నేటి నుంచి సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి. 22.5 శాతం వేతన పెంపునకు నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు ఆమోదం తెలిపారు. మొదటి ఏడాది 12.5 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో 18 రోజుల పాటు నిలిచిన షూటింగ్స్.. ఇవాళ్టి నుంచి మొదలు కానున్నాయి.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
VIDEO: NTR ఫ్యాన్స్ నిరసన
AP: Jr.NTRపై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎన్టీఆర్ అభిమానులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యపై టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను కలుపుకొని దగ్గుబాటి ఇంటిని సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు.
-
RGV ఆసక్తికర ట్వీట్
వార్2 సినిమా విషయంలో నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘నాగవంశీ ఓ దయగల ప్రొడ్యూసర్. ట్రోల్స్ ఆయనను ఎప్పటికీ కిందకు లాగలేవు. పది రెట్ల వేగంతో ఆయన ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు’’ అంటూ పేర్కొన్నారు. కాగా ‘కింగ్డమ్’, ‘వార్2’ సినిమాల వల్ల నాగవంశీకి భారీ నష్టాలు వచ్చినట్లు ప్రచారం జరగడంతో నెటిజన్లు అతడిపై ట్రోల్స్‌కు దిగుతున్నారు.
-
చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే?
ఇవాళ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అయితే చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదును నిర్మాత కేఎస్ రామారావు ఇచ్చారు. 1988లో వచ్చిన మరణమృదంగం సినిమా ముందు వరకూ చిరంజీవిని సుప్రీం హీరో అని పిలిచేవారు. ఆ తర్వాతనే అన్ని టైటిల్ కార్డ్స్‌లో చిరంజీవి పేరు ముందు మెగాఫ్టార్ అని పడుతోంది. ఆ తర్వాత నాగబాబును మెగా బ్రదర్, రామ్ చరణ్‌ను మెగా పవర్ స్టార్ అని పిలుస్తున్నారు.
-
సినీ కార్మికుల వేతన పెంపుపై చిరంజీవి పోస్టు
సినీ కార్మికుల వేతన పెంపునకు అంగీకారం కుదరడంపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను చాలా సామరస్యపూర్వకంగా, ఇటు నిర్మాతలకు, అటు కార్మికులకు సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. తెలుగు చిత్రసీమ అభివృద్ధికి సీఎం తీసుకొంటున్న చర్యలు అభినందనీయం’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
-
రేపటి నుంచి షూటింగ్‌లు.. 22.5% వేతనాల పెంపు
తెలంగాణ ప్రభుత్వం జోక్యంతో టాలీవుడ్ వివాదం కొలిక్కి వచ్చింది. 18 రోజుల విరామం తర్వాత రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు పునఃప్రారంభం కానున్నాయి. మూడేళ్ల కాలానికి 22.5శాతం వేతనాల పెంపునకు ఫెడరేషన్, నిర్మాతల మధ్య అంగీకారం కుదిరింది. మొదటి సంవత్సరం 12.5%, రెండో ఏడాది 2.5, మూడో ఏడాది 5% పెంచనున్నట్లు ప్రొడ్యూసర్లు తెలిపారు.
-
మరోసారి బాబీ-చిరు కాంబో.. క్రేజీ అప్‌డేట్!
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్వహిస్తున్న ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ రేపు సా.5:13గంటలకు ప్రకటించనున్నారు.
-
‘భద్రకాళి’.. లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్
విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా..తృప్తి హీరోయిన్‌గా నటిస్తోంది. సెప్టెంబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈనేపథ్యంలో మూవీ నుంచి ‘మారెనా’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. విజయ్ ఆంటోని సంగీతం అందించిన ఈ పాటను అభిజిత్ అనీల్‌కుమార్ పాడారు.
-
రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు ప్రారంభం
గత 17 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమను స్తంభింపజేసిన కార్మికుల సమ్మె ముగింపు దశకు చేరుకుంది. కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతల మండలి, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. లేబర్ కమిషనర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుల మధ్యవర్తిత్వంలో గురువారం జరిగిన చర్చలు ఫలించాయి. ఈ తాజా ఒప్పందంతో గత 17 రోజులుగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కానున్నాయి.
-
రవితేజ ‘మాస్ జాతర’పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!
రవితేజ-శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకుడు. తాజాగా ఈ సినిమా రిలీజ్, షూటింగ్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ‘‘మాస్ జాతర ఒక సాంగ్ షూట్ చేయాల్సివుంది.. స్ట్రైక్ అయిపోతే ఎల్లుండి నుండి RFCలో షూట్ చేస్తారు. సెప్టెంబర్ 12న రిలీజ్ అనుకుంటున్నారు. దాదాపు అదే డేట్ ఫిక్స్ చేసేపనిలో ఉన్నారు మేకర్స్’’ అంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి.