పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ జులై 24న విడుదలైన అభిమానులను అలరించింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా.. ఆగస్టు 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘హరిహర వీరమల్లు’ టీమ్ ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రానుంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
Mega 157: టైటిల్‌పై డైరెక్టర్ క్లారిటీ!
మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు టైటిల్ ప్రకటిస్తారా? అని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి స్పందించాడు. ‘‘చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ నెల 21న టైటిల్ ప్రకటిస్తారని తెలిసింది. నిజమేనా?’ అని హోస్ట్ అడగ్గా.. ‘అది నిజమే’ అని అనిల్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ సినిమా పేరులో సంక్రాంతి లేదని చెప్పారు.
-
కోలుకున్న మమ్ముట్టి.. త్వరలో సెట్స్‌లోకి!
మలయాళ నటుడు మమ్ముట్టి ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారు. త్వరలోనే ఆయన తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నారని నిర్మాతలు జార్జ్, ఆంటో జోసెఫ్ సోషల్ మీడియాలో ప్రకటించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతూ మమ్ముట్టి పోస్ట్ చేశారు.
-
‘వార్2’ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?
హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా ‘వార్2’. ఈనెల 14న విడుదలైన ఈమూవీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.300.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.
-
మెగాస్టార్ ‘స్టాలిన్’ రీ-రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘స్టాలిన్’. త్రిష హీరోయిన్. ఖుష్బూ, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో నటించారు. నాగబాబు నిర్మించారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘స్టాలిన్’ ట్రైలర్ విడుదలైంది.
-
ఓటీటీకి సిద్ధమైన హారర్ థ్రిల్లర్ మూవీ!
బాలీవుడ్ నటి కాజోల్ రీసెంట్‌గా ‘మా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జూన్ 27న థియేటర్స్‌లో రిలీజైన ఈ చిత్రం.. హారర్ అండ్ సస్పెన్స్ సీన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ‘మా’ ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఆగస్టు 22 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సివుంది.
-
ఆకట్టుకునేలా ‘లిటిల్ హార్ట్స్’టీజర్
మౌలి, శివానీ నాగారం జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకుడు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 12న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా టీజర్ విడుదల చేశారు. ‘నాట్ టచింగ్.. ఓన్లీ హార్ట్ టచింగ్’ అంటూ యువతను ఆకట్టుకునే అంశాలను మేళవించి మూవీని తీర్చిదిద్దుతున్నట్లు అర్థమవుతోంది.
-
దయచేసి వాటిని నమ్మకండి.. మహేష్ కూతురు పోస్ట్!
సూపర్‌స్టార్ మహేష్‌బాబు కూతురు సితార తన ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘నా పేరు మీద పలు ఫేక్ అకౌంట్స్ ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే అకౌంట్ ఉంది. ఏదైనా చెప్పాలనుకుంటే నేను దీని ద్వారానే చెబుతాను. వేరే ఏ సోషల్ మీడియాలోనూ నాకు ఖాతా లేదు. ఫేక్ అకౌంట్స్‌తో జాగ్రత్త. దయచేసి వాటిని నమ్మి మెసేజ్ చేయొద్దు’’ అని రాసుకొచ్చింది.
-
Video: ‘రామ్‌చరణ్ మూవీ వల్ల నా కెరీర్ దెబ్బతిన్నది’
రామ్‌చరణ్-సమంత జంటగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాలో ముందుగా అనుపమ పరమేశ్వరన్‌ను ఫిక్స్ చేశారట. ఆ తర్వాత ఆమె ప్లేస్‌లో సమంతను తీసుకున్నట్లు టాక్. దీనిపై అనుపమ స్పందించింది. ‘‘ఇది నిజమే.. కానీ నేను తప్పుకోలేదు.. మేకర్స్ వద్దనుకున్నారు. బయటమాత్రం చరణ్‌తో నటించడం ఇష్టం లేక ఇదంతా చేసినట్లు ప్రచారంచేశారు. దీనివల్ల అప్పట్లో నా కెరీర్ చాలా దెబ్బతిన్నది’’ అని బాధపడింది.(వీడియో)
-
హీరో సుహాస్‌కు ‘మండాడి’ టీమ్ విషెస్!
హీరో సుహాస్ ‘మండాడి’ అనే తమిళ చిత్రంలో కోలీవుడ్ నటుడు సూరితో కలిసి నటిస్తున్నాడు. అయితే నేడు సుహాస్ పుట్టినరోజు సందర్భంగా ‘మండాడి’ టీమ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది.