మౌళి-శివానీ నాగరం జంటగా నటిస్తున్న మూవీ ‘లిటిల్ హార్ట్స్’. ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘చదువూ లేదు’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను క్యాచీ ట్యూన్‌తో సింజిత్ యెర్రమల్లి కంపోజ్ చేయగా.. జెస్సీ గిఫ్ట్ పాడారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
హీరోగా మారిన మరో దర్శకుడు
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్ర డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా మారనున్నాడు. సౌందర్య రజనీకాంత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మదన్ దర్శకుడు. ఇందులో అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా హీరో హీరోయిన్లు పరిచయం చేస్తూ వారి పోస్టర్లను విడుదల చేశారు. ఈ చిత్రంలో అభిషన్ ‘సత్య’గా.. అనశ్వర ‘మోనిష’ అనే పాత్రలో కనిపించనున్నారని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలిపారు.
-
‘కర్మణ్యే వాధికారస్తే’ విడుదలకు సిద్ధం!
బ్రహ్మాజీ, శత్రు, మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కర్మణ్యే వాధికారస్తే’. అమర్ దీప్ చల్లపల్లి తెరకెక్కిస్తున్న ఈమూవీ సెప్టెంబర్ 19న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
-
‘పెద్ది’.. 1000 మంది డ్యాన్సర్లతో మాస్ సాంగ్!
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వినాయక చవితి వేళా చిత్రబృందం షూట్‌లో పాల్గొంది. మైసూరులో మొదలైన తాజా షెడ్యూల్‌లో బుధవారం ఓ మాస్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. జానీ మాస్టర్ ఆధ్వర్యంలో రామ్‌చరణ్‌తోపాటు 1000 మందికిపైగా డ్యాన్సర్లతో సాంగ్ షూట్ చేస్తున్నారు. సెట్స్ నుంచే చిత్రబృందం ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు వీడియో విడుదల చేసింది.
-
‘మకుటం’తో విశాల్ మరో ప్రయోగం!
హీరో విశాల్ తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రానికి సిద్ధం అయ్యాడు. ఆయన నటిస్తున్న ‘మకుటం’ మూవీలో మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించి అలరించబోతున్నాడు. రవి అరసు దర్శకుడు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విశాల్.. యంగ్, మిడిల్ ఏజ్, ఓల్డేజ్ లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
-
Video: గణపతి పూజలో మెగాస్టార్ ఫ్యామిలీ
వినాయక చవితి అంటే పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన పండుగ. నేడు గణపయ్యను ప్రతిష్టించి పూజ చేస్తారు. ఈ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో కలిసి గణపతి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరు పూజ నిర్వహించిన హారతి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (Video)
-
మంచు లక్ష్మి ‘దక్ష’ టీజర్ చూశారా?
ఐదేళ్ల తరువాత నటి మంచు లక్ష్మి ‘దక్ష’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వంశీకృష్ణ దర్శకుడు. ఇందులో మంచు లక్ష్మి డైనమిక్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. మంచు మోహన్‌బాబు, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌లో పదేళ్ల తరువాత ‘దక్ష’ సినిమా రిలీజ్ కానుంది. వినాయక చవితి సందర్భంగా బుధవారం ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
-
భర్తతో గణపయ్య పూజలో మెగా కోడలు
మెగా కోడలు లావణ్య త్రిపాఠి త్వరలోనే తల్లి కాబోతోంది. నేడు వినాయక చవితి సందర్భంగా ఓ స్పెషల్ ఫోటో షేర్ చేసింది. అందులో భర్త వరుణ్ తేజ్‌తో కలిసి గణపయ్య ముందు కూర్చుంది. వరుణ్ నేలపై కూర్చోగా.. లావణ్య ప్రెగ్నెంట్ కావడంతో కుర్చీపై కూర్చుని దేవుడికి నమస్కరిస్తోంది. అదే సమయంలో కెమెరావైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తోంది. ఇందులో లావణ్య బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది.
-
చీరకట్టులో అందాల మళవిక మోహనన్
హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా చీరకట్టులో ఉన్న ట్రెడిషనల్ ఫోటోలు నెట్టింట పోస్ట్ చేసింది. ఈ అమ్మడు ఓ వైపు పద్దతిగా ఆకట్టుకుంటూనే తన అందాలతో ఆకర్షిస్తోంది.