Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • MLA నుంచి ప్రాణహాని ఉంది: NTR ఫ్యాన్

    Jr.NTR గురించి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌తో ఫోన్లో మాట్లాడిన ధనుంజయ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నా అభిమాన హీరో, ఆయన తల్లి గురించి అసభ్యంగా మాట్లాడారు కాబట్టే.. ఆ ఆడియోలు బయటపెట్టాల్సి వచ్చింది. నా వెనక ఎవరో ఉండి ఇదంతా చేయించారనే దాంట్లో నిజం లేదు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఎమ్మెల్యే దగ్గుబాటి నుంచి నాకు ప్రాణహాని ఉంది’’ అని పేర్కొన్నారు.

  • దీన స్థితిలో ‘వెంకీ’ సినిమా నటుడు

    ‘వెంకీ’ సినిమాలో రవితేజ స్నేహితుడిగా నటించిన హాస్యనటుడు రామచంద్ర పక్షవాతానికి గురయ్యారు. బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టడంతో ఆయన ఎడమ చేయి, కాలు పనిచేయడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం మంచం పట్టిన ఆయన పరిస్థితి దీనంగా ఉందని చెప్పారు. ఇటీవలే ‘డీజే టిల్లు’ చిత్రంలో కూడా నటించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

     

  • నటికి అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తున్న MLA?

    ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన యువ నాయకుడు ఒకరు గత మూడు సంవత్సరాలుగా తనకు అభ్యంతరకరమైన మెసేజ్‌లు పంపుతున్నారని మలయాళ నటి రిని జార్జ్ ఆరోపించారు. తాను అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ పార్టీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. అయితే ఆ నేత ఎవరనేది ఆమె వెల్లడించలేదు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మంకూటిల్ ఈ పని చేసిఉంటారని బీజేపీ ఆరోపిస్తోంది.

  • తిరుమల శ్రీవారి సేవలో నాగచైతన్య దంపతులు

    తిరుమల శ్రీవారిని అక్కినేని నాగచైతన్య, శోభిత దంపతులు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. TTD అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

     

  • నాగ చైతన్యతో కొరటాల శివ సినిమా.. క్లారిటీ

    నటుడు నాగ చైతన్య, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో ఓ సినిమా రానున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే అది పూర్తిగా అవాస్తవమని నాగ చైతన్య టీమ్ కొట్టిపారేసింది. ప్రస్తుతం అలాంటి ప్రాజెక్ట్ ఏదీ సెట్స్‌లో లేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఒక కాంబినేషన్ కుదిరితే తామే అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించింది. ఇలాంటి రూమర్స్‌ను నమ్మొద్దని పేర్కొంది.

  • సీసీ టీవీ ఫుటేజ్‌ యూట్యూబ్‌లో పెడతాడేమో అనుకున్నా: షారుక్‌

    బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ డైరెక్ట్ చేసిన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్‌సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. దీనిపై షారుక్ స్పందించారు. ‘‘ఈ ప్రాజెక్ట్‌ కోసం ఆర్యన్‌ నాలుగేళ్లు కష్టపడ్డాడు. కొత్తగా ప్రయత్నించాలనుందని చెప్పినప్పుడు మన్నత్‌(షారుక్‌ఖాన్‌ ఇల్లు) సీసీ టీవీ ఫుటేజ్ తీసుకెళ్లి యూట్యూబ్‌లో పెడతాడేమో అని భయపడ్డాను. నాపై చూపిన ప్రేమాభిమానాలే అతడిపై కూడా చూపిస్తారని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు.

  • ప్రభాస్ గురించి హీరోయిన్ శ్రీదేవిఆసక్తికర వ్యాఖ్యలు

    ప్రభాస్‌తో ‘ఈశ్వర్’ సినిమాలో నటించిన శ్రీదేవి ఆయన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఈశ్వర్’ సమయంలోనే ప్రభాస్ స్టార్ అవుతాడని అనుకున్నాను కానీ, ఈ రేంజ్‌కు ఎదుగుతాడని ఊహించలేదని ఆమె అన్నారు. ప్రభాస్‌ది చిన్నపిల్లల మనస్తత్వమని, ఎవరికీ చెడు జరగాలని కోరుకోడని, తమ మధ్య స్నేహం ఎప్పటికీ చెరిగిపోదని శ్రీదేవి తెలిపారు.

  • ‘100% లవ్’ బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే!

    ‘100% లవ్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన నిఖిల్ అబ్బూరి  తన కామెడీ టైమింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ‘లీటల్‌ స్టార్స్‌’ అనే సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. నిఖిల్‌ను చూసిన అభిమానులు ‘ఇంత పెద్దోడు అయిపోయాడా’ అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

     

  • 18వ రోజుకు చేరుకున్న టాలీవుడ్ సమ్మె

    HYD: తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల బంద్ 18వ రోజుకు చేరుకుంది. నేడు ఫెడరేషన్ ప్రతినిధులకు, సినీ కార్మికులకు మధ్య చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే పలు దఫాలు రెండు వర్గాలు చర్చించాయి. తమకు 30 శాతం వేతనాలను పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన నేపథ్యలో షూటింగ్‌లు నిలిచిపోయాయి. అయితే కేవలం రెండు అంశాలపైనే పీటముడి పడినట్లు తెలిసింది.

     

  • ‘విశ్వంభర’ అప్‌డేట్‌.. స్పెషల్‌ వీడియో విడుదల చేసిన చిరు

    చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా విడుదల తేదీ ఆలస్యంపై చిరంజీవి వివరణ ఇచ్చారు. సినిమా రెండో భాగం మొత్తం వీఎఫ్‌ఎక్స్ మీద ఆధారపడి ఉందని, ఎలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా అత్యుత్తమంగా అందించేందుకే ఈ జాప్యం అని తెలిపారు. ఈ సినిమాను 2026వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 21న సాయంత్రం 6.06కు సినిమా గ్లింప్స్‌ విడుదల కానుంది.