Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • విరాట్-అనుష్కల ప్రేమాయణంపై వివేక్ అగ్నిహోత్రి

    నటి అనుష్క శర్మకు ఒకప్పుడు పక్కింటివారైన ఫిల్మ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, విరాట్-అనుష్కల ప్రేమాయణం గురించి ఒక సరదా సంఘటనను గుర్తుచేసుకున్నారు. వారి పెళ్లికి ముందు విరాట్ కోహ్లీ తరచూ అనుష్కను కలవడానికి ఇంటికి వచ్చేవాడని తెలిపారు. విరాట్‌ను చూడగానే తమ వీధిలోని పిల్లలు ఎంతో ఉత్సాహపడేవారని, అభిమానంతో అతని కారు వెనుక పరిగెత్తేవారని అగ్నిహోత్రి చెప్పారు.

  • నవంబర్‌‌లో ప్రదీప్‌ రంగనాథన్‌ ‘lik’

    ప్రదీప్‌ రంగనాథన్‌-కృతిశెట్టి జంటగా విఘ్నేష్‌ శివన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘lik’. ఈ మూవీని నవంబర్‌ 17న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.

  • మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎక్కడో తెలుసా?

    ఈనెల 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. అయితే తన 70వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం చిరు ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. తన ఫ్యామిలీతో కలిసి బర్త్‌ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఎప్పటిలాగే బెంగళూరుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లో శ్రీజ కూతురు, తన మనవరాలితో మెగాస్టార్ వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చిరువెంట ఆయన భార్య సురేఖ కూడా కనిపించారు.

  • ‘విశ్వంభర’ గ్లింప్స్ వచ్చేసింది

    మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త! ఆయన ఎంతగానో ఎదురుచూస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ గ్లింప్స్ వచ్చేసింది.  చిరంజీవి పుట్టినరోజు కానుకగా, చిత్రబృందం ఈ రోజు సాయంత్రం 6:06 గంటలకు ‘విశ్వంభర’ ప్రపంచంలోకి ఒక చిన్న కిటికీని తెరుస్తూ ఈ ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది.

     

  • అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు’

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు(రేపు) శుభాకాంక్షలు చెప్పారు. ఈమేరకు ఓ లేఖ విడుదల చేశారు. ‘‘చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ద్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య చిరంజీవికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టం. అన్నయ్యకు సంపూర్ణ ఆయుష్షుతో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.

  • ‘మెగా157’ టైటిల్‌కు ముహూర్తం ఫిక్స్

    మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న చిత్రం ‘మెగా157’. మెగా అభిమానులంతా ఈ మూవీ టైటిల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో తాజాగా మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్, గ్లింప్స్ రాబోతున్నట్లు ప్రకటించారు. ప్రసాద్ ఐమాక్స్‌లో బిగ్ స్క్రీన్‌పై రేపు ఉ.11:25 గంటలకు టైటిల్ రివీల్ చేయనున్నట్లు తెలిపారు.

  • హాట్ హాట్‌గా అందాల జాన్వీ!

    బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ తన లేటెస్ట్ హాట్ ఫొటోను ఇన్​‌స్టాలో షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు కలర్‌ఫుల్ డ్రెస్‌లో కెమెరాకు పోలిస్తూ ఆకట్టుకుంటోంది.

  • ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ రిలీజ్ డేట్ ఫిక్స్

    రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈమూవీ నవంబర్ 28న ప్రపంచవ్యప్తంగా విడుదల కానుందంటూ పోస్టర్ వదిలారు.

  • స్టైలిష్‌ లుక్‌లో రష్మిక

    హీరోయిన్ రష్మిక తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటో పంచుకుంది. ఇందులో ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించింది. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

     

  • ‘అమ్మకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా’

    అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (అమ్మ) అధ్యక్షురాలిగా నటి శ్వేతా మేనన్‌ ఎన్నిక కావడంపై హీరో మోహన్‌లాల్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘అమ్మ’కు ఎప్పుడూ తాను సహాయసహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ అసోసియేషన్‌లో 560 మంది సభ్యులు ఉన్నారని కొత్తవాళ్లు రావాలని ఆయన పేర్కొన్నారు. దీనికి ఎవరు అధ్యక్షులుగా ఉన్నా వాళ్లకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.