Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • సైలెంట్‌గా ఓటీటీలోకి అనుపమ మూవీ

    అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జులై 17న థియేటర్స్‌లో రిలీజైంది. ఇప్పుడు ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ సంస్థ సొంతం చేసుకోగా..ఈ రోజు నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేసింది.

  • ‘డ్యూడ్’ నుంచి బూమ్‌బూమ్ సాంగ్

    ప్రదీప్ రంగనాథన్-మమితా బైజు జంటగా కీర్తి శ్వరన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డ్యూడ్’. తాజాగా ఈమూవీపై మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలుపుతూ.. ‘డ్యూడ్’ నుంచి ఫస్ట్ గేర్ ఊరం బ్లడ్ (తమిళం), బూమ్‌బూమ్ (తెలుగు) సాంగ్ ఆగస్టు 28న విడుదల కాబోతుందని ప్రకటించారు. కాగా ఈ సినిమాకు సాయిఅభ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు.

  • విడుదలకు సిద్ధమైన హాలీవుడ్ హర్రర్ మూవీ!

    కంజురింగ్ యూనివర్స్‌లో రాబోతున్న చివరి భాగం ‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’. ఈ హాలీవుడ్ హర్రర్ సినిమా 2025 సెప్టెంబర్ 5న విడుదలకానుంది. ఈమేరకు మేకర్స్ పోస్టర్ వదిలారు.

  • ‘కొత్తలోక’.. రిలీజ్ డేట్ ఫిక్స్

    కళ్యాణి ప్రియదర్శన్-నస్లేన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కొత్తలోక:చాప్టర్1 చంద్ర’. ఈ సినిమా ఈనెల 28న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.

  • బాలకృష్ణ ఏర్పాటు చేసిన మెగాస్టార్ ఫొటో ఎగ్జిబిషన్‌

    HYD: ఫిల్మ్ నగర్‌లోని కల్చరల్ క్లబ్‌లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు దర్శకుడు బి.గోపాల్, నిర్మాతలు అశ్వనీదత్, కె.వెంకటేశ్వరరావు, జెమిని కిరణ్ సహా క్లబ్ సభ్యలు హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం విజయవాడకు చెందిన చిత్రకారుడు బాలకృష్ణ ఏర్పాటు చేసిన మెగాస్టార్ ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి మురిసిపోయారు. చిరంజీవితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

  • చిరు బర్త్ డే.. డైరెక్టర్ ఆసక్తికర పోస్ట్

    మెగాస్టార్ చిరంజీవిపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. నేడు చిరు పుట్టినరోజు సందర్భంగా.. ‘‘నువ్వు నా డెమీ గాడ్’’ అంటూ స్పెషల్ పోస్ట్‌ చేశాడు.

  • రజనీ ‘కూలీ’.. పవర్‌ఫుల్ సాంగ్ వచ్చేసింది!

    లోకేశ్ కనగరాజ్‌ డైరెక్షన్‌లో రజనీకాంత్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’. ఈ సినిమా రిలీజైన వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.222.5 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘కొక్కి’ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను అమోగ్ బాలాజీ పాడగా.. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ మాస్ రజనీ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.

     

  • KBC-17లో క్రికెటర్‌‌పై రూ. 25 లక్షల ప్రశ్న

    ప్రముఖ రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 17’లో రూ. 25 లక్షల కోసం అడిగిన ఒక ప్రశ్న హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ప్రశ్న “1932లో ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ తన టెస్ట్ అరంగేట్రంలో ఇంగ్లాండ్ తరపున ఏ మైదానంలో సెంచరీ చేశాడు?” అనేది. దీనికి సమాధానం తెలియని పోటీదారు సాకేత్, రూ. 12,50,000తో ఆట నుంచి నిష్క్రమించాడు. దీనికి సరైన సమాధానం ‘సిడ్నీ క్రికెట్ గ్రౌండ్’.

  • బాలీవుడ్‌ ‘రామాయణ’పై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

    బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రామాయణ’పై నిర్మాత నమిత్‌ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘భారతీయ సినీ ప్రేక్షకులే కాదు, పాశ్చాత్య దేశాల వారికీ ఈ సినిమా నచ్చకపోతే మా ఫెయిల్యూర్‌గానే భావిస్తాం’ అంటూ లేటెస్ట్‌ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘అవతార్‌’, ‘గ్లాడియేటర్‌’ తదితర హాలీవుడ్‌ చిత్రాల స్థాయిలో ‘రామాయణ’ ఉంటుందన్నారు. ఈ సినిమాతో రామాయణం గురించి ప్రపంచానికి తెలియజేయాలన్నది తమ ఉద్దేశమని తెలిపారు.

  • ‘నేను బ్రతికే ఉన్నా.. ఆ పుకార్లు నమ్మకండి’

    ‘నేను బ్రతికే ఉన్నా.. నా మరణ పుకార్లు అడ్డుకోండి’ అంటూ ప్రముఖ నటుడు రజా మురాద్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. తన మరణం గురించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ పెట్టారని, దానిపై వివరణ ఇవ్వడం వల్ల తాను అలసిపోయానని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పుకారు తనను తీవ్రంగా కలచివేసిందని, దీనిని షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రజా మురాద్ కోరారు.