Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • పెళ్లిపీటలు ఎక్కనున్న నివేదా

    టాలీవుడ్‌ నటి నివేదా పేతురాజు పెళ్లిపీటలెక్కనున్నారు. తనకు కాబోయే భాగస్వామి రాజ్‌హిత్‌ ఇబ్రాన్‌ను పరిచయం చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా ఫొటోలు పంచుకున్నారు. ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగినట్లు ఇన్‌స్టా స్టోరీలో పరోక్షంగా తెలిపారు. ‘ఇప్పటినుంచి జీవితమంతా ప్రేమమయమే..’ అనే క్యాప్షన్‌తో ప్రియుడితో ఉన్న ఫొటోలను పంచుకున్నారు. వీటికి లవ్‌ సింబల్స్‌తోపాటు.. రింగ్ ఎమోజీనీ జోడించారు. దీంతో SMలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

  • కిడ్నాప్ కేసు.. పరారీలో నటి!

    మలయాళ నటి లక్ష్మీ మేనన్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఓ కిడ్నాప్‌ కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కొచ్చిలో ఓ ఐటీ ఉద్యోగిని స్నేహితులతో కలిసి కిడ్నాప్‌ చేసి, అతడిపై దాడి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ముగ్గురిని అరెస్టు చేయగా.. నిందితుల్లో ఒకరైన నటి పరారీలో ఉందని కొచ్చి పోలీస్‌ కమిషనర్‌ విమలాదిత్య తెలిపారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.

  • ‘ఆస్కార్‌’ ఎంట్రీ పొందిన పా. రంజిత్‌ సినిమా

    కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు పా. రంజిత్‌ సహ నిర్మాతగా వ్యవహరించిన ‘పాపా బుకా’ 98వ ఆస్కార్‌ పురస్కారాల పోటీకి ఎంట్రీ సాధించింది. పపువా న్యూ గినీ (పీఎన్‌జీ) దేశం నుంచి అర్హత పొందిన తొలి సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఇది పోటీ పడనుంది. మూడు జాతీయ అవార్డులు అందుకున్న మలయాళ దర్శకుడు బిజుకుమార్‌ దమోదరన్‌ తెరకెక్కించడం విశేషం.

  • గర్ల్‌ఫ్రెండ్‌తో పృథ్వీ షా.. ఫోటో వైరల్

    టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా, నటి, ఇన్‌ప్లూయెన్సర్ ఆకృతి అగర్వాల్ కలిసి వినాయకచవితి వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. గత జూన్‌లో వీరు ఒకేచోట కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. కాగా గతంలో నటి, మోడల్, నిధి తపాడియాతోనూ పృథ్వీ డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. కొన్నేళ్లుగా ఫామ్ లేమితో బాధపడుతున్న అతడు తాజాగా బుచ్చిబాబు టోర్నీలో సెంచరీ చేశారు.

  • ఇంట్లోనే మట్టి గణపతిని చేసిన బ్రహ్మానందం

    వినాయక చవితి సందర్భంగా ప్రముఖ నటుడు బ్రహ్మానందం తన ఇంట్లోనే మట్టి వినాయకుడిని తయారుచేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇందులో ఆయన తమ స్వగృహంలో మట్టి వినాయకుడిని తయారు చేస్తూ కనిపించారు. తద్వారా పర్యావరణానికి హానీ కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ గణేశాను పూజించాలని సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అవి కరోనా సమయంలో తీసిన ఫొటోలని సమాచారం.

  • విడాకుల రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ జంట

    గత కొంతకాలంగా హీరో గోవిందా ఆయన భార్యతో విడిపోతున్నారంటూ వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా తమపై వస్తున్న విడాకుల రూమర్లకు చెక్‌ పెట్టారు గోవిందా దంపతులు. గణనాథునికి గోవిందా సతీసమేతంగా పూజలు చేశారు. అనంతరం ఆయన భార్య సునీతా అహుజా విడాకుల వార్తలపై స్పందించారు. ఆ దేవుడు కూడా తమను వేరు చేయలేడని.. అలాంటి వార్తలు నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

  • హ్యుందాయ్ కారులో లోపం.. షారుఖ్‌, దీపికపై కేసు

    ప్రముఖ బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెలపై రాజస్థాన్‌లో కేసు నమోదైంది. తాను కొనుగోలు చేసిన హ్యుందాయ్ అల్కాజర్ కారులో తయారీ లోపం ఉందని, కంపెనీ మోసం చేసిందంటూ కీర్తి సింగ్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న షారుఖ్, దీపిక తప్పుదోవ పట్టించే ప్రచారం చేశారని ఆరోపిస్తూ, వారిపై కూడా మోసం, నేరపూరిత కుట్ర కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.

  • బిగ్ బాస్-9లోకి ఇద్దరు హీరోయిన్స్?

    కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్-9 సెప్టెంబర్ 5న ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే ఎప్పటిలాగే పలువురు వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు ఈసారి హౌజ్‌లోకి అడుగు పెట్టనున్నారు. అందులో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. లక్స్ పాప పాటతో గుర్తింపు తెచ్చుకున్న ఆశా శైనీ, బుజ్జిగాడు ఫేమ్ సంజనా గల్రానీ ఈసారి హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

     

  • హీరో రాజ్‌తరుణ్‌ కోలీవుడ్ ఎంట్రీ.. టైటిల్ టీజర్!

    విజయ్‌ మిల్టన్‌ డైరెక్షన్‌లో ‘గోలీసోడా’ ఫ్రాంఛైజీలో భాగంగా రూపొందిస్తున్న చిత్రం ‘గాడ్స్‌ అండ్‌ సోల్జర్స్’. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీతో రాజ్‌తరుణ్‌ తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రానికి టైటిల్‌ను ఫిక్స్‌ చేసి.. టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు.

  • ‘లిటిల్ హార్ట్స్’ నుంచి ఆకట్టుకునే సాంగ్

    మౌళి-శివానీ నాగరం జంటగా నటిస్తున్న మూవీ ‘లిటిల్ హార్ట్స్’. ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘చదువూ లేదు’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను క్యాచీ ట్యూన్‌తో సింజిత్ యెర్రమల్లి కంపోజ్ చేయగా.. జెస్సీ గిఫ్ట్ పాడారు.