టాలీవుడ్ సినీ కార్మికులకు వేతనాల పెంపుపై ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, ఏడు కార్మిక సంఘాల మధ్య చర్చలు జరిగాయి. తమ కష్టాలను గుర్తించి వేతన పర్సంటేజీ పెంచుతామని ఫిల్మ్ ఛాంబర్ హామీ ఇచ్చిందని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని తెలిపారు. దీనిపై బుధవారం ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. 9 టు 9 కాల్‌షీట్ విధానంపై కూడా చర్చించామని పేర్కొన్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
రూ.200 కోట్ల పారితోషికం వదులుకున్న స్టార్ హీరో!
హీరో అజిత్-దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కాంబోలో ‘AK64’ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ చిత్ర నిర్మించడానికి ఓ నిర్మాణ సంస్థ ముందుకు రాగా.. అజిత్ రూ.200 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో డిస్ట్రిబ్యూటర్ రాహుల్ ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమైయ్యాడు. అయితే రెమ్యునరేషన్‌కు బదులుగా ఓటీటీ, శాటిలైట్ హక్కులను అజిత్ తీసుకునేలా డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.
-
పవన్ ‘OG’ నుంచి క్రేజీ న్యూస్!
పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘OG’. సెప్టెంబర్ 25న విడుదలకానుంది. అయితే అదే రోజున ‘అఖండ-2’ కూడా విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పుడు ‘OG’ మాత్రమే వస్తుందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మేకర్స్ అన్ని ఏరియాల్లో బిజినెస్ కూడా క్లోజ్ చేయడంతో సినిమా విడుదల కన్ఫర్మ్ అయింది.
-
యశ్ ‘టాక్సిక్’లో మరో క్రేజీ బ్యూటీ!
కన్నడ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న మూవీ ‘టాక్సిక్’. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రంపై క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ‘పంచాయత్’ బ్యూటీ సాన్వికను ఓ ప్రత్యేక పాత్ర కోసం మేకర్స్ సంప్రదించారట. అయితే స్టోరీ నచ్చడంతో ఆమె కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చెయ్యనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
-
సుకుమార్ కుమార్తెను సన్మానించిన సీఎం
TG: ‘గాంధీ తాత చెట్టు’ సినిమాకు ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు పొందిన సుకుమార్ కుమార్తె సుకృతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు. దర్శకుడు సుకుమార్, ఆయన సతీమణి, నిర్మాత యలమంచిలి రవిశంకర్‌లు మంగళవారం ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం సుకృతిని అభినందించారు.
-
‘మీ మ్యాటర్ బయటపెడతా’.. జగపతిబాబుకు శ్రీలీల వార్నింగ్!
టాలీవుడ్ నటుడు జగపతిబాబు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్ షో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజా ఎపిసోడ్‌లో యంగ్ బ్యూటీ శ్రీలీల గెస్ట్‌గా హాజరుకాబోతుంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో జగపతిబాబు.. శ్రీలీల కౌంటర్లు ప్రేక్షకులను బాగా అలరించాయి. మరి ఫుల్ ఎపిసోడ్‌లో ఇంకా ఎలాంటి ఫన్ మోమెంట్స్ ఉన్నాయో చూడాలంటే అభిమానులు ఎదురుచూడాల్సిందే.
-
చీరకట్టులో టాలీవుడ్ చందమామ!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ట్రెడిషనల్ లుక్‌లో కనువిందు చేసింది. ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలో పింక్ డిజైనర్ చీరలో ఆకర్శించే అందాలతో ఆకట్టుకుంది.
-
అల్లు అర్జున్ ‘AA22’ కోసం దీపికా రెడీ!
అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో ‘AA22’ వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. ‘AA22’ కోసం దీపికా 100 రోజులు కాల్ షీట్ ఇచ్చిందట. ఇక ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ నవంబర్ నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ ఎక్కడ అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
-
‘సికందర్’ విషయంలో విఫలమయ్యాం: డైరెక్టర్
స్టార్ హీరోలతో షూటింగ్ చేయడం అంత సులభం కాదని డైరెక్టర్ మురుగదాస్ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మేం ‘సికందర్’ షూటింగ్ ఎక్కువగా రాత్రి సమయంలోనే చేశాం. సల్మాన్ రాత్రి 8కి సెట్స్‌కు వచ్చేవారు. స్టార్ హీరోలతో చిత్రీకరణ అంటే అన్నీ ప్రణాళిక ప్రకారం జరగవు. ‘సికందర్’ కథను అనుకున్నట్లుగా తీయలేకపోయాం. భావోద్వేగాలు ఉన్నప్పటికీ అనుకున్నవిధంగా తెరకెక్కించడంలో విఫలమయ్యాం’’ అని వివరించారు.
-
కొత్త లుక్‌లో మెగా పవర్ స్టార్!
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం చరణ్ తన లుక్‌ను పూర్తిగా మార్చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ టచ్‌తో కొత్త లుక్ కోసం చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఫోటోలు బయటకు వచ్చాయి. వాటిలో చరణ్ లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, మాస్ అటిట్యూడ్‌తో కనిపించాడు.