ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి.

    • సెప్టెంబర్ 5- ‘ఘాటి’, ‘మదరాసి’
    • సెప్టెంబర్ 12- ‘కిష్కింధపురి’,   ‘కాంత’
    • ‘మిరాయ్’ సెప్టెంబర్  12న లేదా 19న విడుదలవుతుందని సమాచారం.
    • సెప్టెంబర్  25న పవన్ కళ్యాణ్ ‘OG’ రాబోతోంది.

  • అప్పుడే రాజకీయాల్లోకి వస్తా : నారా రోహిత్

    నారా రోహిత్ హీరోగా నటించిన మూవీ ‘సుందరకాండ’. తాజగా ఈ చిత్రం ప్రమోషన్లలో రాజకీయాల గురించి ప్రశ్న రాగా.. ‘నేను రాజకీయాల్లోకి వస్తే నన్ను ఎవరూ ఆపరు.. రాజకీయ కుటుంబం నుంచే వచ్చాను. కాకపోతే ఇంకా టైమ్ ఉంది. వచ్చే ఎన్నికల వరకు అన్నీ అనుకూలిస్తే కచ్చితంగా ఎంట్రీ ఉంటుంది’ అని క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ సినిమా ఆగస్టు 27న రిలీజ్ అవ్వనుంది.