Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • Video: ఇది అభిమానమంటే.. ఎన్టీఆర్ కోసం అక్కడి నుంచి వచ్చింది!

    యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌ కోసం ఓ అభిమాని జపాన్ నుంచి వచ్చింది. ‘వార్-2’ సినిమా చూసేందుకు క్రిసో అనే అమ్మాయి భారతదేశానికి వచ్చింది. ఎన్టీఆర్‌కు వీరాభిమానినని.. కేవలం సినిమా చూడటం కోసమే వచ్చానని ఢిల్లీ విమానాశ్రయంలో తెలిపింది. గతంలో కూడా ఎన్టీఆర్ సినిమాల కోసం వచ్చానని, మళ్లీ ఆయన కొత్త సినిమా చూసేందుకు త్వరలో వస్తానని ఆమె వెల్లడించింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

  • రణ్‌బీర్ ‘రామాయణ’లో మరో బిగ్ స్టార్!

    నితేష్ తివారీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న బాలీవుడ్‌ చిత్రం ‘రామాయణ’. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతుంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా ఈమూవీలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్. అంతే కాకుండా.. ఈ సినిమాలో ఆయన వాయిస్ ఓవర్ కూడా ఉండనున్నట్లు సమాచారం.

  • ‘కాంచన 4’పై బాలీవుడ్ బ్యూటీ ఆసక్తికర కామెంట్స్‌!

    రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న మూవీ ‘కాంచన-4’. ఇందులో నోరా ఫతేహి, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోరా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ‘‘ఈ సినిమాతో కోలీవుడ్‌కు పరిచయం కానున్నాను. నా నటన, డ్యాన్స్ స్కిల్స్‌ను ప్రదర్శించడానికి ఇది నాకు సరైన ప్రాజెక్ట్. ఈ చిత్రంలో పూజా, లారెన్స్‌తో నటించడం సంతోషంగా ఉంది’’ అని తెలిపింది.

  • సినీ కార్మికుల సమ్మె.. సీఎం కీలక ఆదేశాలు

    TS: సినీకార్మికుల సమ్మెపై ప్రభుత్వం జోక్యం చేసుకుంది. సమస్య పరిష్కరించేందుకు ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. గత 17 రోజులుగా జరుగుతున్న ఈ సమ్మె, హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఆటంకంగా మారిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ సమ్మె కారణంగా హైదరాబాద్‌లో జరిగే పలు తెలుగు, ఇతర భాషల చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

  • దగ్గుబాటి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి: NTR ఫ్యాన్స్ సంఘాలు

    AP: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధ్యక్షులు ప్రెస్ మీట్ నిర్వహించారు. తమ తల్లి లాంటి షాలిని గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. దగ్గుబాటి ప్రసాద్ టీడీపీ జెండా వెనుక ఉన్నందుకే తాము కొంత ఆలోచిస్తున్నామని, లేకపోతే తగిన బుద్ధి చెప్పేవారమని హెచ్చరించారు.

  • తేజా సజ్జా ‘మిరాయ్’ మరోసారి వాయిదా!

    హీరో తేజా సజ్జా-డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘మిరాయ్’. ఈ చిత్రం సెప్టెంబర్ 5న రిలీజ్‌కానుండగా.. ఇప్పుడు మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. అదే రోజున అనుష్క ‘ఘాటి’ సినిమా విడుదల ఉండటంతో.. సెప్టెంబర్ 12కు పోస్ట్‌పోన్ చేసినట్లు నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై టీమ్ అధికారిక ప్రకటన చేయాల్సివుంది.

  • ఆకట్టుకునేలా ‘చాయ్‌వాలా’ టీజర్

    శివ కందుకూరి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో ప్రమోద్ హర్ష తెరకెక్కిస్తున్న చిత్రం ‘చాయ్‌వాలా’. తేజు అశ్వినీ హీరోయిన్. ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా.. తాజాగా టీజర్ విడుదలైంది. ఈ కథ ప్రేమ, వారసత్వం అనే అంశాల చుట్టూ తిరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నాడు.

  • ‘కింగ్డమ్‌’.. ‘రగిలే రగిలే’ ఫుల్ సాంగ్ వచ్చేసింది

    విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంతో వచ్చిన చిత్రం ‘కింగ్డమ్‌’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌. ఈ సినిమా జులై 31న విడుదలైంది. తాజాగా ఈ మూవీలోని ‘రగిలే..రగిలే’ ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా సంగీత అందించిన అనిరుధ్‌ ఈ పాటను ఆలపించాడు.

  • ఆ టైం ఇంకా రాలేదు: నిర్మాత నాగవంశీ

    నిర్మాత నాగవంశీ ‘వార్-2’ సినిమాతో భారీ నష్టాలు వచ్చినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. సినిమాలు ఆపేస్తున్నాడని వస్తున్న పుకార్లపై ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ‘‘మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు క్షమించండి.. ఆ సమయం ఇంకా రాలేదు. తాను మరో 10-15 ఏళ్లపాటు సినిమాలు నిర్మిస్తానని, త్వరలో ‘మాస్ జాతర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తాను’’ అని ఆయన ట్వీట్ చేశారు.

  • ‘వార్‌ 2’.. ‘దునియా సలాం అనాలి’ ఫుల్‌ వీడియో సాంగ్

    ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ నటించిన మల్టీస్టారర్ మూవీ ‘వార్‌ 2’ ఈనెల 14న విడుదలై హిట్ టాక్ దూసుకుపోతోంది. తాజాగా ‘దునియా సలాం అనాలి’ అంటూ హృతిక్‌రోషన్‌, ఎన్టీఆర్‌ కలిసి డ్యాన్స్‌ చేసిన సాంగ్‌ ఫుల్‌ వీడియో విడుదలైంది. ఇక థియేటర్‌లో ఈ పాటను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు.