Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘విశ్వంభర’ అప్‌డేట్‌.. స్పెషల్‌ వీడియో విడుదల చేసిన చిరు

    చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా విడుదల తేదీ ఆలస్యంపై చిరంజీవి వివరణ ఇచ్చారు. సినిమా రెండో భాగం మొత్తం వీఎఫ్‌ఎక్స్ మీద ఆధారపడి ఉందని, ఎలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా అత్యుత్తమంగా అందించేందుకే ఈ జాప్యం అని తెలిపారు. ఈ సినిమాను 2026వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 21న సాయంత్రం 6.06కు సినిమా గ్లింప్స్‌ విడుదల కానుంది.

  • సినిమాల కన్నా ఆరోగ్యానికే ప్రాధాన్యత: సమంత

    నటి సమంత ఇటీవల ‘గ్రాజియా ఇండియా’ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  ‘‘గతంతో పోలిస్తే ఇప్పుడు నాలో ఎంతో మార్పు వచ్చింది. ఫిట్‌నెస్‌, సినిమాలు రెండింటిపైనా దృష్టిపెట్టాను. తక్కువ ప్రాజెక్ట్‌లు చేయాలని నిర్ణయించుకున్నా. శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. ఇకపై ఒకేసారి ఐదు సినిమాలు చేయను. పని తగ్గించినప్పటికీ నాణ్యమైన కథలను మాత్రమే ఎంచుకుంటాను’’ అని చెప్పారు.

  • మెగా అభిమానుల కోసం ‘వీరాభిమాని’

    నటుడు చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని తెలిపే చిత్రం ‘వీరాభిమాని’ అని సురేశ్‌ కొండేటి అన్నారు. చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 22న ఏపీ, తెలంగాణల్లోని 70 థియేటర్లలో ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. రాంబాబు దోమకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిమానులు ఆస్వాదించాలని కోరారు. హీరో కోసం ఒక అభిమాని ఎంతవరకు వెళ్లగలడో ఇందులో ఉంటుందని చెప్పారు.

     

  • నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్.. వైరల్ అవుతున్న వీడియో

    RGV తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్ అయ్యారు. ఈక్రమంలో ఓ వీడియో వైరలవుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తన బంధువు వద్ద కిరణ్ డబ్బులు తీసుకున్నారని, ఆ డబ్బును ‘వ్యూహం’ సినిమాకు మళ్లించినట్లు తెలుస్తోంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగ్గా.. తనపై కిరణ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడని బాధితుడు ఫిర్యాదు చేయడంతో విజయవాడ పడమట పోలీసులు కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. (VIDEO)

  • అవార్డు అందుకునేందుకు ఒక్క చెయ్యి సరిపోతుంది: షారుక్‌

    షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘కింగ్‌’ సినిమా షూటింగ్‌లో షారుక్‌ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. చిన్న సర్జరీ జరిగిందని, నెలా రెండు నెలల్లో పూర్తిగా కోలుకుంటానని షారుక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘జాతీయ అవార్డు అందుకునేందుకు ఒక్క చెయ్యి సరిపోతుంది. ప్రస్తుతం ఒక్క చెయ్యితోనే బ్రష్‌ చేస్తున్నా, తింటున్నా. కానీ, మీ ప్రేమను కూడగట్టుకునేందుకు మాత్రం ఒక్క చెయ్యి సరిపోదు’’ అని పేర్కొన్నాడు.

  • ఆ ప్రశ్నలను హీరోలను ఎందుకు అడగరు: అనుపమ

    ‘టిల్లు స్క్వేర్’ తర్వాత తాను మాట్లాడే విధానంలో మార్పు వచ్చిందని నటి అనుపమ పరమేశ్వరన్ అన్నారు. ఆ సినిమా విడుదలకు ముందు తనపై నెగెటివిటీ వచ్చిందని, రిలీజ్ అయ్యాక మాత్రం ప్రశంసించారని చెప్పారు. “టిల్లు స్క్వేర్’ ప్రమోషన్ సమయంలో నన్ను ఎన్నో ఇబ్బందికర ప్రశ్నలు అడిగారు. అవి కేవలం మహిళలనే అడుగుతారు. హీరోలను ఎందుకు అడగరు?” అని అనుపమ పేర్కొన్నారు.

  • మెగాస్టార్ విశ్వంభరపై రేపు భారీ అప్‌డేట్

    చిరు హీరోగా వశిష్ట డైరెక్షన్‌లో వస్తున్న విశ్వంభర సినిమా గురించి రేపు కీలక అప్‌డేట్ రాబోతోంది. దీని గురించి తాజాగా చిరు ట్వీట్ చేశాడు. ఆగస్టు 21 అంటే రేపు ఉదయం 09:09 గంటలకు ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటుందని తెలిపారు. చూస్తుంటే రేపు ఫ్రెష్ పోస్టర్‌లో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే మరో టీజర్‌ను రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • విజయ్ ‘భద్రకాళి’ నుంచి లేటెస్ట్ అప్‌డేట్!

    విజయ్ ఆంటోని-అరుణ్ ప్రభు కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘భద్రకాళి’. ఈ చిత్రానికి విజయ్ ఆంటోని స్వయంగా సంగీతాన్ని అందిస్తుండగా.. సెప్టెంబర్ 19న రిలీజ్‌కానుంది. ఈ సినిమా నుంచి ‘మారెనా’ లిరికల్ వీడియో సాంగ్ రాబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. రేపు ఉ.11:07 గంటలకు ఈ పాట విడుదల కానుందంటూ ప్రోమోను వదిలారు.(వీడియో)

  • కీర్తి సురేష్ గ్లామరస్ లుక్

    ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కీర్తి సురేష్ తాజాగా కలర్‌ఫుల్ డ్రెస్‌లో ఆకట్టుకుంది. ఈ ఫొటోలో ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే.

  • రీ-ఎంట్రీకి సిద్ధమవుతున్న మరో హీరోయిన్

    టాలీవుడ్‌లో ఒకప్పటి హీరోయిన్ రేఖ ఇప్పుడు రీ-ఎంట్రీకి సిద్ధమవుతోంది. ‘ఆనందం’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన రేఖ.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన ఇండస్ట్రీకి దూరమైంది. మళ్లీ సాలిడ్ రీ-ఎంట్రీ కోసం రేఖ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. తనకు సూట్ అయ్యే పాత్రలు ఏవి వచ్చినా చేసేందుకు రెడీగా ఉందట ఈ భామ.