గ్రామీ అవార్డు గ్రహీత గాయకుడు లిల్ నాస్ ఎక్స్‌ను లాస్ ఏంజిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నగర వీధుల్లో ఈ సింగర్ అండర్‌వేర్‌లో కౌబాయ్ షూలతో తిరుగుతూ కనిపించాడు. దీంతో అధికారులు అడ్డుకోగా వారితో లిల్ వాగ్వాదానికి దిగారు. దీంతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు హాస్పిటల్‌కు తరలించారు. డ్రగ్స్ అధిక డోస్ కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. (వీడియో)
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘జటాధర’ నుంచి దివ్యా భోస్లా లుక్ వచ్చేసింది
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జటాధర’. ఈ మూవీలో కీలక పాత్ర చేస్తున్న దివ్యా భోస్లా లుక్‌ను మూవీటీం విడుదల చేసింది.
-
‘‘సుందరకాండ’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్’
కుటుంబ సమేతంగా వినోదాన్ని ఆస్వాదించేలా రూపొందిన చిత్రమే ‘సుందరకాండ’ అన్నారు నారా రోహిత్. ఆయన హీరోగా దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కించిన చిత్రమిది. శ్రీదేవి విజయ్‌కుమార్, విర్తి వాఘాని కథానాయికలు.ఈ నెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
-
అక్కడ అదరగొటిన్న ‘భైరవం’
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భైరవం’. జీ తెలుగు ఛానెల్లో మొదటిసారి ప్రసారానికి రాగ అక్కడ మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ సినిమాకు టీఆర్పీగా 5.7 రేటింగ్ వచ్చినట్టుగా మేకర్స్ చెబుతున్నారు. అంతేకాదు ఓటీటీలో కూడా 150 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను ఈ మూవీ సొంతం చేసుకుందట. ఇలా ఓటీటీ, టీవీ రెండిట్లో కూడా ‘భైరవం’ అదరగొట్టింది అని చెప్పవచ్చు.
-
బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన కామెంట్స్!
బాలీవుడ్‌లో హీరోయిన్ల పరిస్థితి, అక్కడి మేల్ డామినేషన్‌పై ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ఇండస్ట్రీలో పూరిషాదిపత్యం ఎక్కువగా ఉంది. సెట్‌లో మేము హీరోలతో సమానంగా కష్టపడినా.. పారితోషికంలో సమానత్వం ఎక్కడా కనిపించదు. హీరో వచ్చిన తర్వాతే షూట్ మొదలవుతుంది. కానీ హాలీవుడ్‌లో ఇలాంటి సిస్టమ్ లేదు. హీరోలతో సమానంగా వేతనం లభిస్తుంది. ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా అనిపించింది’’ అని చెప్పుకొచ్చింది.
-
‘మిరాయ్’ మేకింగ్ వీడియో.. తేజ యాక్షన్ అదుర్స్
తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘మిరాయ్’. నేడు హీరో తేజ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో తేజ యాక్షన్ సీన్స్ కోసం ఎంతో కష్టపడుతున్నాడో చూడొచ్చు. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని పీరియాడిక్, ఫాంటసీ అంశాలతో రూపొందిస్తున్నాడు. మంచు మనోజ్ విలన్‌గా నటిస్తుండగా.. రితికా నాయక్, శ్రియ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
-
ఎన్టీఆర్‌పై శ్రీలీల తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల తల్లి స్వర్ణలత.. హీరో జూ. ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ టాక్‌షోలో ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కూచిపూడి నృత్య ప్రదర్శన చూశాకే శ్రీలీలకు డ్యాన్స్ నేర్పించానని తెలిపారు. ఎన్టీఆర్ డ్యాన్స్‌ను స్ఫూర్తిగా తీసుకున్నానని ఆమె చెప్పారు.
-
‘కింగ్డమ్’ నుంచి ఎమోషనల్ సాంగ్ వీడియో రిలీజ్
విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నాదమ్ములుగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. వారిద్దరి అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ‘అన్నా అంటూనే’ అనే వీడియో సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. కృష్ణకాంత్ రాసిన ఈ గీతాన్ని అనిరుధ్ పాడారు. ఈ సినిమాకు సంగీతం కూడా ఆయనే అందించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటించింది.
-
‘పరమ్ సుందరి’.. డేంజర్ సాంగ్ వచ్చేసింది
సిద్ధార్థ్ మల్హోత్రా-జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘పరమ్ సుందరి’. తుషార్ జలోటా దర్శకుడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు సినీప్రియుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులోని ‘డేంజర్..’ అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘రెడ్ అలర్ట్’ అంటూ మొదలైన ఈ పాటలో సిద్ధార్థ్, జాన్వీ హుక్ స్టెప్పులతో అదరగొటారు.
-
‘ది బిగ్ ఫోక్ నైట్ 2025’లో స్పెషల్ పాటలు ఇవే!
జానపద పాటలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ‘ది బిగ్ ఫోక్ నైట్ 2025’ నిర్వహిస్తున్నారు. ఈ వేదికపై 60 మందికి పైగా తెలంగాణ జానపద గాయకులు తమ పాటలతో అలరించనున్నారు. ఒకే వేదికపై ఇంతమంది కళాకారులు ప్రదర్శన ఇవ్వడం ఇదే మొదటిసారి.స్టేజ్ పై ఆలపించే సాంగ్స్ ఏంటో తెలియాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.