హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’. ఈ మూవీ ట్రైలర్‌ను రేపు మధ్యాహ్నం 12.06గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
Video: ఒక చిన్న ప్రేమ కథ చెప్తా.. ‘మోగ్లీ’ కోసం నాని!
రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మోగ్లీ’. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సాక్షి మడోల్కర్ హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘మోగ్లీ’ కోసం నేచురల్ స్టార్ నాని అంటూ ఆగస్టు 29న ఆయన నరేట్ చేసిన గ్లింప్ రాబోతున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు.
-
రామ్‌చరణ్ ‘పెద్ది’ నుంచి బిగ్ అప్‌డేట్!
రామ్‌చరణ్-జాన్వీకపూర్ జంటగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇటీవల టాలీవుడ్‌లో సమ్మె కారణంగా కొంచెం బ్రేక్ పడింది.. కానీ మళ్ళీ ‘పెద్ది’ మేకర్స్ షూటింగ్ కోసం రంగం సిద్ధం చేస్తున్నారట. నెక్ట్స్ షెడ్యూల్ కోసం మేకర్స్ మైసూరు పయనమయినట్టు సమాచారం. అంతేకాదు ఈ షెడ్యూల్‌లో మీర్జాపూర్ నటుడు దివ్యెందు శర్మ కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది.
-
లైవ్ ఈవెంట్‌లో కుప్పకూలిన నటుడు, వెంటిలేటర్‌పై చికిత్స
మాలీవుడ్ నటుడు, టెలివిజన్ ప్రెజెంటర్ రాజేష్ కేశవ్ (RK) గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం రాత్రి కొచ్చిలో ఒక లైవ్ ఈవెంట్‌లో కుప్పకూలిపోయిన ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. రాబోయే 72 గంటలు చాలా క్లిష్టమైనవని వైద్యులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
-
‘బాహుబలి:ది ఎపిక్’.. ఆ సీన్స్ కట్!
‘బాహుబలి’ 2భాగాలను కలిపి ‘బాహుబలి:ది ఎపిక్’గా అక్టోబర్ 31న విడుదలకానుంది. అయితే అందులోని ఏ సీన్స్ కట్ చేస్తారా? అని అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ‘‘రెండూ కలిపి దాదాపు 5:27గంటల రన్‌టైమ్ ఉన్నాయి. ఇందులో ‘కన్నా నిదురించరా’ పాటను, ప్రభాస్-తమన్నా మధ్య సాగే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను కూడా తొలగించాలని నిర్ణయించుకున్నాం’’ అని రాజమౌళి తెలిపారు.
-
‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ నుంచి మరో సాంగ్ రిలీజ్
నాగశౌర్య హీరోగా రానున్న సినిమా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విధి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘మై డియర్ జనతా’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్‌ను హేమచంద్ర ఆలపించగా.. హరీష్ జైరాజ్ సంగీతం అందించాడు.
-
‘స్పిరిట్’ మూవీలో మెగాస్టార్ చిరంజీవి!
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన పాత్ర కోసం చిరంజీవిని రంగంలోకి దించాలని సందీప్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. చిరంజీవిని నటింపజేయాలనుకునే పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది.
-
హీరోయిన్‌పై కిడ్నాప్ కేసు.. ముగ్గురు అరెస్ట్
కేరళలోని కొచ్చిలో ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో నటి లక్ష్మీ మీనన్‌తో పాటు ముగ్గురిపై ఎర్నాకులం నార్త్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి రెస్టారెంట్‌లో జరిగిన వాగ్వాదం తర్వాత, లక్ష్మీ గ్యాంగ్ బాధితుడిని వెంబడించి, కారులో లాక్కొని దాడి చేసిందని ఫిర్యాదు. మిథున్, అనీష్, సోనామోల్ అరెస్ట్ కాగా, లక్ష్మీ పరారీలో ఉంది.
-
వినాయక చవితి స్పెషల్.. చిరు న్యూ మూవీ పోస్టర్ రిలీజ్
చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. వినాయక చవిత శుభాకాంక్షలు తెలుపుతూ.. చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.