హీరోయిన్ రష్మిక తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటో పంచుకుంది. ఇందులో ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించింది. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
హీరోయిన్ రష్మిక తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటో పంచుకుంది. ఇందులో ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించింది. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) అధ్యక్షురాలిగా నటి శ్వేతా మేనన్ ఎన్నిక కావడంపై హీరో మోహన్‌లాల్ హర్షం వ్యక్తం చేశారు. ‘అమ్మ’కు ఎప్పుడూ తాను సహాయసహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ అసోసియేషన్‌లో 560 మంది సభ్యులు ఉన్నారని కొత్తవాళ్లు రావాలని ఆయన పేర్కొన్నారు. దీనికి ఎవరు అధ్యక్షులుగా ఉన్నా వాళ్లకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.
బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ ‘కూలీ’లో గెస్ట్ రోల్‌లో నటించారు. అయితే ఆయన ఇందులో రజనీకాంత్‌కు బీడీ వెలికించడంపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ స్పందించారు. ‘‘‘అలా చేయడంలో నాకు ఎటువంటి ఇబ్బందిలేదు. నేను రజనీకాంత్ అభిమానిని కాబట్టి ఆయనతో స్క్రిన్ షేర్ చేసుకోవడం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. నా జీవితానికి అదొక మెమరీ అవుతుంది’’ అని చెప్పుకొచ్చాడు.
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం ‘దేవర-2’. ఈ సినిమా ఆగిపోయిందని వస్తున్న ప్రచారంలో నిజం లేదని సినీవర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఈ స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యారని.. 2027 సంక్రాంతికి మూవీ విడుదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
ఈ వారం ఓటీటీలో సరికొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేయనున్నాయి. మరి అవెంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. తన పెళ్లి వార్తలపై తాజాగా స్పందించారు. నా పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తనకు పెళ్లి, కుటుంబం, పిల్లల పట్ల నమ్మకం లేదని తెలిపారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలు, రాజకీయాలపై ఉందని.. అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోనని కంగనా క్లారిటీ ఇచ్చారు.
మలయాళ స్టార్ మోహన్‌లాల్ కుమార్తె విస్మయ ‘తుడక్కమ్’ చిత్రంతో వెండితెరకు పరిచయం కాబోతోంది. ఆమె అరంగేట్రం గురించి మోహన్‌లాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘విస్మయకు నటనపై ఆసక్తి ఉందని ఎప్పుడో చెప్పింది. కానీ, నా పిల్లలు కాబట్టి గొప్పవారు కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. వారి ప్రతిభతో గుర్తింపు తెచ్చుకుంటే అది వారి భవిష్యత్తుకే మంచిది. వాళ్లు ఇండస్ట్రీకి వస్తామన్నప్పుడు కూడా ఇదే మాట చెప్పాను’’ అని తెలిపారు.
మలయాళ నటి రిని జార్జ్‌కు అసభ్య మెసేజ్‌లు పంపించి వేధింపులకు గురి చేశారని కేరళకు చెందిన కాంగ్రెస్ MLA రాహుల్ మంకూటిల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి MLA రాహుల్ రాజీనామా చేశారు. కాగా హోటల్ రావాలంటూ తనకు మెసేజ్‌లు పంపిస్తున్నారని, మూడేళ్లుగా వేధిస్తున్నారని నటి రిని జార్జ్ పేర్కొన్నారు.
విజయ రామరాజు టైటిల్ రోల్‌లో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ కబడ్డీ ప్లేయర్ నిజ జీవిత కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
బాలీవుడ్ నటి కాజోల్ రీసెంట్‌గా నటించిన మూవీ ‘మా’. జూన్ 27న థియేటర్స్‌లో రిలీజైన ఈ చిత్రం.. హారర్ అండ్ సస్పెన్స్ సీన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్ ఫ్లిక్స్’ వేదికగా రేపు (ఆగస్టు 22) నుంచి స్ట్రీమింగ్ కానుంది.