హీరోయిన్ కీర్తి సురేశ్ తమిళంలో కొత్తగా మరో సినిమాకు సంతకాలు చేసినట్లు తెలిసింది. డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంతో ఓ కొత్త దర్శకుడు తెరకు పరిచయం కానున్నట్లు సమాచారం. హీరోయిన్ ప్రాధాన్య చిత్రంలో దర్శకుడు మిస్కిన్ ఓ ప్రధాన పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి తాజాగా మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. ‘పరదా’లో నటించిన దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలో క్రిషంద్ తెరెకెక్కించిన వెబ్ సిరీస్ ‘4.5 గ్యాంగ్’. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆగస్టు 29 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.
-
‘మెగా158’.. కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్!
మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు బాబీ కాంబోలో ‘మెగా158’ చిత్రం తెరకెక్కనుంది. నేడు చిరు బర్త్ డే సందర్భంగా.. ఈ మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
-
దర్శకురాలిగా హీరోయిన్ సమంత!
హీరోయిన్ సమంత మరో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే నటిగా అలరించిన ఆమె.. దర్శకురాలిగా మెగాఫోన్ పట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ క్యూట్ లవ్ స్టోరీని సిద్ధం చేసిందని.. తానే డైరెక్షన్ వహించాలనుకుంటోందని టాక్. ఇప్పటికే కొన్ని యంగ్ అప్‌కమింగ్ ఆర్టిస్టులను సామ్ సంప్రదించినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై సమంత నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
-
పవర్‌స్టార్ బర్త్ డేకు ‘OG’ సర్‌ప్రైజ్!
సెప్టెంబర్ 2 పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పుట్టిన రోజు సంద్భంగా ఆయన నటించిన ‘జల్సా’ సినిమా రీ-రిలీజ్‌కానుంది. దీంతో పాటు పవన్ ‘OG’ మూవీలోని సాంగ్, టీజర్‌ను ప్రదర్శించనున్నారు.
-
ప్రముఖ పంజాబీ నటుడు జస్విందర్ భల్లా కన్నుమూత
ప్రముఖ పంజాబీ నటుడు, కమెడియన్ జస్విందర్ భల్లా(65) కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన భల్లా రెండు రోజుల క్రితం మొహలీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు అక్కడే తుది శ్వాస విడిచారు. ‘జాట్ అండ్ జూలియట్’, ‘సర్దార్ జీ’, ‘క్యారీ ఆన్ జట్టా’ వంటి హిట్ చిత్రాలతో గుర్తింపుపొందారు. 2024లో వచ్చిన ‘షిండా షిండా నో పాపా’ భల్లా చివరి చిత్రం.
-
బ్యూటీఫుల్‌గా మెరిసిపోతున్న జాన్వీ!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలో మెరూన్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతోంది.
-
టాలీవుడ్‌కు బాలీవుడ్ స్టార్ నటి కూతురు!
బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతుంది. ఘట్టమనేని వారసుడు రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ ఈ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి అజయ్ భూపతి దర్శకుడు. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ 15 నుంచి మొదలు కాబోతున్నట్లు టాక్. ఈ షూట్‌లో రాషా తడానీ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
-
సిద్ధేశ్వరాలయంలో మంచు మనోజ్ దంపతుల పూజలు
AP:హీరో మంచు మనోజ్ తన సతీమణి మౌనికతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లాలో సందడి చేశారు. అమరాపురం మండలం హేమావతి గ్రామంలోని హెంజేరు సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. మనోజ్ దంపతులకు స్వాగతం పలికారు. అందరూ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనోజ్‌ను ఆయన అభిమానులు, కూటమి నేతలు గజమాలతో సత్కరించారు.
-
‘మదరాసి’ ట్రైలర్ డేట్ ఫిక్స్
శివ కార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మదరాసి’. ఈ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ ఆగస్టు 24న జరగబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.