సెప్టెంబర్ 2 పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పుట్టిన రోజు సంద్భంగా ఆయన నటించిన ‘జల్సా’ సినిమా రీ-రిలీజ్‌కానుంది. దీంతో పాటు పవన్ ‘OG’ మూవీలోని సాంగ్, టీజర్‌ను ప్రదర్శించనున్నారు.
సెప్టెంబర్ 2 పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పుట్టిన రోజు సంద్భంగా ఆయన నటించిన ‘జల్సా’ సినిమా రీ-రిలీజ్‌కానుంది. దీంతో పాటు పవన్ ‘OG’ మూవీలోని సాంగ్, టీజర్‌ను ప్రదర్శించనున్నారు.
ప్రముఖ పంజాబీ నటుడు, కమెడియన్ జస్విందర్ భల్లా(65) కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన భల్లా రెండు రోజుల క్రితం మొహలీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు అక్కడే తుది శ్వాస విడిచారు. ‘జాట్ అండ్ జూలియట్’, ‘సర్దార్ జీ’, ‘క్యారీ ఆన్ జట్టా’ వంటి హిట్ చిత్రాలతో గుర్తింపుపొందారు. 2024లో వచ్చిన ‘షిండా షిండా నో పాపా’ భల్లా చివరి చిత్రం.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలో మెరూన్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతోంది.
బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతుంది. ఘట్టమనేని వారసుడు రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ ఈ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి అజయ్ భూపతి దర్శకుడు. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ 15 నుంచి మొదలు కాబోతున్నట్లు టాక్. ఈ షూట్‌లో రాషా తడానీ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
AP:హీరో మంచు మనోజ్ తన సతీమణి మౌనికతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లాలో సందడి చేశారు. అమరాపురం మండలం హేమావతి గ్రామంలోని హెంజేరు సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. మనోజ్ దంపతులకు స్వాగతం పలికారు. అందరూ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనోజ్‌ను ఆయన అభిమానులు, కూటమి నేతలు గజమాలతో సత్కరించారు.
శివ కార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మదరాసి’. ఈ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ ఆగస్టు 24న జరగబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
ప్రధాని మోదీకి ఒకప్పుడు భద్రతా అధికారిగా పనిచేసిన ఉత్తరాఖండ్‌కు చెందిన లక్కీ బిష్ట్, ఇప్పుడు నటుడిగా మారారు. భారత సైన్యంలో స్పై, స్నైపర్‌గా పనిచేసిన ఆయన “సేన – గార్డియన్స్ ఆఫ్ ది నేషన్” అనే వెబ్ సిరీస్‌లో అతిథి పాత్రలో కనిపించారు. తన సైనిక అనుభవాలు నటనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన తెలిపారు. ఈ వెబ్ సిరీస్‌లో విక్రమ్ సింగ్ చౌహాన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, యశ్‌పాల్ శర్మ, షిర్లే సేథియా వంటి వారు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రానికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ రోజు టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘‘ఎవరూ ఊహించని కాంబినేషన్‌ను మీరు సెట్ చేస్తారు. అలాంటిది చిరంజీవి-బాలకృష్ణ కాంబోలో మీ దర్శకత్వంలో సినిమా తీస్తారా’’ అని మీడియా ప్రశ్నకు అనిల్ రావిపూడి ఈ విధంగా సమాధానమిచ్చారు.
కొందరి యువతులతో అక్రమ సంబంధాలు, అదనపు కట్నం కోసం వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ హీరో ధర్మమహేష్‌పై ఆయన భార్య గౌతమి మండిపడ్డారు. పీరియడ్స్ సమయంలోనూ సెక్సువల్‌గా వేధించిన కామ పిశాచి అంటూ ఆమె ఆరోపించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన గౌతమి.. మహేష్‌ను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు వీరి మధ్య గొడవలపై మహేష్‌కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం.
అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో రాబోతున్న చిత్రానికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. నేడు చిరు పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ టైటిల్‌కు చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ స్ఫూర్తి అని అనిల్ రావిపూడి అన్నారు. ఈ సినిమాకు వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో పాటు కీలక పాత్రలో నటించనున్నారని, సంక్రాంతికి ఈ మెగా మల్టీస్టారర్ సర్‌ప్రైజ్ ఉంటుందని తెలిపారు.