బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్వహిస్తున్న ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ రేపు సా.5:13గంటలకు ప్రకటించనున్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘భద్రకాళి’.. లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్
విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా..తృప్తి హీరోయిన్‌గా నటిస్తోంది. సెప్టెంబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈనేపథ్యంలో మూవీ నుంచి ‘మారెనా’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. విజయ్ ఆంటోని సంగీతం అందించిన ఈ పాటను అభిజిత్ అనీల్‌కుమార్ పాడారు.
-
రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు ప్రారంభం
గత 17 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమను స్తంభింపజేసిన కార్మికుల సమ్మె ముగింపు దశకు చేరుకుంది. కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతల మండలి, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. లేబర్ కమిషనర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుల మధ్యవర్తిత్వంలో గురువారం జరిగిన చర్చలు ఫలించాయి. ఈ తాజా ఒప్పందంతో గత 17 రోజులుగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కానున్నాయి.
-
రవితేజ ‘మాస్ జాతర’పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!
రవితేజ-శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకుడు. తాజాగా ఈ సినిమా రిలీజ్, షూటింగ్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ‘‘మాస్ జాతర ఒక సాంగ్ షూట్ చేయాల్సివుంది.. స్ట్రైక్ అయిపోతే ఎల్లుండి నుండి RFCలో షూట్ చేస్తారు. సెప్టెంబర్ 12న రిలీజ్ అనుకుంటున్నారు. దాదాపు అదే డేట్ ఫిక్స్ చేసేపనిలో ఉన్నారు మేకర్స్’’ అంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి.
-
‘రావు బహదూర్’ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్!
వెంకటేశ్ మహా దర్శకత్వంలో సత్య దేవ్ ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం ‘రావు బహదూర్’. ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పిస్తున్నారు. ఇటీవలే దీని టీజర్‌ను దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో 6 మిలియన్ పైగా వ్యూస్ రాబట్టి.. ట్రెండింగ్‌తో దూసుకుపోతుందని మేకర్స్ తెలిపారు.
-
‘కిష్కింధపురి’.. డబ్బింగ్ షురూ చేసిన హీరో!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న మూవీ ‘కిష్కింధపురి’. కౌషిక్ పెగళ్లపాటి దర్శకుడు. ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో మేకర్స్ వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా హీరో డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లుక్‌ను షేర్ చేశారు.
-
‘SSMB29’ మూవీ కోసం ‘అవతార్’ డైరెక్టర్!
రాజమౌళి-మహేశ్‌బాబు కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘SSMB29’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ‘అవతార్’ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్‌తో ఈ మూవీ ఫస్ట్‌లుక్, గ్లింప్స్ లాంచ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేశాడట. దీంతో వరల్డ్ మూవీ లవర్స్ ఫోకస్‌ను తనవైపునకు తిప్పుకునేలా భారీ స్కెచ్ వేశాడని అర్థమవుతోంది. మరి నిజంగానే జేమ్స్ ‘SSMB29’ కోసం వస్తాడా అనేది చూడాలి.
-
బిగ్‌బాస్ షోలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్?
హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్‌లో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతోంది. షో నిర్వాహకులు ఆయన్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం పారితోషికంపై చర్చలు జరుగుతున్నాయని, అన్నీ కుదిరితే అక్టోబర్‌లో వారం లేదా పది రోజుల పాటు ఆయన హౌస్‌లో ఉంటారని సమాచారం. టైసన్ ఎంట్రీతో షోకు అంతర్జాతీయ క్రేజ్ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ షో ఆగస్టు 24న ప్రారంభం కానుంది.
-
హృతిక్ ప్రియురాలి సినిమా.. డైరెక్ట్ ఓటీటీలో!
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రియురాలు సబా ఆజాద్ నటించిన చిత్రం ‘సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్’. ఈ మూవీని కశ్మీర్‌కు చెందిన ప్రముఖ సింగర్ రాజ్ బేగం జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు డానిష్ రెంజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఆగస్టు 29 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.
-
మెగా ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ధమాకా!
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన ‘స్టాలిన్’ చిత్రం రేపు రీ-రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీతో పాటు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ఓ స్పెషల్ ట్రీట్ లభించనుంది. పవన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ ‘ఓజి’ సాంగ్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్ కూడా ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇది మెగా అభిమానులకు డబుల్, ట్రిపుల్ ధమాకా అని చెప్పాలి.