Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘ది ట్రయల్‌’ సీజన్‌ 2 రిలీజ్ డేట్ ఖరారు

    దాదాపు రెండేళ్ల క్రితం విడుదలై, ప్రేక్షకులను అలరించిన వెబ్‌సిరీస్‌ ‘ది ట్రయల్‌’. ఈ సిరీస్‌ సీజన్‌ 2   రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. ఓటీటీ ‘జియో హాట్‌స్టార్‌’ లో సెప్టెంబరు 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. కాజోల్‌, జిషు సేన్‌గుప్త ప్రధాన పాత్రల్లో నటించారు.

     

  • ‘ర్యాంబో ఇన్‌ లవ్‌’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు రెడీ

    ‘ర్యాంబో ఇన్‌ లవ్‌’ అనే రొమాంటిక్ కామెడీ వెబ్‌సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అభినవ్ మణికంఠ, పాయల్ చెంగప్ప జంటగా నటించిన ఈ సిరీస్‌ను అజిత్‌రెడ్డి దర్శకత్వం వహించారు. మాజీ లవర్‌తో కలిసి ఒకే ఆఫీస్‌లో పని చేయాల్సి వస్తే ఒక యువకుడు పడే ఇబ్బందులే ఈ కథాంశం.

  • మెగాస్టార్ చిరంజీవి క్రేజీ లైనప్

    మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలకు పోటీగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘విశ్వంభర’ , ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే రెండు చిత్రాలు షూటింగ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలు వరుసగా 2025 వేసవి, 2026 సంక్రాంతికి విడుదల కానున్నాయి. వీటితో పాటు  దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో,  దర్శకుడు బాబీతో మరో రెండు చిత్రాలు కూడా ఖరారయ్యాయి.

     

  • ‘బ్యూటీ’ సినిమా టీజర్‌ రిలీజ్‌

    అంకిత్ కొయ్య, నరేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్యూటీ’. ఈ సినిమాకు ‘భ‌లే ఉన్నాడే’ ఫేమ్ వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేరకర్స్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 19న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ మూవీతో సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ నీల‌ఖి పాత్ర హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

  • 51 ఏళ్ల వయసులో మలైకా అరోరా ఫిట్‌నెస్ రహస్యం

    బాలీవుడ్ నటి మలైకా అరోరా తన ఫిట్‌నెస్ వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలను పంచుకున్నారు. సోహా అలీ ఖాన్‌తో ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, నెయ్యి తన సూపర్ ఫుడ్ అని చెప్పారు. ఇం  ఆహారంతో పాటు, క్రమశిక్షణ, తగినంత నిద్ర, నీరు కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యమని ఆమె వివరించారు. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, తన శరీరాన్ని ప్రేమించడం, మంచిగా చూసుకోవడం ముఖ్యమని ఆమె తెలిపారు.

     

     

  • నటుడు గోవిందా విడాకుల వార్తలు.. ఖండించిన లాయర్‌

    బాలీవుడ్ నటుడు గోవిందా విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలను ఆయన లాయర్ లలిత్ బింద్రా ఖండించారు. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, కావాలనే పాత విషయాలను కొందరు తెరపైకి తీసుకొస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, గోవిందా భార్య సునీత అహుజా కూడా ఈ వార్తలను ఖండించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆమె తెలిపారు.

  • మహిళా ఎంపీపై క్రష్‌.. ట్రోల్స్‌పై స్పందించిన స్వరా భాస్కర్‌

    ట్రోలర్స్‌కు నటి స్వరా భాస్కర్‌ కౌంటర్ ఇచ్చారు. జులైలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. ఎంపీ డింపుల్‌ యాదవ్‌పై క్రష్‌ ఉందని చెప్పారు. సమాజంలో గొప్ప పేరున్న వ్యక్తి గురించి అలా ఎలా మాట్లాడతారంటూ నెట్టింట ఆమెపై విమర్శలు వచ్చాయి. దీంతో  దేశంలో ఓట్ల చోరీ లాంటి పెద్ద సమస్యలు చాలా ఉన్నాయని, వాటి గురించి మాట్లాడితే ఉపయోగం ఉంటుందని స్వరా భాస్కర్‌ అన్నారు.

     

  • ‘ట్రయల్’ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

    బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ట్రయల్’ సీజన్ 2 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్పై చిత్రబృందం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ‘ట్రయల్’ సీజన్ 2 వెబ్ సిరీస్ సెప్టెంబరు 19వ తేదీన స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

  • భారత్‌లో మళ్లీ ‘టిక్‌టాక్‌’?

    షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ సేవలు భారత్‌లో మళ్లీ అందుబాటులోకి రాబోతుందని జాతీయ మీడియాలో చర్చ నడుస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారి టిక్‌టాక్‌ వెబ్‌సైట్‌ అనేకమందికి అందుబాటులోకి రావడమే ఈ తరహా చర్చకు కారణమైంది. 2020లో సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతాపరమైన కారణాలతో చైనాకు చెందిన ఈ యాప్‌ని కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే. అయితే,ఇవాళ టిక్‌టాక్‌ వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చినట్లు చాలామంది పేర్కొన్నారు.

  • ‘విశాల్ 35’.. హీరోయిన్‌ ఫస్ట్ లుక్ రిలీజ్

    రవి అరసు దర్శకత్వంలో హీరో విశాల్ తన 35వ సినిమాతో రాబోతున్నాడు. ఈమూవీలో అంజలి కీలకపాత్రలో కనిపించబోతుండగా.. తాజాగా ఆమెను ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.