Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • చేతి గాయం.. స్పందించిన షారుక్‌

    తన చేతి గాయం కావడంపై బాలీవుడ్‌ స్టార్ హీరో షారుక్‌ఖాన్‌ తాజాగా స్పందించారు. తాను హీరోగా నటిస్తున్న ‘కింగ్‌’ సినిమా షూటింగ్‌లో షారుక్‌ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చిన్న సర్జరీ జరిగిందని, నెలా రెండు నెలల్లో పూర్తిగా కోలుకుంటానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

     

     

  • అనుష్క ‘ఘాటి’ నుంచి మరో సాంగ్ వచ్చేసింది

    అనుష్క, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో క్రిష్‌ జాగర్లముడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఘాటి’. సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈనేపథ్యంలో తాజాగా మూవీ నుంచి ‘దస్సోర దస్సోర’ అంటూ సాగే సెకండ్ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ లిరికల్ వీడయో సాంగ్‌కు సాగర్ నాగవెల్లి సంగీతం అందించగా.. గీతా మాధురి,సాకేత్, శృతి రంజని కలిసి ఆలపించారు.

  • సెప్టెంబర్ 5న విడుదల కానున్న చిత్రాలివే!

    వచ్చే నెల అంటే 2025 సెప్టెంబర్ 5న ఆసక్తికర చిత్రాలు విడుదల కానున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

    • శివకార్తికేయన్ ‘మదరాసి’
    • తేజ సజ్జా ‘మిరాయ్’
    • విజయ్ ఆంటోని ‘శక్తి తిరుమగన్’
    • రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’
    • అనుష్క శెట్టి ‘ఘాటి’

  • ‘శివ’ 4K టీజర్ వాయిదా!

    నాగార్జున నటించిన ‘రగడ’ సినిమా రీ-రిలీజ్ ట్రైలర్ నేడు విడుదలైన కారణంగా ‘శివ’ 4K టీజర్‌ను వాయిదా వేశారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని చిత్రబృందం పోస్ట్ చేసింది.

  • నాగ్ బర్త్ డే స్పెషల్.. ‘రగడ’ రీ-రిలీజ్ ట్రైలర్‌

    కింగ్ నాగార్జున హీరోగా నటించిన సినిమా ‘రగడ’. వీరు పోట్ల దర్శకుడు. నాగ్ సరసన అనుష్క, ప్రియమణి హీరోయిన్లుగా నటించారు. 2010 డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం ఇప్పడు మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. కింగ్ నాగ్ పుట్టినరోజున అంటే ఆగస్టు 29న ఈమూవీని 4K వర్షన్‌లో రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈనేపథ్యంలో తాజాగా రీ-రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

  • విడాకులపై బోల్డ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

    బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే తన విడాలకుపై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘రెండేళ్ల నుంచి ఒంటరిగా ఉన్నప్పటికీ చాలా సంతోషంగా ఉన్నాను. పెళ్లి జీవితం నాకు కలిసి రాదేమో. మళ్లీ పెళ్లి చేసుకోవాలని కూడా లేదు.. అసలు పెళ్లి అనే పేరు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంటుంది. పెళ్లి నా జీవితంలో అతి పెద్ద తప్పుగా భావిస్తున్నాను’ అని తెలిపింది.

     

  • ‘నేను రెడీ’.. కావ్య థాపర్ ఫస్ట్ లుక్

    కావ్య థాపర్-హవీష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నేను రెడీ’. త్రినాధరావు దర్శకుడు. నేడు కావ్య థాపర్ బర్త్‌డే సందర్భంగా మూవీ నుంచి అమ్మడు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

  • డైరెక్టర్‌గా షారుక్‌ తనయుడు.. వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌

    బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌ తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ ‘ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’. ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ డేట్‌ను ఖరారు చేస్తూ ట్రైలర్‌ను విడుదల చేశారు. లక్ష్య, సహేర్, బాబీ దేవోల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్‌లో సల్మాన్‌ఖాన్‌, రణ్‌వీర్‌సింగ్‌ గెస్ట్ రోల్స్‌లో సందడి చేయనున్నారు. ఇందులో షారుక్‌ కూడా నటించారని సమాచారం. ఈ సిరీస్‌ సెప్టెంబరు 18 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌కానుంది.

  • ఆసక్తిగా ‘కన్యాకుమారి’ ట్రైలర్‌

    శ్రీచరణ్‌ రాచకొండ, గీత్‌ షైని జంటగా నటిస్తున్న చిత్రం ‘కన్యాకుమారి’. సృజన్‌ అట్టాడ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈనెల 27న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథతో ఈ మూవీ రూపొందింది. రైతు పాత్రలో శ్రీచరణ్‌, ఐటీ ఉద్యోగిగా స్థిరపడాలనే లక్ష్యమున్న కన్యాకుమారిగా గీత్‌ అలరించేలా ఉన్నారు.

  • హాట్ అందాలతో మెరిసిన పాయల్!

    హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ తాజాగా పోస్ట్ చేసిన ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమె పింక్ డ్రెస్ ధరించి హాట్ అందాలతో మెరిసిపోతోంది. ఈ ఫోటో నెట్టింట వైరలవుతోంది.