‘అరుంధతి’ సినిమాలో బాలనటిగా నటించిన దివ్య నాగేశ్ వివాహం చేసుకున్నారు. కొరియోగ్రాఫర్ అజిత్ కుమార్‌తో 5ఏళ్లు ప్రేమలో ఉన్న దివ్య ఈ నెల 18న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి వైభవంగా జరిగింది. దివ్య పెళ్లి ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ‘అరుంధతి’ సినిమాలో నటించినందుకు గాను ఉత్తమ బాల నటిగా నంది అవార్డు అందుకున్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
చిరు అభిమానులకు గుడ్‌న్యూస్ .. రేపు సర్‌ప్రైజ్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు గుడ్‌న్యూస్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి 157వ సినిమా నుంచి ఒక రోజు ముందుగా, ఆగస్టు 21న సాయంత్రం ఒక అప్డేట్ రానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
-
17వ రోజుకు చేరిన సినీ కార్మికుల సమ్మె
HYD: టాలీవుడ్‌లో సినీ కార్మికుల సమ్మె బుధవారం నాటికి 17వరోజుకు చేరింది. ఈ నేపథ్యంలో ఉదయం 11గంటలకు నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులు సమావేశం కానున్నారు. సాయంత్రం 4గంటలకు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకులు భేటీ అవుతున్నారు. నిర్మాతలు పెట్టిన రెండు కండిషన్స్ వద్దే ఇరుపక్షాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. నేడు కార్మికుల సమ్మె పరిష్కారం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.
-
‘దైరా’ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది: పృథ్వీరాజ్ సుకుమారన్
పృథ్వీరాజ్ సుకుమారన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘దైరా’. మేఘనా గుల్జార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని అన్నారు. కశ్మీర్‌లోని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని, ఇది తన కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని తెలిపారు. కరీనాతో కలిసి నటించడం గొప్ప అనుభవం అని పేర్కొన్నారు.
-
కోలుకున్న మమ్ముట్టి.. క్యూట్ ఫొటో షేర్ చేసిన మోహన్‌లాల్
మలయాళ నటుడు మమ్ముట్టి ఆరోగ్యంపై వచ్చిన వార్తలకు మోహన్‌లాల్ ఫుల్‌స్టాప్ పెట్టారు. మమ్ముట్టి కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నారని పరోక్షంగా తెలిపారు. వారిద్దరూ కలిసి ఉన్న క్యూట్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో మమ్ముట్టి ఆరోగ్యంగా, సంతోషంగా కనిపించారు. ఈ ఫొటో వారి మధ్య ఉన్న స్నేహబంధానికి నిదర్శనంగా నిలిచింది.
-
ఓటీటీ ట్విస్ట్.. హరి హర వీరమల్లు కథలో మార్పులు
పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలోకి వచ్చింది. అయితే, ఓటీటీ వెర్షన్‌లో కొన్ని సన్నివేశాలను తొలగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలో రావడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పుల వల్ల కథలో ఎలాంటి మార్పులు జరిగాయనేది ఆసక్తికరంగా మారింది.
-
రూ.6లక్షల బడ్జెట్‌తో రూ.800 కోట్లు సంపాదించిన సినిమా ఏంటంటే?
పారానార్మల్ యాక్టివిటీ’ (2007) హారర్ చిత్రం లాభాల శాతంలో ప్రపంచ రికార్డు సృష్టించింది. కేవలం $15,000 (రూ.6 లక్షలు) బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా $194 మిలియన్లు (రూ.800 కోట్లు) వసూలు చేసింది. ఇది నిర్మాణ వ్యయంతో పోలిస్తే 1320000% లాభం. నటీనటులకు కేవలం $500 (రూ.20వేలు) పారితోషికం చెల్లించిన ఈ సినిమా అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
-
ఫేక్ అకౌంట్స్‌తో జాగ్రత్త: సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ డ్యాన్స్ వీడియోలు, యాడ్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా తన పేరుతో ఫేక్ అకౌంట్స్ నడుస్తున్నాయని గుర్తించిన సితార, “నేను కేవలం ఇన్‌స్టాగ్రమ్ మాత్రమే అఫీషియల్ అకౌంట్ కలిగి ఉన్నాను. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో నాకు అకౌంట్స్ లేవు. దయచేసి జాగ్రత్తగా ఉండండి” అంటూ అభిమానులకు అలర్ట్ ఇచ్చింది.
-
‘గుర్రం పాపిరెడ్డి’ నుంచి సాంగ్ విడుదల
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ మూవీని డార్క్ కామెడీ కథగా దర్శకుడు మురళీ మనోహర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కసిరెడ్డి, జీవన్ కీలక పాత్రలు పోషించారు.