Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • 100వ సినిమాపై నాగార్జునపై క్లారిటీ

    కింగ్ నాగార్జున 100వ సినిమాపై అంతటా ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ సినిమాపై ఆయన స్పందించారు. ఓ షోకు చీఫ్‌ గెస్ట్‌గా హాజరైన నాగార్జున మాట్లాడుతూ.. ‘ఆకాశం’ ఫేం రా కార్తీక్‌ దర్శకత్వంలో తన వందో సినిమా చేస్తున్నట్టు చెప్పారు. గత కొన్నినెలలుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు కొనసాగుతున్నాయని కూడా తెలిపారు. ఈ మూవీ పవర్‌ ప్యాక్‌డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు.

  • డైరెక్టర్‌గా మారిన మెగా హీరోయిన్!

    బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌ తన సొంత నిర్మాణ సంస్థలో ఓ భారీ యాక్షన్‌ డ్రామాను నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో హీరోయిన్ నేహా శర్మ తొలిసారి దర్శకురాలిగా మారింది. ఇంకా పేరు ఖరారు కాని ఈ ప్రాజెక్ట్‌లో సిద్ధాంత్‌ చతుర్వేది, మోహిత్‌ కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది 1945 నేపథ్యంలో పీరియాడికల్‌ డ్రామాగా సాగే కథని సమాచారం.

  • మోక్షజ్ఞ ‘లవ్‌ స్టోరీ’ కోసం చూస్తున్నాడు: నారా రోహిత్‌

    సినీ ఇండస్ట్రీకి పరిచయం కావడానికి నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడని హీరో నారా రోహిత్ తెలిపారు. ఇటీవల మోక్షజ్ఞతో మాట్లాడినప్పుడు.. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో తన ఎంట్రీ ఉంటుందని మోక్షజ్ఞ చెప్పినట్లు వెల్లడించారు. సినిమాల కోసమే తన లుక్‌ను మార్చుకున్నాడని, ఒక మంచి ఫీల్‌గుడ్‌ ప్రేమకథ కోసం చూస్తున్నాడని నారా రోహిత్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

  • హీరోయిన్స్‌నే అలా అడిగి ఇబ్బందిపెడతారు: అనుపమ

    ‘టిల్లు స్క్వేర్’ తర్వాత తనపై వచ్చిన విమర్శలపై నటి అనుపమ పరమేశ్వరన్ స్పందించారు. సినిమా విడుదలకు ముందు నెగెటివిటీ వచ్చినా, తర్వాత ప్రశంసలు దక్కాయని తెలిపారు. అయితే, మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో మహిళలనే ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతారని, హీరోలను ఎందుకు అడగరని ఆమె ప్రశ్నించారు. కేవలం వ్యూస్ కోసమే ఇలాంటివి చేస్తున్నారని, వాటికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డానని ఆమె పేర్కొన్నారు.

     

  • బోల్డ్‌ సీన్స్‌లో నటిస్తేనే నా కెరీర్‌ మారింది: తమన్నా

    నటి తమన్నా ఇటీవల తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు నో-కిస్ పాలసీ పాటించడం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోయానని ఆమె తెలిపారు. అయితే ఆ తరువాత బోల్డ్, గ్లామరస్ పాత్రల్లో నటించడం మొదలుపెట్టాకనే తన కెరీర్ మారిందని చెప్పారు. ఇటీవల ‘లస్ట్ స్టోరీస్-2’, ‘జీ కర్దా’ వంటి వెబ్ సిరీస్‌లలో తమన్నా గ్లామరస్ పాత్రల్లో కనిపించారు.

  • అలాంటి కామెంట్స్‌ పెట్టినా పట్టించుకోను: అనుపమ పరమేశ్వరన్‌

    నటి అనుపమ పరమేశ్వరన్‌ ‘పరదా’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన సినిమా విడుదల కాకముందే కొందరు ఇది డిజాస్టర్‌ అవుతుందని కామెంట్స్‌ చేశారని చెప్పారు. అలాంటి నెగిటివ్ కామెంట్లను తాను పట్టించుకోనని, కష్టపడి పని చేయడంపై మాత్రమే దృష్టి పెడతానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

  • చైతూ – నితిన్‌.. కొత్త మూవీల టైటిల్స్ ఏంటి?

    హీరో అక్కినేని నాగచైతన్య.. దర్శకుడు కార్తీక్‌ దండు కలయికలో ఓ మిస్టీక్‌ థ్రిల్లర్‌ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ‘వృషకర్మ’ అనే పేరు ఖరారైనట్లు సమాచారం. ఇక హీరో నితిన్‌ త్వరలో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కించనున్న సంగతి తెలిసిందే. క్రీడా నేపథ్య కథాంశంతో రూపొందనున్న పీరియాడిక్‌ చిత్రమిది. ఈ సినిమాకి ‘స్వారీ’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

  • విశ్వనాథన్‌ అండ్‌ సన్స్‌?

    సూర్య 46వ సినిమాపై ఇటు తెలుగులోనూ.. అటు తమిళంలోనూ మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ ద్విభాషా చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర టైటిల్‌పై టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ ఇప్పటికే ఆసక్తికర చర్చ మొదలైపోయింది. దీనికి ‘విశ్వనాథన్‌ అండ్‌ సన్స్‌’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

  • ప్రభాస్‌ లుక్‌ లీక్‌.. స్పందించిన నిర్మాణ సంస్థ

    ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఫౌజీ’  అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా సోషల్‌మీడియా స్టార్‌ ఇమాన్వీ ఎస్మాయిల్‌ నటిస్తోంది. ఈ మూవీలోని ప్రభాస్ లుక్‌కు సంబంధించిన ఫొటోలు లీక్‌ కావడంపై చిత్ర నిర్మాణ సంస్థ  మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. లీకైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే సైబర్ క్రైమ్ కేసులు పెడుతాం అని హెచ్చరించింది.

     

  • ‘వెంకట రమణ’గా రానున్న వెంకటేశ్?

    వెంకటేశ్‌ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఓ సినిమా తెరకెక్కించనున్నారు.  వచ్చే నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.   కుటుంబ విలువలు, హాస్యం, భావోద్వేగాలతో కూడిన కథాంశంతో ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రానికి ‘వెంకట రమణ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.