ప్రధాని మోదీకి ఒకప్పుడు భద్రతా అధికారిగా పనిచేసిన ఉత్తరాఖండ్‌కు చెందిన లక్కీ బిష్ట్, ఇప్పుడు నటుడిగా మారారు. భారత సైన్యంలో స్పై, స్నైపర్‌గా పనిచేసిన ఆయన “సేన – గార్డియన్స్ ఆఫ్ ది నేషన్” అనే వెబ్ సిరీస్‌లో అతిథి పాత్రలో కనిపించారు. తన సైనిక అనుభవాలు నటనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన తెలిపారు. ఈ వెబ్ సిరీస్‌లో విక్రమ్ సింగ్ చౌహాన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, యశ్‌పాల్ శర్మ, షిర్లే సేథియా వంటి వారు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
చిరు-బాలయ్య కాంబోలో సినిమా.. డైరెక్టర్ ఏమన్నారంటే?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రానికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ రోజు టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘‘ఎవరూ ఊహించని కాంబినేషన్‌ను మీరు సెట్ చేస్తారు. అలాంటిది చిరంజీవి-బాలకృష్ణ కాంబోలో మీ దర్శకత్వంలో సినిమా తీస్తారా’’ అని మీడియా ప్రశ్నకు అనిల్ రావిపూడి ఈ విధంగా సమాధానమిచ్చారు.
-
కామ పిశాచి.. హీరోపై భార్య ఆరోపణలు
కొందరి యువతులతో అక్రమ సంబంధాలు, అదనపు కట్నం కోసం వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ హీరో ధర్మమహేష్‌పై ఆయన భార్య గౌతమి మండిపడ్డారు. పీరియడ్స్ సమయంలోనూ సెక్సువల్‌గా వేధించిన కామ పిశాచి అంటూ ఆమె ఆరోపించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన గౌతమి.. మహేష్‌ను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు వీరి మధ్య గొడవలపై మహేష్‌కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం.
-
చిరు-వెంకీ కాంబోలో సంక్రాంతికి సర్‌ప్రైజ్
అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో రాబోతున్న చిత్రానికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. నేడు చిరు పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ టైటిల్‌కు చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ స్ఫూర్తి అని అనిల్ రావిపూడి అన్నారు. ఈ సినిమాకు వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో పాటు కీలక పాత్రలో నటించనున్నారని, సంక్రాంతికి ఈ మెగా మల్టీస్టారర్ సర్‌ప్రైజ్ ఉంటుందని తెలిపారు.
-
మెగాస్టార్‌కు ఐకాన్ స్టార్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి నేడు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీంతో ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు,సినీ స్టార్స్ ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ విషెస్ చెబుతున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే.. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు’ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కలిసి డ్యాన్స్ చేస్తోన్న ఫొటోను పంచుకున్నారు.
-
‘పరదా’ మూవీ రివ్యూ
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పరదా’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘పడతి’ అనే ఊరిలో పరదా ఆచారం తప్పితే ఆత్మార్పణ చేసుకోవాలనే కథాంశంతో రూపొందింది. అనుపమ పరమేశ్వరన్, సంగీత, దర్శన రాజేంద్రన్ నటన సినిమాకు ప్రధాన బలం. కథాంశం కొత్తగా ఉన్నప్పటికీ, ద్వితీయార్థం నెమ్మదిగా సాగడం మైనస్. రేటింగ్ 2.5/5.
-
‘మన శంకరవరప్రసాద్‌గారు’లో వీఎఫ్‌ఎక్స్ తక్కువ
చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో అనిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కచ్చితంగా ఈ సినిమా మీ అంచనాలను అందుకుంటుంది. ఇందులో ఆయన కనిపించిన లుక్ ఒరిజినల్. వీఎఫ్ఎక్స్ చాలా తక్కువ వాడాం. 5 శాతం వీఎఫ్‌ఎక్స్ కూడా లేవు. చిరంజీవి ఈ లుక్ కోసం ఎంతో కష్టపడ్డారు ’ అని అనిల్ రావిపూడి తెలిపారు.
-
చిరు బర్త్ డే.. రామ్‌చరణ్ ఎమోషనల్ వీడియో
నేడు మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన తన కుటుంబంతో కలిసి గోవాలో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరు తనయుడు రామ్‌చరణ్ తన తండ్రికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. చరణ్ తన తండ్రి చిరంజీవికి కేక్ తినిపిస్తూ, ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.
-
మీ మాట వినని సీఎంను అరెస్ట్ చేస్తారా?: ప్రకాశ్‌రాజ్
సీఎం, పీఎంకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త బిల్లును ఉద్దేశించి నటుడు ప్రకాశ్‌రాజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘మీరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక ఓ కుట్ర దాగి ఉందా? మీ మాట వినని మాజీ లేదా ప్రస్తుత ముఖ్యమంత్రిని అరెస్టు చేసి, మీకు నచ్చిన ఉప ముఖ్యమంత్రిని ఆ కుర్చీలో కూర్చోబెట్టే ప్లాన్ ఏమైనా ఉందా?’’ అని ఆయన ప్రశ్నించారు.
-
‘మన శంకరవరప్రసాద్‌గారు’లో చిరంజీవి అలా కనిపిస్తారు: అనిల్
చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో అనిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ నేను చిన్నప్పటినుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. మీరందరూ చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో దానికి రెండింతలు ‘మన శంకరవరప్రసాద్‌గారు’లో చూస్తారు’’ అని చెప్పారు.