అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో రాబోతున్న చిత్రానికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. నేడు చిరు పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ టైటిల్‌కు చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ స్ఫూర్తి అని అనిల్ రావిపూడి అన్నారు. ఈ సినిమాకు వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో పాటు కీలక పాత్రలో నటించనున్నారని, సంక్రాంతికి ఈ మెగా మల్టీస్టారర్ సర్‌ప్రైజ్ ఉంటుందని తెలిపారు.